Begin typing your search above and press return to search.

పులి లాంటి పార్టీ...బీజేపీ దెబ్బకు చిత్తు !

అయితే బాలథాక్రే 2012లో మరణించాక ఆయన ఏకైక కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ బాధ్యతలు స్వీకరించారు.

By:  Satya P   |   17 Jan 2026 9:00 PM IST
పులి లాంటి పార్టీ...బీజేపీ దెబ్బకు చిత్తు !
X

మహారాష్ట్రలో యోధుడిగా బాలసాహెబ్ ఉండేవారు. ఆయన అరవై దశాబ్దంలో భాషతో పాటు ప్రాంతీయ భావజాలాన్ని మిక్స్ చేసి సరికొత్త రాజకీయానికి అంకురార్పణ చేశారు. ఆ విధంగా ఆయన తనదైన శైలిలో మహారాష్ట్రలో కీలక స్థానాన్ని అందుకున్నారు. ఆయనది ఎక్కువగా స్థానిక రాజకీయం. రాష్ట్ర స్థాయిలో అధికారం తొంబైల్లో వచ్చింది. కానీ పునాదులు గట్టిగా ఉండాలని బాలథాక్రే ఏకంగా ముంబై కార్పొరేషన్ నే శివసేన ఆధీనంలో ఉండేలా చూశారు. ఆయన మాస్ పల్స్ తెలిసిన వారుగా గుర్తింపు పొందారు.

వారసుల రాజ్యంలో :

అయితే బాలథాక్రే 2012లో మరణించాక ఆయన ఏకైక కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ బాధ్యతలు స్వీకరించారు. కానీ ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించక పోవడం వల్ల 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీకి దూరం జరిగారు. దాంతో బీజేపీ సొంతంగా గెలిచి అయిదేళ్ళ పాటు పాలించింది. ఆ సమయంలోనే సంస్థాగతంగా బలంగా పాతుకుని పోయింది. ఇక 2019లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కూడా పెద్దన్న మాదిరిగా వ్యవహరించడంతో పాటు తమకే సీఎం సీటు కావాలని పట్టుబట్టి పూర్తిగా దూరం అయింది. ఆ మీదట కాంగ్రెస్ తో శివసేన చేతులు కలిపింది. ఫలితంగా ఉద్ధవ్ థాక్రే కొన్నాళ్ళ పాటు సీఎం గా వెలిగినా ఆ పార్టీ సిద్ధాంతమే ఇబ్బందుల్లో పడింది. బాలథాక్రే కాంగ్రెస్ ని పూర్తిగా వ్యతిరేకిస్తే ఉద్ధవ్ వారితో చేరి మూల సిద్ధాంతాలకు గండి కొట్టారు అన్నది గ్రహించిన శివ సైనికులు ఏక్ నాధ్ షిండే నాయకత్వంలో ఉన్న షిండే శివసేన వైపు వెళ్ళిపోయారు.

వరస విజయాలు :

ఇక శివసేన నుంచి వేరుపడి తమతో కలిసిన ఏక్ నాధ్ షిండేని గతంలో సీఎం గా చేసి ఆయనకు శివసేన మీద పూర్తి రాజకీయ పట్టు దక్కేలా బీజేపీ పావులు కదిపింది దాంతో థాక్రేల కంటే షిండే శివసేనకు అసలైన సైనికుడిగా మారారు. దాని ఫలితమే 2024 ఎన్నికలో బీజేపీ షిండే శివసేన బంపర్ విక్టరీ, అంతే కాదు తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని మహాయుతి కూటమి ప్రభంజనం క్రియేట్ చేయడం. ఈ దెబ్బతో చేతులు కలిపినా ఉద్ధవ్ థాక్రే రాజ్ థాక్రేలని జనాలు దూరంగానే పెట్టారు.

బీజేపీ తో కటీఫ్ :

బాల్ థాక్రే టైం లో బీజేపీతో ఏనాడూ శివసేన విభేదాలు తెచ్చుకోలేదు, కానీ ఉద్ధవ్ ఠాక్రే అనవసర ఇగోలకు పోయి ఇంతవరకూ తెచ్చుకున్నారు అని అంటున్నారు. దాంతో ఒకనాడు బీజేపీ కంటే బలంగా ఉన్న శివసేన ఈ రోజు రాజకీయంగా ఇబ్బందులు పడుతోంది. ఈ సమయంలో బీజేపీతో తిరిగి చేతులు కలపడమే ఉద్ధవ్ థాక్రేకి ఉన్న మార్గమని అంటున్నారు. అయితే దానికి బీజేపీ అంగీకరిస్తుందా అంటే చెప్పలేరని అంటున్నారు ఎందుకంటే బాల్ థాక్రేకి అసలైన వారసుడిగా శివ సైనికులు ఏక్ నాధ్ షిండేను గుర్తిస్తున్నారు ఆయన మాస్ లీడర్ గా ఉన్నారు ఆటో డ్రైవర్ స్థాయి నుంచి సీఎం గా ఎదిగారు దాంతో ఫ్యూచర్ లో శివసేన అంతా ఆయన వైపు ఉన్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మొత్తానికి బాల్ థాక్రే స్థాపించిన శివసేన ఈ రోజు ఈ విధంగా మారడం అంటే బాధాకరమనే అంటున్నారు. థాక్రే సోదరులు రాజకీయ వ్యూహాలు విఫలమవుతున్న వేళ ఏమి చేసి పార్టీని ఒడ్డుకుని చేరుస్తారు అన్నది చూడాల్సి ఉంది.