టెలివిజన్ రేటింగ్స్ వెనుక అసలు నిజం
ఒక షో విజయవంతమైందా లేదా అని నిర్ణయించడంలో టిఆర్పి రేటింగ్స్ నే ప్రామాణికంగా తీసుకుంటారు .
By: Srikanth Kontham | 12 July 2026 8:15 AM ISTఒక షో విజయవంతమైందా లేదా అని నిర్ణయించడంలో టిఆర్పి రేటింగ్స్ నే ప్రామాణికంగా తీసుకుంటారు . అయితే ఈ రేటింగ్ వ్యవస్థపై బాలీవుడ్ నటి స్మితా బన్సాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెలివిజన్ షోల విజయాన్ని కొలవడానికి టిఆర్పి సరైన సాధనం కాదన్నారు. కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు చూసే కంటెంట్‌ను, కేవలం కొన్ని వందలు లేదా వేల కుటుంబాల నుంచి సేకరించిన డేటాతో ఎలా అంచనా వేస్తారని ప్రశ్నించారు. ఈ రేటింగ్ విధానం చాలా గందరగోళంగా ఉందని అభిప్రాయపడ్డారు. తన సుదీర్ఘ నట ప్రస్థానంలో ఎన్నో మంచి షోలు నాణ్యతతో ఉన్నప్పటికీ టిఆర్పిలు లేని కారణంగా మధ్యలోనే ఆగిపోవడాన్ని చూశానని స్మితా బన్సాల్ గుర్తుచేసుకున్నారు.
షో విజయాన్ని కేవలం సంఖ్యల ఆధారంగానే నిర్ణయించడం సరికాదని వాదించారు. ఒక షో మంచిదా? కాదా? అని నిర్ణయించేది ప్రేక్షకులు మాత్రమేనని టిఆర్పి రేటింగ్స్ ఎప్పుడూ ఏకైక బెంచ్‌మార్క్ కాకూడదన్నారు. కళాత్మక విలువలు ఉన్న కంటెంట్‌కు సరైన ఆదరణ లభించకపోవడం బాధాకరమన్నారు. రేటింగ్స్ ఇచ్చే విధానంపై కూడా స్మితా అభ్యంతరం వ్యక్తం చేశారు. మన దేశంలో టెలివిజన్ చూసే ప్రేక్షకులు ఎంతో వైవిధ్యంగా ఉంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు రకరకాల అభిరుచులు ఉంటాయి. కానీ ఒకే రకమైన రేటింగ్ విధానంతో అన్ని రకాల షోలను కొలవడం ఎంతవరకు? సమంజసమని ప్రశ్నించారు.
ఒక శాతం ప్రేక్షకుల అభిప్రాయం మొత్తం దేశం అభిరుచిని ప్రతిబింబించదని ఈ పద్ధతిలో లోపాలున్నాయని అసమ్మతిని వ్యక్తం చేశారు. అయితే ఈ రేటింగ్స్ నటనపై ఏమాత్రం ప్రభావం చూపవన్నారు. ఒక షో టిఆర్పి తక్కువగా ఉందని తెలిసి కూడా తన పాత్ర విషయంలో తాను ఎప్పుడూ రాజీ పడలేదన్నారు. అలాగే రేటింగ్స్ ఎక్కువగా ఉన్నాయని తాను మరింత మెరుగ్గా నటించాల్సిన అవసరం లేదని నటిగా తన బాధ్యత ఎప్పుడూ తన పాత్రకు వంద శాతం న్యాయం చేయడ మేనని పేర్కొన్నారు. నటన అనేది రేటింగ్స్‌తో సంబంధం లేని నిరంతర సాధనమని అభిప్రాయపడ్డారు.
స్మితా బన్సాల్ అనుభవం ద్వారా నిజమైన విజయం అంటే? ప్రేక్షకులతో ఏర్పడే అనుబంధమేనని నమ్ము తున్నారు. వీధిలో తనను చూసినప్పుడు పాత్రల పేరుతో గుర్తుపట్టడమే తనకు లభించిన నిజమైన గుర్తింపు అని తెలిపారు. టిఆర్పిల కంటే ప్రేక్షకులలోని స్పందనే షో పనితీరును తెలిపే అసలైన కొలమానమని అభి ప్రాయపడ్డారు. వృత్తిపరంగా తృప్తి చెందడానికి రేటింగ్ కంటే ప్రేక్షకుల ప్రేమే ముఖ్యమన్నారు.ప్రస్తుతం స్మితా బన్సాల్ ఆర్మీ నేపథ్యంతో `ఫైనిట్` అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.
