ప్రభాకర్‌రావు విడుదల.. విచారణ పూర్తి?
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధిపతి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావును సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారులు శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు.
By: Garuda Media | 26 Dec 2025 8:13 PM ISTఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధిపతి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావును సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారులు శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు. దాదాపు 15 రోజుల పాటు ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించా రు. శుక్రవారం కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విచారించిన అనంత రం.. ప్రభాకర్‌రావును విడిచి పెట్టారు.
ప్రధాన ఆరోపణలు..
బీఆర్ ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు ప్రత్యర్థులతోపాటు మీడియా సహా.. అనేక మందిని లక్ష్యంగా చేసుకుని ఫోన్ ట్యాపిం గ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. రేవంత్ రెడ్డి సర్కారు దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిం చి.. డీఎస్పీ సహా ఎస్ ఐ స్థాయి అధికారులను కూడా విచారించారు. ఇక, ఎస్‌బీఐ మాజీ చీఫ్.. ప్రభాకర్‌రావు పై ప్రధాన ఆరోపణలు కూడా వచ్చాయి.
దీంతో ప్రభాకర్‌రావు చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. ఇంతలో ఆయన అమెరికా వెళ్లిపోవడం..తర్వాత సు ప్రీంకోర్టులో పిటిషన్ వేయడం తెలిసిందే. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన తిరిగి వచ్చినా.. అ నేక అవాంతరాలు వచ్చాయి. మొత్తానికి మరోసారి దర్యాప్తు బృందం అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయిం చి.. కస్టడీకితీసుకున్నారు. అయితే.. తమ విచారణలో ప్రభాకర్ రావు సహకరించలేదని.. అధికారులు చెబుతున్నారు. కీలక విషయాలపై ఆయన దాటవేత ధోరణిని అవలంభించారు.
అదేసమయంలో తన ప్రమేయంపై కేసీఆర్‌నే అడగాలని ఆయన వ్యాఖ్యానించడం వంటివి మరింత వివాదంగా మారింది. ముఖ్యంగా ఎస్‌బీఐ చీఫ్ పోస్టులో ఎందుకు నియమించారన్న విషయంపైనా ప్రభాకర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్‌రావుతోపాటు.. బీఆర్ ఎస్ కీలక నేతలతో భేటీ కావడం.. తరచుగా వారితో ఫోన్‌లో సంభాషించడం వంటివి కూడా ప్రభాకర్ రావు చుట్టూ చర్చనీయాంశం అయ్యాయి. అయితే.. వాటికి ఆయన సరైన సమాధానం చెప్పలేదని సమాచారం. ఇదిలావుంటే.. ఇప్పటి వరకు.. జరిగిన విచారణకు సంబంధించిన నివేదికను జనవరి 16న సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక అందించనుంది.
