పాముతో ఆస్పత్రికి.. రోడ్డుపై రిక్షాతో రచ్చ.. ఏంది గురూ ఇది!
అవును... పాము కాటుకు గురైన వ్యక్తి మధురలోని ఒక జిల్లా ఆసుపత్రిలోకి చికిత్స పొందేందుకు వెళ్లాడు. వెళ్తూ వెళ్తూ తనను కాటేసిన పామును కూడా వెంట తీసుకెళ్లాడు.
By: Raja Ch | 14 Jan 2026 10:55 AM ISTసాధారణంగా పాము కాటుకు గురైనవారు ఏమి చేస్తారు.. వెంటనే ఆస్పత్రికి వెళ్తారు.. ఇంజెక్షన్ చేయించుకుంటారు! తాజా ఘటనలో కూడా ఒక వ్యక్తిని పాము కరిస్తే.. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు కానీ.. వెళ్తూ వెళ్తూ వెంట తనను కాటేసిన పామును కూడా తీసుకుని వెళ్లాడు. దీంతో.. ఆస్పత్రి వద్ద నానా రచ్చ జరిగింది. ట్రాఫిక్ నిలిచిపోవడంతో పాటు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.
అవును... పాము కాటుకు గురైన వ్యక్తి మధురలోని ఒక జిల్లా ఆసుపత్రిలోకి చికిత్స పొందేందుకు వెళ్లాడు. వెళ్తూ వెళ్తూ తనను కాటేసిన పామును కూడా వెంట తీసుకెళ్లాడు. దీంతో అక్కడ తీవ్ర భయాందోళనలు.. ఆసుపత్రి బయట కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం.. పోలీసు జోక్యం ఏర్పడింది. ఆస్పత్రి సిబ్బంది ఎంత చెబుతున్నా.. పామును తనతోనే ఉంచుకోవాలని పట్టుబట్టాడు.. పైగా తాను వేసుకొచ్చిన ఈ-రిక్షాను రోడ్డుకు అడ్డంగా పెట్టి హల్ చల్ చేశారు. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దామ్.!
వివరాళ్లోకి వెళ్తే... మధురలోని రిక్షా డ్రైవర్ అయిన దీపక్ ను పాము కాటేసింది. ఈ సమయంలో చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి వెళ్తూ వెళ్తూ వెంట రుజువుగా తనను కాటేసిన పామును తీసుకెళ్లాడు. ఆ పామును ప్రాంగణం వెలుపల విడిచిపెట్టమని ఆసుపత్రి వైద్యులు కోరినా.. ఇది తీవ్రమైన భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తుందని వివరించినా అతడు వినిపించుకోలేదు. దీంతో వైద్యులు సీరియస్ అవ్వగా.. అందుకు నిరసనగా తన ఇ-రిక్షాను ఆసుపత్రి దగ్గర ఆపి ట్రాఫిక్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు.
ఇలా వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతుండటంతో స్థానిక పోలీసులను సంఘటనా స్థలానికి పిలిపించారు. ఈ సందర్భంగా స్పందించిన అధికారులు.. ప్రభుత్వ ఆసుపత్రిలో బతికి ఉన్న పామును ఉంచడం వల్ల కలిగే ప్రమాదాలను ప్రశాంతంగా దీపక్ కు వివరించే ప్రయత్నం చేశారు. ఇలా ఓ పక్క పోలీసులు, మరోపక్క ఆసుపత్రి అధికారులు ఇద్దరూ ఎన్నో ప్రయత్నాలతో ఒప్పించిన తర్వాత, దీపక్ చివరకు పామును ఆసుపత్రి ప్రాంగణం నుండి దూరంగా వదిలేయడానికి అంగీకరించాడు.
