Begin typing your search above and press return to search.

కనీసం నా కళ్లలోకి కూడా చూడడు.. మోడీపై సోనియా హాట్ కామెంట్స్

ప్రధాని మోదీతో దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో ఒక్కసారి కూడా మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోయానని సోనియా గాంధీ తన జీవిత చరిత్ర పుస్తకంలో పేర్కొన్నట్లు కథనం. అధికారిక సమావేశాల్లో నమస్కారంతోనే సరిపెడతారని, తనతో మాట్లాడేటప్పుడు మోదీ కళ్లలోకి చూడరని ఆమె వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

By:  A.N.Kumar   |   10 Nov 2026 1:22 PM IST
కనీసం నా కళ్లలోకి కూడా చూడడు.. మోడీపై సోనియా హాట్ కామెంట్స్
X

ప్రధాని నరేంద్రమోదీలో ఓ లక్షణం ఉంది. ఆయన ఎప్పుడూ డైరెక్ట్ ఇంటర్వ్యూలు మీడియాకు ఇవ్వరు. మీడియాను ఎదుర్కొనేందుకు ముందుకు రారు. కేవలం తను సొంతంగా రికార్డ్ చేసిన వీడియోల ద్వారానే జనాలతో కాంటాక్ట్ అవుతాడు. దమ్మున్న జర్నలిస్టులకు మోడీ ఇప్పటికీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు ఇవ్వడు.. అలాగే రాజకీయ ప్రత్యర్థులతో డైరెక్ట్ గా తలపడరు. వారిని కనీసం ఎదుర్కోవడానికి కూడా సిద్ధమవ్వడు. పార్లమెంట్ లోనూ ప్రతిపక్ష నేతల నిలదీతలను ఎదుర్కోవడానికి మోడీ సిద్ధంగా ఉండడు. ఆ సెషన్లను స్కిప్ చేస్తుంటారు. ఇక తాను చెప్పాల్సింది చెప్పి వెళ్లిపోతాడు. ఈ లక్షణం మోడీలో గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఉంది. ఇప్పటికీ విదేశీ పర్యటనల్లో మోడీ అక్కడి విదేశీ మీడియాకు నేరుగా ఇంటర్వ్యూలు ఇవ్వరు. ఈ లక్షణం ఇంటా బయట మోడీపై విమర్శలకు కారణమవుతోంది. ఇప్పుడు దీన్నే పరోక్షంగా ప్రస్తావించిన సోనియా గాంధీ కనీసం తన కళ్లలోకి చూసి కూడా మోడీ మాట్లాడరు అంటూ బాంబు పేల్చారు.

రాజకీయాలు అంటే కేవలం గెలుపు ఓటముల పోరు మాత్రమే కాదు.. ప్రత్యర్థుల పట్ల ఉండాల్సిన కనీస మర్యాదలు.. ఆత్మీయ పలకరింపులు. కానీ దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నా.. ప్రధాని నరేంద్ర మోదీతో ఒక్కసారి కూడా మనస్ఫూర్తిగా మాట్లాడుకునే అవకాశం రాలేదంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన జీవిత చరిత్ర పుస్తకంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అధికారిక సమావేశాల్లో ఎదురుపడినప్పుడు కేవలం 'నమస్తే' చెప్పుకోవడమే తప్ప మనసు విప్పి మాట్లాడిన సందర్భాలు ఒక్కటి కూడా లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేయడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

ఈ వ్యాఖ్యల్లో అత్యంత చర్చనీయాంశమైన అంశం.. ఐ కాంటాక్ట్. ప్రధాని మోదీ తనతో మాట్లాడేటప్పుడు కనీసం కళ్లలోకి చూసేందుకు కూడా ఇష్టపడరని.. చూపు తిప్పుకుంటారని సోనియా ఆ పుస్తకంలో ప్రస్తావించారు. ఒకే దేశంలో.. అత్యున్నత స్థానాల్లో ఉంటూ పరస్పరం కళ్లలోకి చూసి మాట్లాడే ధైర్యం.. సంస్కృతి కరువవడం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మారుతున్న విలువలకి అద్దం పడుతోంది.

గతంలో ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, రాజీవ్ గాంధీ వంటి దిగ్గజాల హయాంలో రాజకీయంగా ఎంతటి తీవ్ర విమర్శలు ఉన్నా.. వ్యక్తిగత స్థాయిలో ఒకరినొకరు గౌరవించుకునేవారు. సభల్లో తలపడిన వారే బయట కలుసుకున్నప్పుడు ఆత్మీయంగా పలకరించుకునే సంప్రదాయం ఉండేది.

కానీ కాలం మారుతున్న కొద్దీ రాజకీయ ప్రత్యర్థుల మధ్య సంబంధాలు కేవలం యాంత్రికంగా మారిపోతున్నాయి. నేడు ప్రత్యర్థులను కేవలం రాజకీయ శత్రువులుగా చూసే ధోరణి పెరిగిపోయింది. ఒక నమస్కారం.. ఎన్నో ప్రశ్నలను మిగులుస్తోంది. ఆ నమస్కారాల వెనుక ఎలాంటి భావోద్వేగాలు లేకపోవడం.. కేవలం మొక్కుబడిగా సాగిపోవడం ప్రజాస్వామ్య ఆరోగ్యానికి అంత మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య సంభాషణల వారధులు చెదిరిపోకూడదు. సోనియా గాంధీ లేవనెత్తిన ఈ అంశం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం గురించి మాత్రమే కాదు.. మన రాజకీయ సంస్కృతి కోల్పోతున్న మానవతా విలువలకు ఒక నిలువెత్తు నిదర్శనం.