Begin typing your search above and press return to search.

ఇదేం సైడ్ బిజినెస్ రా బాబు ? డాగ్ వాకింగ్‌తోనే లక్షలు..

ఈ రోజుల్లో ఉద్యోగం వచ్చే జీతంతో ఇల్లు గడవడం కష్టమైపోతోంది. అందుకే చాలా మంది ఖాళీ సమయాల్లో ఏదో ఒక పార్ట్‌టైమ్ జాబ్ లేదా సైడ్ బిజినెస్ చేస్తుంటారు.

By:  Madhu Reddy   |   27 May 2026 10:00 PM IST
ఇదేం సైడ్ బిజినెస్ రా బాబు ? డాగ్ వాకింగ్‌తోనే లక్షలు..
X

ఈ రోజుల్లో ఉద్యోగం వచ్చే జీతంతో ఇల్లు గడవడం కష్టమైపోతోంది. అందుకే చాలా మంది ఖాళీ సమయాల్లో ఏదో ఒక పార్ట్‌టైమ్ జాబ్ లేదా సైడ్ బిజినెస్ చేస్తుంటారు. కానీ, కేవలం కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్తూ.. మన దేశంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు వచ్చే జీతం కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు ఒక యువకుడు. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాలా నిజం! నెలకు లక్షల రూపాయలు ఆదాయం ఇచ్చే ఆ క్రేజీ బిజినెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూనే పార్ట్‌టైమ్:

న్యూయార్క్‌కు చెందిన కోబీ గుడ్‌హార్ట్ అనే వ్యక్తి వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. రోజూ సిస్టమ్ ముందు కూర్చుని వర్క్ చేసే ఇతనికి కుక్కలంటే ప్రాణం. అయితే, కుక్కలపై ఉన్న ఇష్టాన్ని ఒక స్మార్ట్ వ్యాపారంగా మార్చుకోవచ్చని ఇతను నిరూపించాడు. ఇక తన ఫ్రీ టైమ్‌ను వాడుకుంటూ పార్ట్‌టైమ్ ‘డాగ్ వాకర్’గా అవతారమెత్తాడు.

మూడు పూటలా డాగ్ వాకింగ్:

ఇక కోబీ తన రెగ్యులర్ సాఫ్ట్‌వేర్ జాబ్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా టైమ్ మేనేజ్ చేస్తున్నాడు. ఉదయం ఆఫీస్‌కు వెళ్లే ముందు, మధ్యాహ్నం ఆఫీస్ లంచ్ బ్రేక్‌లో, ఆపై వీకెండ్స్ శని, ఆదివారాలు దొరికిన ఖాళీ సమయంలో కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్తుంటాడు. ఇక ఇందుకోసం ‘గుడ్‌హార్ట్ డాగ్ కో’ అనే పేరుతో ఒక పెట్-కేర్ సంస్థను కూడా స్టార్ట్ చేశాడు.

నెలకు రూ.5.72 లక్షల ఆదాయం:

ఇలా కుక్కలను సరదాగా అలా తిప్పి తీసుకువస్తున్నందుకు అతనికి నెలకు ఏకంగా 6,000 డాలర్లు వస్తున్నాయి. ఇక అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.5.72 లక్షలకు పైగా అన్నమాట. కేవలం సైడ్ బిజినెస్ ద్వారానే ఇంత భారీ మొత్తంలో అదనపు ఆదాయం సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

విదేశాల్లో పెరిగిన డిమాండ్:

న్యూయార్క్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో బిజీ లైఫ్ వల్ల చాలా మంది తమ పెంపుడు కుక్కలను బయటకు తీసుకెళ్లలేకపోతున్నారు. అలాంటి వారంతా ఇలాంటి డాగ్ వాకర్స్ సేవలను వాడుకుంటున్నారు. కుక్కలను జాగ్రత్తగా చూసుకుంటూ, వాటితో ఆడుకుంటూ టైమ్ స్పెండ్ చేసే కోబీ లాంటి వారికి అక్కడ భలే డిమాండ్ పెరిగిపోయింది.

మనకు నచ్చిన పనిని ఇష్టపడి చేస్తే, దాన్నే ఒక అద్భుతమైన సంపాదన మార్గంగా మార్చుకోవచ్చని కోబీ నిరూపించాడు. ఒకపక్క సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూనే, మరోపక్క మూగజీవాల మీద ప్రేమతో నచ్చిన పని చేస్తూ లక్షలు సంపాదిస్తున్న ఇతని ఐడియా నిజంగా సూపర్ కదూ..