ఔను...పార్లమెంట్లో దమ్ముకొడతా...:ఎంపీ సౌగతా రాయ్ షాకింగ్ కామెంట్
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతరాయ్ పార్లమెంట్ ఆవరణలో పొగతాగడాన్ని సమర్థించుకున్నారు.
By: Tupaki Political Desk | 13 Dec 2025 11:14 AM ISTపొగతాగని వాడు దున్నపోతై పుట్టున్...అన్నమాటను ఎంపీ సౌగతారాయ్ బాగా వంటబట్టించుకున్నట్లుున్నాడు. అందుకే పార్లమెంట్ లో పొగతాగితే తప్పేముంది? అంటూ మీడియాముందు హల్ చల్ చేశాడు. అయినా సభలో తాగొద్దు గానీ లాంజ్ లో తాగరాదని రూలేమైనా ఉందా? అయినా నా చుట్టాపై పడి ఏడ్వడమెందుకు? అంతగా పొల్యూషన్ వద్దనుకుంటే ఢిల్లీ సంగతి చూడమను. ఢిల్లీలో జనాలు ఊపిరాడక చస్తున్నారు. అది వదిలేసి నాచుట్టూ పడి ఏడుస్తున్నారెందుకు అని రెచ్చిపోయి మరీ ప్రశ్నించాడు ఎంపీ సౌగతరాయ్. ఇది ఇపుడు రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతరాయ్ పార్లమెంట్ ఆవరణలో పొగతాగడాన్ని సమర్థించుకున్నారు. సభలో తాగానా? లేదే...బైట కదా తాగింది. అదికూడా తప్పంటే కుదరదు. పార్లమెంట్ ఆవరణలో పొగతాగడాన్ని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదని మీడియా ముందట నిర్మొహమాటంగా చెప్పేశాడు. ఎంపీ సౌగతారాయ్ సిగరెట్ట కాల్చడం గురించి గొప్పలు చెప్పుకోవడం ముమ్మాటికీ తప్పే అయినప్పటికీ...ఆయన తన మాటల్లో అన్నట్లు దేశరాజదాని ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించే దిశగా నేతలు సరైన అడుగులు వేయట్లేదనేది నిర్వివాదాంశం. ఢిల్లీ వాసులు వాహనాలు, వాతావరణ కాలుష్యాల దెబ్బకు అనారోగ్యం పాలవుతున్న మాట వాస్తవం.
ఢిల్లీలో గాలి ఎప్పుడూ ఉక్కిరిబిక్కిరి అవుతునే ఉంటుంది. అక్కడి ప్రజలకు ఊపిరి ఆగిపోతున్న ఫీలింగ్ కలుగుతునే ఉంటుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (గాలి నాణ్యతాసూచి) రికార్డు స్థాయిలో 400 పాయింట్లకు పడిపోయిన పరిస్థితిలో ఢిల్లీ లో వాతావరణ అత్యవరసర పరిస్థితి తలెత్తింది. ఢిల్లీ వాసులు దీని ప్రభావంతో వింతరోగాలతో అలమటిస్తున్నారు. కొందరు మరణిస్తున్నారు కూడా. మరి ఇంత దారుణంగా వాతావరణం ఉంటున్నా...నివారణ చర్యలు ప్రభుత్వం పరంగా చేపడుతున్నది చాలా చాలా తక్కువే అని చెప్పాలి. కేంద్ర కాలుష్య బోర్డు నిబంధనల ప్రకారం పీఎం సాంద్రత 2.5 ఉండాలి. కానీ 60మైక్రోగ్రాములు దాటినట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం పాతవాహనాల వాడుక. కాలం చెల్లిన వాహనాలను వాడకుండా నివారించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. ఈ వాహనాల వల్ల ఏర్పడే కాలుష్యం 40శాతంగా ఉంటోంది. ఢిల్లీలో కాలుష్యం దారుణంగా ఉందని ఎంపీ సౌగతారాయ్ కేంద్రాన్ని విమర్శించడంలో ఏమాత్రం తప్పుకాదు. అయితే దాన్ని నెపంగా చూపి తాను పొగతాగడాన్ని సమర్థించుకోవడమే కాస్త ఇబ్బందికరం.
తృణమూల్ ఎంపీ ఈ సిగరెట్ తాగారని భాజపా ఎంపీ అనురాగ్ ఠాకూర్ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇద విషయాన్ని అంతకుముందు లోక్ సభలో ఠాకూర్ ప్రస్తావించగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తేనే చర్యలు తీసుకుంటామని స్పీకర్ తెలిపారు.లోక్ సభలో కూర్చొని అందరికీ కనిపించేలా తృణమూల్ ఎంసీ ఈ సిగరెట్ తాగారని దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ ఠాకూర్ స్పీకర్ ను కోరారు. సాధారణంగా చట్టసభ జరుతుండగా కొందరు నిద్రపోతుంటారు, మరికొందరు ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇంకొందరు మొబైల్ లో గేమ్స్ ఆడుకుంటుంటారు. ఇలా రక రకాలుగా తోచినట్లు వ్యవహరిస్తుంటారు. కెమెరాల కంటికి చిక్కిపోతుంటారు. కానీ ఈ సారి ఓ ఎంపీ ఏకంగా సభలో సిగరెట్ తాగారన్న ఫిర్యాదు స్పీకర్ వద్దకు చేరింది. మరి ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి
