Begin typing your search above and press return to search.

వాలంటైన్స్ డే.. ప్రేమికులకు ఓకే.. సింగిల్స్ మాటేంటి ?

బ్రిటీషోల్లు ఇండియాలో అడుగుపెట్టాక.. కీల‌క మార్పులు వ‌చ్చాయి. విద్యా, వైద్య‌, రాజ‌కీయ, సామాజిక వ్య‌వ‌స్థ‌ల్లో మార్పులు వ‌చ్చాయి.

By:  A.N.Kumar   |   8 Feb 2026 7:00 AM IST
వాలంటైన్స్ డే.. ప్రేమికులకు ఓకే.. సింగిల్స్ మాటేంటి ?
X

ఫిబ్ర‌వరి రాగానే.. వాలంటైన్స్ డే సంద‌డి మొద‌ల‌వుతుంది. అయితే ఇది అన్ని ఏజ్ గ్రూప్ ల‌కు సంబంధించిన అంశం కాక‌పోయినా.. టీన్ ఏజ్ గ్రూప్ లో మాత్రం ఎక్కువ ఆస‌క్తి ఉంటుంది. వాలంటైన్స్ డే కు ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఎలా ప్ర‌పోజ్ చేయాలి. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి. ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి. ఎలాంటి క‌ల‌ర్ సెలెక్ట్ చేయాలి. ఇలా అనేక ప్ర‌శ్న‌లు ప్రేమికుల్లో ఉంటాయి. అందుకే వాలంటైన్స్ డే రాక‌ముందే ఈ ఏర్పాట్లలో ప్రేమికులు నిమ‌గ్న‌మైపోతారు. కానీ సింగిల్స్ ప‌రిస్థితి ఏంటి అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌. దీనిపైనే సోష‌ల్ మీడియాలో వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. సింగిల్స్ కు ప్రిప‌రేష‌న్ అవ‌స‌రం లేదు. డ్ర‌స్ కోడ్ అవ‌స‌రం లేదు. గిఫ్ట్ ఖ‌ర్చులు ఉండ‌వు. ప్ర‌పోజ్ చేయాల‌నే తంటా ఉండ‌దు. ప్రేమికుడో, ప్రేమికురాలు ఉంటే ఎంత బాగుండు అన్న‌ ఫీలింగ్ సింగిల్స్ లో ఉన్న‌ట్టే.. సింగిల్ గా ఉంటే ఎంత బాగుండు అన్న ఫీలింగ్ ప్రేమికుల్లో కూడా కొన్ని ప‌రిస్థితిల్లో ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

`డే`లు ఎప్పుడు మొద‌ల‌య్యాయి ..

బ్రిటీషోల్లు ఇండియాలో అడుగుపెట్టాక.. కీల‌క మార్పులు వ‌చ్చాయి. విద్యా, వైద్య‌, రాజ‌కీయ, సామాజిక వ్య‌వ‌స్థ‌ల్లో మార్పులు వ‌చ్చాయి. ఆ త‌ర్వాతి కాలంలోనే వారి సంస్కృతి ప్ర‌భావం భారతీయుల‌పైన తీవ్రంగా ప‌డింది. వాలంటైన్స్ డే, ఫాద‌ర్స్ డే, మ‌ద‌ర్స్, టీచ‌ర్స్ డే ఇలా ర‌క‌ర‌కాల `డే`లు సెల‌బ్రేట్ చేసుకోవ‌డం మొద‌లైంది. స్వాతంత్య్రానంత‌రం కూడా ఆ ఎఫెక్ట్ దూర‌మ‌వ్వ‌లేదు. ఇండియ‌న్లు వాటికి కొన‌సాగింపుగా ప్ర‌తి డేను ఏదో ఒక పేరుతో సెల‌బ్రేట్ చేసుకోవ‌డం మొద‌లుపెట్టారు. అలా పుట్టిన‌వే బ‌జ్జీడే, దోస‌డే, ఆవ‌కాయ డే, బెండ‌కాయ డే లాంటివి. వెస్ట్ర‌న్ క‌ల్చ‌ర్ పెరిగిపోవ‌డానికి ప్ర‌ధాన కారణం స్వేచ్చాయుత, నూత‌న‌ జీవ‌న విధానానికి అల‌వాటు ప‌డ‌ట‌మే అన్న‌ది ఇంకో వాద‌న‌. వెస్ట్ర‌న్ క‌ల్చ‌ర్ లో సోష‌ల్ రిస్ట్రిక్ష‌న్స్ త‌క్కువ‌. తిండిలోనూ, వేషంలోనూ, జీవ‌న శైలిలోనూ వైవిధ్యం ఉంటుంది. ఆ వైవిధ్య‌మే భార‌తీయులు వెస్ట్ర‌న్ క‌ల్చ‌ర్ ను అందిపుచ్చుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అని విశ్లేష‌కులు చెబుతున్నారు.

సాంస్కృతిక మార్పు నూత‌న మార్కెట్ సృష్టి..

వెస్ట్ర‌న్ క‌ల్చ‌ర్ భారతీయుల‌ను ఆక‌ర్షించ‌డం.. వెస్ట్ర‌న్ దేశాల‌కు కొత్త మార్కెట్ ను సృష్టించాయి. వారి క‌ల్చ‌ర్ సెల‌బ్రేష‌న్, వారి వేష భాష‌లు, వారి జీవ‌న విధానం భార‌తీయుల్లో వెస్ట్ర‌న్ వ‌స్తువుల కొనుగోలును పెంచాయి. తద్వారా ఆయా దేశాల‌కు, కంపెనీల‌కు కొత్త మార్కెట్ వ‌చ్చింది. ఉదాహ‌ర‌ణ‌కు వాల‌టైన్స్ డే కార‌ణంగా చాలా వ‌స్తువుల వినియోగం జ‌రుగుతుంది. ఇలా ప్ర‌తి సెల‌బ్రేష‌న్ వినియోగాన్ని పెంచుతుంది. కంపెనీల‌కు లాభంగా మారుతుంది. చాలా మందికి ఉపాధిగా మారుతుంది. మొద‌ట విదేశీ కంపెనీలు లాభ‌ప‌డ్డా.. క్ర‌మంగా భార‌తీయ వ్యాపారులు కూడా ఈ ట్రెండ్ ను క్యాష్ చేసుకోవ‌డం మొద‌లుపెట్టారు.