13.39 కోట్ల ఓట్లు తొలగింపులో వాస్తవం ఎంత ?
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రకారం దేశంలో 13.39 కోట్ల మంది ఓటర్లను తొలగించారన్న వార్తల ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
By: Garuda Media | 7 Oct 2026 3:07 PM ISTస్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రకారం దేశంలో 13.39 కోట్ల మంది ఓటర్లను తొలగించారన్న వార్తల ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సర్ ప్రక్రియను ఇప్పటికే రాజకీయ పార్టీలు, సీజేగా పార్టీలు తప్పుబడుతున్నాయి. ఎన్నికల కమీషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్ మీద ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓట్ల తొలగింపు విషయంలో అసలు వాస్తవాలు ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సర్ ప్రక్రియలో భాగంగా 95.40 కోట్ల ఓటర్లను సమీక్ష చేశారు. ఇందులో 6.30 కోట్ల మంది శాశ్వతంగా ఉన్న స్థానం నుండి వెళ్లిపోవడం, 3.01 కోట్ల మంది వివరాలు తెలియకపోవడం, 2.80 కోట్ల మంది ఓటర్లు చనిపోవడం, 1.02 కోట్ల మంది డూప్లికేట్ ఓటర్లు కావడం, ఇతరులు 0.26 కలిపి మొత్తం 13.39 కోట్ల మంది ఓటర్లను తొలగించారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ సర్ ప్రక్రియ మీద డిలీట్ ఫస్ట్ వెరిఫై లేటర్ అన్నట్లుగా పద్దతి కొనసాగుతుందని విమర్శలు వస్తున్నాయి. అయితే ఇది ఫైనల్ డిసీషన్ కాదు. మరణించిన వారు, మారిన వారు, డూప్లికేట్, ఫేక్ ఓటర్లు ఉన్నాయన్న వాదన కూడా నడుస్తోంది. నిజంగా అర్హులైన ఓటర్లు ఫార్మ్ 6 ద్వారా తిరిగి చేరవచ్చు లేదా ఫైనల్ లో లేకుంటే జిల్లా మెజిస్ట్రేట్ కు అప్పీల్ చేయవచ్చు అని ఎన్నికల కమిషన్ చెబుతోంది.
అయితే సర్ ప్రక్రియలో భాగంగా అనేక రాష్ట్రాల్లో సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా సవరణకు ఆయా రాష్ట్రాల విజ్ఞప్తుల మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ గడువును పొడిగిస్తూ వస్తుంది. ఈ పరిస్థితుల్లో 13.39 కోట్ల మంది ఓటర్లు గల్లంతు అయ్యారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే 13 కోట్ల ఓటర్లను అనర్హులుగా చేశారని, ఇది ఓట్ చోరి అని, సీఈఓ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అసలు ఓట్లు తొలగించలేదు. తిరిగి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
