వెండి పెట్టుబడిదారులకు శుభవార్త.. ఏకంగా 400% పెరిగే ఛాన్స్!
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎక్స్ ప్రెస్ లా పరిగెడుతుంటే.. దాని వెంటే వెండి కూడా పరిగెత్తడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
By: Madhu Reddy | 8 Oct 2025 6:00 AM ISTగత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎక్స్ ప్రెస్ లా పరిగెడుతుంటే.. దాని వెంటే వెండి కూడా పరిగెత్తడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకప్పుడు కేజీ వెండి అంటే సుమారుగా 80 వేల లోపే ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా 1,67 వేలకు చేరింది.. దీని బట్టి చూస్తే వెండి ధరలు కూడా ఏ రేంజ్ లో ఆకాశాన్ని అంటుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ పెరుగుతున్న ధరల వల్ల ప్రజలు ఇబ్బందులు పడినా.. పెట్టబడిదారులకు మాత్రం శుభవార్త అనే చెప్పాలి. ముఖ్యంగా సేఫ్ పెట్టుబడి కోసం ప్రయత్నించే వారికి బంగారంతో పాటు వెండి ధరల పెరుగుదల చక్కటి శుభవార్తను కలిగించింది అని చెప్పాలి.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వెండి పై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇదే చక్కని సమయం అని నిపుణులు చెబుతున్నారు. మరి నిపుణుల అంచనాల మేరకు భవిష్యత్తులో వెండి ధరలు పెరిగే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అయితే ఈ పెరిగే ధరలు ఏ మేరా పెరగనున్నాయి? అసలు నిపుణులు ఏం చెబుతున్నారు అనే విషయం ఇప్పుడు చూద్దాం..
విషయంలోకి వెళ్తే.. "రిచ్ డాడ్ పూర్ డాడ్" రచయిత రాబర్ట్ కియోసాకి వెండి ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుతం వెండి ధరలు తక్కువగానే ఉన్నాయి . గత 12 నెలల్లో వెండి ధర 45% మాత్రమే పెరిగింది. కానీ మునుముందు 400% పెరగవచ్చు. అంటే వెండిపై పెట్టుబడులు పెడితే $100 ఏడాదిలో $500 పెరుగొచ్చు" అని అంచనా వేశారు.. దీంతో వెండి ధర కేజీకి రూ.5,00,000 దాటనుంది అనే చర్చ మొదలయ్యింది. ఇకపోతే అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితిలో మార్పులు.. ఇన్వెస్టర్స్ కూడా బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. ఏది ఏమైనా బంగారంతో పాటు వెండి ధరలలో కూడా ఈ రకమైన మార్పులు పెట్టుబడిదారికి మంచి ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఒకవేళ మీరు కూడా సేఫ్ పెట్టుబడి కోసం ఆలోచన చేస్తున్నట్లయితే.. ఇలా వెండిపై పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు కూడా చెబుతున్నారు.
ఇకపోతే వెండి ధరలు కూడా ఈ రేంజ్ లో పెరగడానికి కారణం పారిశ్రామిక డిమాండ్, పెట్టుబడిదారుల కొనుగోలు వంటి అంశాలు కారణమని నివేదికలు సూచిస్తున్నాయి. మార్కెట్లో ప్రస్తుతం వెండి కొరత ఏర్పడుతోంది. అటు పారిశ్రామిక అవసరాలకు వెండి డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదు పెట్టుబడిదారులు కూడా వెండిని కొనుగోలు చేయడం వల్ల ధరలు పెరిగిపోతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలు కూడా వెండి ధరలపై ప్రభావం చూపుతున్నట్లు సమాచారం.
