శిల్పా శెట్టి దంపతులపై కేస్ ఫైల్.. రూ.60 కోట్ల భారీ స్కామ్!
తాజాగా శిల్పా శెట్టి దంపతులకు సంబంధించి ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
By: Madhu Reddy | 14 Aug 2025 10:13 AM ISTబాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతులు తరచూ చీటింగ్ కేసుల్లో ఇరుక్కుంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ,కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే ఎన్నో కేసుల్లో ఇరుక్కున్న రాజ్ కుంద్రా మరోసారి రూ.60 కోట్ల చీటింగ్ కేసులో అడ్డంగా బుక్కయ్యారు.. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా వల్ల మేం రూ.60.48కోట్లు నష్టపోయాం అంటూ ఓ వ్యాపారవేత్త ముంబైలోని జూహు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు.దీంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. మరి ఇంతకీ శిల్పా శెట్టి దంపతులు చేసిన మోసం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
తాజాగా శిల్పా శెట్టి దంపతులకు సంబంధించి ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.ముంబైకి చెందిన లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్,బిజినెస్ మాన్ అయినటువంటి దీపక్ కొఠారి తాజాగా జుహు పోలీసు స్టేషన్లో శిల్పా శెట్టి దంపతులపై కేసు నమోదు చేశారు.
శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ఇద్దరు కలిసి తనను రూ.60 కోట్లకు పైగా మోసం చేశారంటూ తన కంప్లైంట్ లో రాసుకొచ్చారు.. బిజినెస్ విస్తరిస్తామని చెప్పి దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్త దగ్గర 2015 నుండి 2023 వరకు శిల్పా శెట్టి దంపతులు డబ్బులు తీసుకున్నారట.కానీ అలా తీసుకున్న డబ్బులను వాళ్ళు బిజినెస్ కోసం ఉపయోగించకుండా తమ సొంత ఖర్చులకు వాడుకున్నారని దీపక్ కొఠారి శిల్పా శెట్టి దంపతులపై షాకింగ్ కామెంట్లు చేశారు.
ఇదిలా ఉండగా.. దీపక్ కొఠారి రాజేష్ ఆర్య అనే వ్యక్తి ద్వారా రాజ్ కుంద్రా, శిల్పా శెట్టిలకు పరిచయమయ్యారట. ఆ సమయంలో శిల్పా శెట్టి బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే హోం షాపింగ్ కంపెనీకి డైరెక్టర్ గా ఉందట. దాంతో ఆ కంపెనీలో 87.6% వాటా శిల్పా శెట్టి దంపతులేదేనని దీపక్ కి చెప్పడంతో ఆయన ఈ దంపతులను నమ్మారట. అదే సమయంలో 12 శాతం వడ్డీతో రూ.75 కోట్ల అప్పు కావాలని శిల్పా శెట్టి దంపతులు అడగడంతో ఆ మొత్తం డబ్బులను ఇవ్వడానికి దీపక్ కొఠారి ఒప్పుకున్నారట. కానీ ఆ తర్వాత శిల్పా శెట్టి దంపతులు ఆలోచన చేసి అధిక పన్నుల భారం నుండి తప్పించుకోవడం కోసం దీపక్ నుండి తీసుకున్న అప్పుని అప్పుగా కాకుండా పెట్టుబడిగా ఇవ్వాలని ఒప్పించారట.
దాంతో శిల్పా శెట్టి దంపతుల మీద నమ్మకంతో దీపక్ ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకున్నారట. ఆ తర్వాత నెలనెలకు వచ్చే రాబడితో పాటు అసలు కూడా తిరిగి చెల్లిస్తామని శిల్పా శెట్టి దంపతులు హామీ ఇవ్వడంతో వాళ్ళ మాటలను నమ్మిన దీపక్ కోఠారి 2015- 2023 వరకు పెట్టుబడి పెట్టారట. అలా 2015 ఏప్రిల్ లో 31.9 కోట్లు అదే సంవత్సరం సెప్టెంబర్ లో 28.53 కోట్లు దీపక్ కొఠారి శిల్పా శెట్టి దంపతులకు ట్రాన్స్ఫర్ చేసినట్టు తన ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు.. అలాగే ఈ పెట్టుబడి గురించి 2016 లో శిల్పా శెట్టి తనకు వ్యక్తిగత హామీ కూడా ఇచ్చిందని,అన్నింటికీ నాదే గ్యారంటీ అని చెప్పడంతో వాళ్లని నమ్మిన దీపక్ కొఠారి పూర్తిగా మోసపోయాడట. ఎందుకంటే శిల్పా శెట్టి దీపక్ కొఠారికి గ్యారెంటీ ఇచ్చిన సంవత్సరమే బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లో డైరెక్టర్ పదవికి రిజైన్ చేసిందట.
ఆ తర్వాత బెస్ట్ డీల్ టీవీ కంపెనీ 2017లో మరో ఒప్పందం కుదుర్చుకున్న కూడా అది సక్సెస్ కాకపోవడంతో ఈ కంపెనీ దివాళా తీసే పరిస్థితికి వచ్చిందని దీపక్ కొఠారి తన ఎఫైర్ లో రాసుకొచ్చారు.. అలా శిల్పా శెట్టి దంపతులను నమ్మి ఇప్పటివరకు దాదాపు 60 కోట్లు నష్టపోయానని, కేవలం వారి మీద నమ్మకంతోనే నేను ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టాను.కానీ వాళ్లు మాత్రం ఆ డబ్బులను వ్యక్తిగత ఖర్చులకు వాడుకొని నన్ను మోసం చేశారంటూ ముంబైలోని జూహు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు.ఇక దీపక్ కొఠారి ఇచ్చిన ఫిర్యాదుని విచారణ చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆర్థిక నేరాల విభాగానికి ఈ కేసుని బదిలీ చేశారు.. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక శిల్పా శెట్టి దంపతులు ఇదొక్కటే కాదు ఇప్పటికే చాలాసార్లు చీటింగ్ కేసుల్లో ఇరుక్కున్నారు. అలాగే రాజ్ కుంద్రా గతంలో పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే.
