Begin typing your search above and press return to search.

అమెరికా సిలికాన్ వ్యాలీపై “సె*క్స్ వార్‌ఫేర్”

ఈ గూఢచారిణులు పెద్ద టెక్ కంపెనీల ఇంజనీర్లు, మేనేజర్లు, పరిశోధకులతో వ్యక్తిగత సంబంధాలు పెంచుకుంటూ కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు.

By:  A.N.Kumar   |   24 Oct 2025 6:00 PM IST
అమెరికా సిలికాన్ వ్యాలీపై “సె*క్స్ వార్‌ఫేర్”
X

అమెరికా సాంకేతిక రంగానికి హృదయం అయిన సిలికాన్ వ్యాలీలో ప్రస్తుతం తీవ్ర కలకలం రేగుతోంది. “సె*క్స్ వార్‌ఫేర్” పేరుతో సాగుతున్న కొత్త తరహా గూఢచర్యం ఇప్పుడు టెక్ కంపెనీలను ఆందోళనకు గురిచేస్తోంది. చైనా, రష్యా వంటి దేశాలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అందమైన మహిళలను గూఢచారిణులుగా వినియోగిస్తూ, అమెరికా టెక్ కంపెనీల రహస్యాలను దోచుకుంటున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.

* “హనీట్రాప్”కు ఆధునిక రూపం

ఈ గూఢచారిణులు పెద్ద టెక్ కంపెనీల ఇంజనీర్లు, మేనేజర్లు, పరిశోధకులతో వ్యక్తిగత సంబంధాలు పెంచుకుంటూ కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. కొందరు వివాహం చేసుకోవడం ద్వారా కుటుంబ స్థాయిలో సంబంధాలు బలపరచి, కంపెనీ గుట్టు రహస్యాలను దీర్ఘకాలం నియంత్రణలో ఉంచుతున్నారు. నిపుణులు దీన్ని పాత “హనీట్రాప్” వ్యూహానికి ఆధునిక సాంకేతిక రూపంగా వర్ణిస్తున్నారు.

* చైనా, రష్యా గూఢచారుల సీక్రెట్ మిషన్

అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం.. చైనా, రష్యా ప్రభుత్వాలు ఈ వ్యూహాన్ని సమగ్రంగా అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా చైనాకు చెందిన యువతులు LinkedIn, X (Twitter), బిజినెస్ కాన్ఫరెన్సులు వేదికలుగా తీసుకుని టెక్ నిపుణులను టార్గెట్ చేస్తున్నారు.

పామిర్ కన్సల్టింగ్ చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జేమ్స్ ముల్వెనాన్ వెల్లడించినదాని ప్రకారం.. LinkedInలో అనేక చైనీస్ మహిళల నుంచి టెక్ ప్రాజెక్టుల పేరుతో కనెక్షన్ రిక్వెస్ట్‌లు వస్తున్నాయని చెప్పారు.

* స్టార్టప్‌లను టార్గెట్ చేస్తోన్న కొత్త పద్ధతి

ఇక గూఢచర్యం కేవలం వ్యక్తిగత స్థాయిలోనే కాదు, స్టార్టప్‌ల రూపంలో కూడా పెరుగుతోంది. చైనాకు చెందిన ఇన్వెస్టర్లు “ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్” పేరుతో టెక్ సమ్మిట్‌లు నిర్వహించి, అమెరికా స్టార్టప్‌ల బిజినెస్ మోడల్స్, AI ఆల్గారిథమ్స్‌, చిప్ డిజైన్‌లను సేకరిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి.

* అమెరికాకు బిలియన్ల నష్టం

అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ అంచనా ప్రకారం, ప్రతి సంవత్సరం సుమారు $600 బిలియన్ల విలువైన మేధో సంపత్తి దొంగతనం జరుగుతోంది. ఇందులో అధిక భాగం చైనా మూలంగానే ఉన్నట్లు వెల్లడించారు. ఇది కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా, దేశ భద్రతకు కూడా పెద్ద ముప్పుగా మారింది.

* AI, డిఫెన్స్ రంగాలు ప్రధాన లక్ష్యాలు

సిలికాన్ వ్యాలీ గూఢచారుల ప్రధాన టార్గెట్ AI, క్వాంటం కంప్యూటింగ్‌, సైబర్ సెక్యూరిటీ, రక్షణ టెక్నాలజీలు. చైనా ప్రభుత్వం సాంకేతిక గూఢచార బృందాలను ఏర్పాటు చేసిందని ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి.

ఇజ్రాయిల్‌, దక్షిణ కొరియా, ఇరాన్ వంటి దేశాలు కూడా సైలెంట్‌గా అమెరికా డిఫెన్స్ టెక్ రంగాల్లో పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

* FBI, CIA అప్రమత్తం

ఈ పరిణామాల నేపథ్యంలో FBI, CIA సంస్థలు టెక్ కంపెనీలకు భద్రతా హెచ్చరికలు జారీ చేశాయి. అనుమానాస్పద సోషల్ మీడియా కాంటాక్టులను తిరస్కరించాలి, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకూడదు, ప్రాజెక్ట్ వివరాలను గోప్యంగా ఉంచాలని సూచించాయి. FBI ఇప్పటికే 200కి పైగా “హనీట్రాప్ కేసులు”పై దర్యాప్తు జరుపుతోంది.

* టెక్ దిగ్గజాలకు సవాల్

“సె*క్స్ వార్‌ఫేర్” గూఢచర్యం కారణంగా గూగుల్‌, ఆపిల్‌, ఎన్‌విడియా, టెస్లా వంటి దిగ్గజ సంస్థలు తమ అంతర్గత భద్రతా వ్యవస్థలను పునరాలోచిస్తున్నాయి. సాంకేతిక రంగాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ మానసిక, శారీరక గూఢచర్యం ఇప్పుడు అమెరికా టెక్ ప్రపంచానికి కొత్త యుద్ధం.. “టెక్ వార్‌ఫేర్”లో సె*క్స్ ఆయుధం గా మారింది.

సిలికాన్ వ్యాలీ ఇప్పుడు కేవలం ఆవిష్కరణల కేంద్రం మాత్రమే కాదు, అంతర్జాతీయ గూఢచార యుద్ధానికి ప్రధాన రంగస్థలంగా మారింది. “సె*క్స్ వార్‌ఫేర్” రూపంలో కొనసాగుతున్న ఈ సైలెంట్ యుద్ధం అమెరికా టెక్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తోంది. ప్రపంచానికి ఇది కొత్త రకం చల్లని యుద్ధం సంకేతం!