Begin typing your search above and press return to search.

సీతారాం సూసైడ్ నోట్ లో తన భార్య గురించి నగ్న సత్యాలు.. అసలేం జరిగింది..?

ఒక మనిషి ప్రాణం మీద ఆశ వదులుకొని 19 పేజీల సూసైడ్ నోట్ రాశారంటే, ఆ వ్యక్తి ఎంతటి మానసిక వేదనను అనుభవించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.

By:  Tupaki Political Desk   |   30 April 2026 3:09 PM IST
సీతారాం సూసైడ్ నోట్ లో తన భార్య గురించి నగ్న సత్యాలు.. అసలేం జరిగింది..?
X

ఒక మనిషి ప్రాణం మీద ఆశ వదులుకొని 19 పేజీల సూసైడ్ నోట్ రాశారంటే, ఆ వ్యక్తి ఎంతటి మానసిక వేదనను అనుభవించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీతారాం ఆత్మహత్య ఘటన కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదు, ఇది నమ్మకద్రోహం, సోషల్ మీడియా వికృత పోకడలకు పరాకాష్టగా నిలిచింది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య, ఇద్దరు పిల్లలు, మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. బయట ప్రపంచానికి సీతారాం జీవితం ఎంతో అందంగా కనిపిస్తుంది. కానీ, ఆ అందమైన సంసారం వెనుక భార్య రేణుక సాగిస్తున్న వివాహేతర సంబంధాలు ఆయనను బాగా కుంగదీశాయి. చివరకు ఫిబ్రవరిలో ట్యాంక్ బండ్ పై నుంచి దూకి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న 19 పేజీల సూసైడ్ నోట్ ఇప్పుడు ఈ కేసులో అసలు నిజాలను బయటపెట్టింది.

ఏడాదిన్నరలో ముగ్గురితో సంబంధం

సీతారాం తన లేఖలో భార్య రేణుక అసలు స్వరూపాన్ని ప్రపంచానికి తెలియజేశారు. రేణుక కేవలం ఏడాదిన్నర కాలంలోనే ముగ్గురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుందని ఆయన ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఏ లోటు రాకుండా చూసుకున్నప్పటికీ, తను ఇంట్లో లేని సమయంలో 'రమణ' అనే వ్యక్తిని ఇంటికి పిలిపించుకొని గడిపేదని వాపోయారు. రేణుక తన ప్రియుడితో ఉన్న సమయంలో ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేయడం, ఆ తర్వాత వాటిని సదరు వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం సీతారాంను మానసిక వేదనకు గురి చేశాయి. ఆ వీడియోలు చూశాకే భార్య నిజస్వరూపం తనకు తెలిసిందని పేర్కొన్నారు.

సీతారాం ఆఖరి ప్రశ్న

‘ఒక అమ్మాయి ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేయడం ఏంటి? సదరు వ్యక్తి ఆ వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం ఏంటి? అవి చూసి నేను ఎలా తట్టుకోవాలి?’ అని ఆయన ప్రశ్నించడం గుండెలను పిండేస్తోంది. ప్రేమ లేదా శృంగారం.. అసలు రేణుకకు ఏం కావాలో అర్థం కావడం లేదని, తన చావుకు భార్య ప్రవర్తనే కారణమని ఆయన స్పష్టం చేశారు.

పోలీసుల దర్యాప్తు

సీతారాం తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన బాచుపల్లి పోలీసులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. సూసైడ్ నోట్ ఆధారంగా రేణుకతో పాటు ఆమె ప్రియులు రమణారెడ్డి, శ్రవణ్ ను అరెస్ట్ చేశారు. ఏపీలోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ రేణుక ప్రవర్తనలో మార్పు రాలేదు.

ఈ ఘటన సోషల్ మీడియా, వివాహేతర సంబంధాలు సృష్టించే భయంకరమైన నష్టాలకు నిదర్శనం. ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేయడం, వాటిని సోసల్ మీడియా ప్లాట్ ఫాంలు ఇన్‌స్టా ఫేస్ బుక్ లాంటి వాటిలో పెట్టి వేధించడం నేరపూరిత సంస్కృతిని సూచిస్తున్నాయి. సీతారాం వంటి విద్యావంతులు ఆత్మహత్యే పరిష్కారం అనుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష పడితేనే, మరే ఆడపిల్ల లేదంటే మగవాడు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడు. కుటుంబ వ్యవస్థలో నమ్మకం అనే పునాది లేకపోతే శ్మశానంగా మారుతుందనేందుకు ఈ ఘటనే సాక్ష్యం.