సోనియా పుస్తకంలో తెగవెతికేసిన అంశాలు ఇవే!
సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం విడుదలైంది. అయితే 2జీ, బొగ్గు, కామన్వెల్త్, అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణాలు, సిక్కుల ఊచకోత, రాహుల్ ప్రధాని అంశాల ప్రస్తావన కోసం పాఠకులు వెతికినా కనిపించలేదని కథనం పేర్కొంది. రాజకీయ అంశాలతో పాటు ఆర్‌ఎస్‌ఎస్, మోదీపై వ్యాఖ్యలు మాత్రం ఉన్నాయని తెలిపింది.
By: Garuda Media | 10 Nov 2026 8:00 PM ISTకాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు.. ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ.. తన జీవిత విశేషాలతో కూడిన `బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్` పుస్తకాన్ని రాసిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం ఎలాంటి అట్టహాసం లేకుండానే ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. కాగా.. ఈ పుస్తకం విడుదలైన వెంటనే నెటిజన్లు పలు అంశాలను తెగవెతికేశారు. ఆయా అంశాలను సోనియా పుస్తకంలో పేర్కొన్నారా? లేదా? అనేది ప్రధాన అంశం.
వీటిలో ప్రధానంగా యూపీఏ పదేళ్ల హయాంలో కీలకమైన నాలుగు కుంభకోణాలు జరిగాయి. 1) 2జీ స్పెక్ట్రం. 2) బొగ్గు గనులు. 3) కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం. 4) అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం. ఈ నాలుగు కుంభకోణాల విలువ సుమారు 5-7 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఈ అంశంపై సోనియా ఏం రాశారు..? అనేది ప్రధానంగా పాఠకులు వెతికేశారు. కానీ, సోనియాగాంధీ ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు.
మరో ముఖ్యమైన అంశం.. సిక్కుల ఊచకోత. ఇందిరాగాంధీ హయాంలో గోల్డెన్‌టెంపుల్‌లో జరిగిన ఆపరేషన్ తర్వా కాలంలోజరిగిన ఊచకోత.. వంటివి. అలానే ఇందిరాగాంధీ హత్య. ఈ అంశాలపై కూడా నెటిజన్లు, పుస్తకాలు భౌతికంగా కొనుగోలు చేసిన వారు తెగ వెతికారు. కానీ, ఇవి కూడా దీనిలో దొరకలేదు. మరో అంశం.. రాహుల్ గాంధీకి ప్రధాని పదవి. యూపీఏ హయాంలోనే రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలని అనుకున్నారు. కానీ, ఆ సమయంలో ఆయన ఒద్దన్నారు. ఈ విషయంపైనా సోనియా ఎలా స్పందించారా? అని పాఠకులు వెతికారు. కానీ, ఇవేవీ రాయలేదు.
ఎందుకు?
సోనియా గాంధీ ముందుగానే తన పుస్తకానికి ఇంట్రడక్షన్ ఇస్తూ.. ఇది పొలిటికల్ పుస్తకం కాదని.. అలాని సాహిత్య పుస్తకం కూడా కాదని.. చెప్పారు. పేరులోనే ఉన్నట్టుగా ఇది తన ప్రేమ ప్రయాణానికి మచ్చుతునక అని పేర్కొన్నా రు. దీంతో ఆయా విషయాలను ప్రస్తావించి ఉండకపోవచ్చని అందరూ భావించారు. కానీ, చిత్రం ఏంటంటే.. ఈ పుస్తకంలో అనేక రాజకీయ పరమైన అంశాలను సోనియా ప్రస్తావించారు. ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాలను తెగనాడారు. మోడీపై ప్రశంసలు గుప్పిస్తూనే.. విమర్శల బాణాలు సంధించారు.
