Begin typing your search above and press return to search.

'కొండ‌'కు తాడేసిన సోము సార్‌.. !

రాజ‌కీయాల్లో తాను అనుకున్న‌ది సాధించ‌డం నాయ‌కుల‌కు అంత ఈజీకాదు. అందుకే చాలా మంది ఏదో ఆశ‌లు పెట్టుకున్నా.. వ‌చ్చిన ప‌ద‌వుల‌తోనూ.. దక్కిన దాంతోనూ సంతృప్తి చెందుతారు.

By:  Garuda Media   |   4 March 2026 7:00 AM IST
కొండ‌కు తాడేసిన సోము సార్‌.. !
X

రాజ‌కీయాల్లో తాను అనుకున్న‌ది సాధించ‌డం నాయ‌కుల‌కు అంత ఈజీకాదు. అందుకే చాలా మంది ఏదో ఆశ‌లు పెట్టుకున్నా.. వ‌చ్చిన ప‌ద‌వుల‌తోనూ.. దక్కిన దాంతోనూ సంతృప్తి చెందుతారు. కానీ, బీజేపీ సీని య‌ర్ నాయ‌కుడు, ఆర్ ఎస్ ఎస్ మూలాలు కూడా ఉన్న ప్ర‌స్తుత ఎమ్మెల్సీ సోము వీర్రాజు త‌న ప్ర‌య‌త్నం లో ఎక్క‌డా లోపం రాకుండా.. లేకుండా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆయ‌న అనుకున్న‌ది కూడా సాధిస్తు న్నారు. గ‌తంలో ఎమ్మెల్సీ సీటు వ‌స్తుందో రాదో అనుకున్న వారికి ఆయ‌న షాకిచ్చారు.

నిజానికి గ‌తంలో ఎమ్మెల్సీ సీటు వ్య‌వ‌హారం బీజేపీలో తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. సోము వీర్రాజు లైన్‌లో ఉన్న విష‌యం కూడా చాలా మందికి తెలియ‌దు. నేరుగా ఢిల్లీకి వెళ్లి.. తాను అనుకున్న‌ది ఆయ‌న సాధిం చారు. ఇక‌, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న‌ప్ప‌టికీ.. త‌న మ‌న‌సులో మ‌రో కోరికను ఆయ‌న తీర్చుకునే ప్ర‌య త్నంలో ఉన్నార‌ని తెలుస్తోంది. అదే.. మంత్రి వ‌ర్గంలో చోటు. జీవితంలో ఒక్క‌సారైనా మంత్రి అవ్వాల‌ని నాయ‌కుల‌కు ఉన్న‌ట్టే.. సోముకు కూడా ఉంది.

అయితే.. అది ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న బ‌య‌ట పెట్ట‌లేదు. కానీ, ఇప్పుడుకూడా మౌనంగా ఉంటే.. అవ‌కాశం మ‌ళ్లీ వ‌స్తుందో రాదో అన్న చింత ఆయ‌న‌ను వెంటాడుతోంది. ఈ క్ర‌మంలోనేకొండ‌కు తాడేసిన‌ట్టుగా.. సోము వీర్రాజు.. త‌న ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసుకుంటున్నారు. త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న ఉంటుంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌భుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్త‌యిన ద‌రిమిలా.. మంత్రివ‌ర్గాన్ని ప్ర‌క్షాళ‌న చేయ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

ఈ క్ర‌మంలో త‌నకు మంత్రి ప‌ద‌వి కావాల‌ని.. భావిస్తున్న సోము వీర్రాజు.. ఆర్ ఎస్ ఎస్ వైపు నుంచి న‌రుక్కొస్తున్నార‌ని తెలిసింది. గ‌తంలో ఎమ్మెల్సీ సీటు కూడా.. అటు నుంచే ఆయ‌న సాధించారు. ఈ క్ర‌మం లో ఇప్పుడు కూడా.. ఆర్ ఎస్ ఎస్ ద్వారా త‌న ప‌నిని సాధించే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నార‌ని బీజేపీలో సోము వ‌ర్గం చెబుతోంది. త‌ద్వారా.. బీజేపీ నుంచి ఆయ‌న సిఫార‌సు చేయించుకునే ప్ర‌య‌త్నం లో ఉన్నార‌ని స‌మాచారం. మొత్తానికి కొండ‌కు తాడేశారు.. వ‌స్తే కొండ లేక‌పోతే.. ఎమ్మెల్సీ ఎలా నూ ఉంది కాబ‌ట్టి.. ఇప్ప‌టికి ఇంతే అని స‌రిపెట్టుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నార‌ని స‌మాచారం.