మోడీ మీద పోరుకు ఏపీకి సోనియా
తాజా శీతాకాల సమావేశాలలో దీనికి సంబంధించిన బిల్లుని ఆమోదించారు. రాష్ట్రపతి ఆమోదంతో అది పేరు మారు చట్టమైంది.
By: Satya P | 28 Dec 2025 10:00 AM ISTకేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పన్నెండేళ్ళుగా అధికారంలో ఉంది. మూడు సార్లు వరసగా ప్రధానిగా ప్రమాణం చేసి నరేంద్ర మోడీ కాంగ్రెసేతర ప్రధానులలో రికార్డు సృష్టించారు. మోడీని బీజేపీని మొదట్లో లైట్ తీసుకున్న కాంగ్రెస్ కి 2019 ఎన్నికలు దిమ్మదిగిరే విధంగా ఫలితాలను ఇచ్చారు. మూడు వందల పై చిలులు ఎంపీలతో కేంద్రంలో బీజేపీ అపుడు సొంతంగా రెండవసారి అధికారంలోకి వచ్చింది. ఇక 2024 లో బీజేపీకి సొంత మెజారిటీ తగ్గినా మిత్రులు అయితే బాగానే ఆదుకున్నారు. దాంతో మోడీ విషయంలో సీరియస్ గానే ఉండాల్సిన అవసరాన్ని కాంగ్రెస్ లేట్ గా అయినా గట్టిగానే గుర్తించింది.
గ్రాఫ్ పెరగడం లేదు :
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వం మీద ఎంతలా పోరాటం చేస్తున్నా గ్రాఫ్ అయితే కాంగ్రెస్ కి పెరగడం లేదు, అదే సమయంలో రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళి ప్రచారం చేసినా ఆయా చోట్ల కాంగ్రెస్ ఓటమి పాలు అవుతోంది. అంతే కాకుండా తమతో జత కట్టిన ప్రాంతీయ పార్టీలనూ ఓటమి బాట పట్టిస్తోంది. ఇది ఇండియా కూటమిలో పెద్ద చర్చగా మారింది దాంతో కాంగ్రెస్ తన రాజకీయ అస్తిత్వం నిలుపుకునేందుకు 2026 ని సరైన రాజకీయ వేదికగా భావిస్తోంది.
లోతైన చర్చ :
తాజాగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో లోతైన చర్చ సాగింది అని అంటున్నారు. కాంగ్రెస్ కి చావో రేవో అన్నట్లుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. దాంతో ఏదో విధంగా జనంలో ఉండాలని ప్రజల సెంటిమెంట్ ని పట్టుకుని మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని సీడబ్ల్యూసీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో 2926లో జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల మీద కూడా చర్చించారు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అసో, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలకు 2026 లో వరసగా ఎన్నికలు ఉన్నాయి.
గాంధీ సెంటిమెంట్ :
గాంధీల పార్టీ అయిన కాంగ్రెస్ ఇపుడు మహాత్మాగాంధీ సెంటిమెంట్ తోనే పోరాటానికి సిద్ధపడుతోంది. కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పధకాన్ని పూర్తిగా పేరు మార్చేసి వికసిత్ భారత్ జీ రాం జీ పధకంగా కొత్తగా చేశారు. తాజా శీతాకాల సమావేశాలలో దీనికి సంబంధించిన బిల్లుని ఆమోదించారు. రాష్ట్రపతి ఆమోదంతో అది పేరు మారు చట్టమైంది. దనతో మహాత్ముని పేరుని తొలగించడం మీద కాంగ్రెస్ గుర్రు మీద ఉంది. అంతే కాకుండా కేంద్ర రాష్ట్ర వాటాలలో ఏకంగా అరవై నలభై రేషియో నిధుల భాగస్వామ్యాన్ని సైతం వ్యతిరేకిస్తోంది. ఈ పధకాన్ని మెల్లగా ఎత్తివేయడానికే మోడీ ప్రభుత్వం చూస్తోంది అన్నది కాంగ్రెస్ మార్క్ ఆరోపణ. దాంతో కొత్త ఏడాది నుంచి ఈ పధకం మీదనే జనంలోకి వెళ్ళి ఆందోళనలు పెద్ద ఎత్తున నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
అక్కడ ఎంచుకుంటున్న కాంగ్రెస్ :
ఈ పధకాన్ని యూపీయే వన్ ప్రభుత్వం రూపొందించింది. యూపీఏ చైర్ పర్సన్ గా నాడు సోనియా ఉండగా దీనికి డిజైన్ చేశారు. ఇక 2006 ఫిబ్రవరి 2న ఈ పధకాన్ని నాడు ఏపీలోని అనంతపురం జిల్లా బండ్లపల్లిలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ కలసి ప్రారంభించారు. ఇక సరిగ్గా ఈ పధకానికి ఇరవై ఏళ్ళు అవుతున్న వేళ ఇపుడు మోడీ ప్రభుత్వం తిరగతోడడం మీద కూడా కాంగ్రెస్ ఆగ్రహంగా ఉంది. అందుకే సెంటిమెంట్ గా ఎక్కడ ఈ పధకాన్ని ప్రారంభించారో అక్కడ నుంచే పోరు బాట పడితే సెంటిమెంట్ గా వర్కౌట్ అవుతుందని కూడా కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు.
ఇక ఏపీలో సైతం ఎన్డీయే ప్రభుత్వం ఉంది. దాంతో తమ పోరుతో అక్కడా ఇక్కడా సెగ తగలాలాని కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేస్తోంది అంటున్నారు సోనియాగాంధీని బండ్లపల్లి కి రావాలని తాము కోరామని ఏపీసీసీ మాజీ చీఫ్ రుద్రరాజు చెప్పడం విశేషం. మరి సోనియా కనుక వస్తే మహాత్ముని పధకం సెంటిమెంట్ ప్రాంతీయ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అవుతాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
