Begin typing your search above and press return to search.

తప్పు ఒప్పుకోరు.. తగ్గేదే లే అంటారు: సియా గోయల్ ‘సిగ్గులేని’ సిగ్నల్స్

పుణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

By:  A.N.Kumar   |   3 July 2026 4:28 PM IST
తప్పు ఒప్పుకోరు.. తగ్గేదే లే అంటారు: సియా గోయల్ ‘సిగ్గులేని’ సిగ్నల్స్
X

పుణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాబోయే భర్తను కిరాతకంగా చంపేసిందనే ఆరోపణలతో జైల్లో ఊచలు లెక్కపెడుతున్న ప్రధాన నిందితురాలు సియా గోయల్.. తాజాగా మరోసారి హెడ్‌లైన్స్‌లోకి వచ్చింది. జైల్లో పెట్టినా, చేతులకు బేడీలు వేసినా అమ్మడి యాటిట్యూడ్‌లో మాత్రం నయాపైసా మార్పు రాలేదని నిరూపించుకుంది. విచారణ కోసం పోలీసులు ఆమెను ఇంటికి తీసుకెళ్తే.. అక్కడ మీడియా కెమెరాలను చూసి నీళ్లు నములుతుందో.. తలదించుకుంటుందో అనుకుంటే పొరపాటే..

సినిమా హీరోల రేంజ్‌లో బిల్డప్ ఇస్తూ ఏకంగా మీడియా వైపు చూస్తూ 'మిడిల్ ఫింగర్' చూపించి తన సంస్కారాన్ని నడిరోడ్డుపై ప్రదర్శించింది. "నేను తప్పు చేశానా? నాకా పశ్చాత్తాపం? తొక్కేం కాదు!" అన్నట్లుగా ఉన్న ఆమె బాడీ లాంగ్వేజ్ చూసి నెటిజన్లు, స్థానికులు నోరెళ్లబెడుతున్నారు.

బాధితురాలి బదులు 'గ్యాంగ్‌స్టర్' బిల్డప్

సాధారణంగా హత్య కేసుల్లో ఇరుక్కున్న వారు పోలీసుల జీపు ఎక్కుతుంటేనే మొహం చాటేసుకుంటారు. సమాజానికి ఏం సమాధానం చెప్పాలా అని సిగ్గుతో చచ్చిపోతుంటారు. కానీ మన సియా గోయల్ రూటే సెపరేటు.. కాబోయే భర్త ప్రాణాలు పోయాయన్న కనీస బాధ కానీ, జైలుకు వెళ్లానన్న పశ్చాత్తాపం కానీ ఆమె ముఖంలో లవలేశమైనా కనిపించకపోవడం గమనార్హం. ఇలాంటి వికృత చేష్టలు చూశాక నెటిజన్లు ఊరుకుంటారా? సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్‌తో మోతెక్కిస్తున్నారు. "చట్టం అంటే భయం లేదు, సమాజం అంటే గౌరవం లేదు.. ఏం యాటిట్యూడ్ తల్లీ!" అంటూ కొందరు సెటైర్లు వేస్తుంటే.. "ఈమెను జైల్లో కాదు, మెంటల్ హాస్పిటల్‌లో పెట్టాలి" అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేసిన తప్పుకు కోర్టు శిక్ష వేయకముందే.. తన ప్రవర్తనతో ప్రజల గుండెల్లో ఆల్రెడీ 'నేరస్థురాలిగా' ముద్ర వేయించుకుంది ఈ కిలాడీ లేడీ.

చట్టం తన పని తాను చేసుకుపోతుందా? లేక ఈమె ఇలాగే చూపిస్తుందా?

ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలో రచ్చ లేపుతుండటంతో న్యాయ నిపుణులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఎవరినీ నేరస్థులుగా ముద్ర వేయకూడదనేది చట్టం చెప్పే మాట. కానీ నిందితురాలే స్వయంగా ఇలాంటి 'అసభ్య' సంకేతాలతో సమాజాన్ని ఉడికిస్తుంటే చట్టంపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది? ఏది ఏమైనా కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు ఒకవైపు సాగుతుంటే.. సియా గోయల్ చూపించిన ఆ ఒక్క వేలు మాత్రం ఈ కేసును జాతీయ స్థాయిలో మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. పోలీసులు విచారణ పూర్తి చేసి కోర్టులో ఎలాంటి శిక్ష పడేలా చేస్తారో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈమె చేసిన పనికి నెటిజన్లు ఇచ్చే 'డిజిటల్ ప్యాసింజర్‌ థియేటర్' శిక్షను మాత్రం తప్పించుకోలేదు!