మీరున్నది ఇండియాలోనే.. ఏఐ శారీ ట్రెండ్ పై విమర్శల వెల్లువ
గూగుల్ జెమినీలో ప్రస్తుతం నానో బనానా యాప్ దూసుకుపోతుంది. ఈ యాప్ వచ్చినప్పటి నుండి తెగ ట్రెండ్ అవుతోంది.
By: Madhu Reddy | 17 Sept 2025 4:00 PM ISTగూగుల్ జెమినీలో ప్రస్తుతం నానో బనానా యాప్ దూసుకుపోతుంది. ఈ యాప్ వచ్చినప్పటి నుండి తెగ ట్రెండ్ అవుతోంది.ఎవరు చూసినా సరే తమ ఫోటోలని నానో బనానా యాప్ ద్వారా తమకు ఇష్టం వచ్చిన స్టైల్ లో మార్చేసుకుంటున్నారు. అయితే ఇది అంత సురక్షితం కాదు అని కొన్ని సంస్థలు చెబుతున్నా కూడా వినకుండా తమ పనులు తాము చేసుకుపోతున్నారు. అయితే నానో బనానా యాప్ వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనే విషయాన్ని ఒక మహిళ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంది. అయితే ఈ విషయం గురించి రతన్ టాటా శిష్యుడు శంతను నాయుడు కూడా షాకింగ్ పోస్ట్ పెట్టారు.మరి ఇంతకీ ఆ మహిళ పంచుకున్న విషయం ఏమిటి.. నానో బనానా యాప్ లో తన ఫోటోని కన్వర్ట్ చేసాక వచ్చిన రిజల్ట్ ఏంటి? శంతను నాయుడు పెట్టిన ఆ పోస్ట్ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
తాజాగా ఒక అమ్మాయి ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్న నానో బనానా యాప్ లో తాను చుడిదార్ వేసుకున్న ఒక ఫోటోని సారీ కట్టుకున్న ఫోటోగా కన్వర్ట్ చేసుకుంది.తన గ్రీన్ చుడీదార్ లో ఉన్న ఫోటో నానో బనానా యాప్ ద్వారా శారీలోకి మారిపోయింది. ఆ ఫోటో చూడడానికి చాలా అందంగా ఉంది.అంతా బాగానే ఉన్నప్పటికీ గ్రీన్ చుడీదార్ లో బయటికి కనిపించని తన ఎడమ చేతి పై ఉన్న పుట్టుమచ్చ కూడా అచ్చుగుద్దినట్టు అదే ప్లేస్ లో చూపించడంతో ఆ మహిళ ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అదేంటి నేను ఒంటినిండా డ్రెస్ వేసుకున్న ఫోటోని శారీలోకి కన్వర్ట్ చేసుకున్నాను.నా పుట్టుమచ్చ ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ శారీ లోకి కన్వర్ట్ అయ్యాక నా ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చ కరెక్ట్ గా అదే ప్లేస్ లో ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయింది. అందుకు సంబంధించిన వీడియోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి ఈ యాప్ అంత సురక్షితం కాదు అని చెప్పేసింది. నా ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చని కరెక్ట్ గా అదే ప్లేస్ లో అలా ఎలా చూపించింది అనేది అర్థం అవ్వడం లేదని,ఇదెలా సాధ్యమైంది అంటూ భయందోళనకు గురైన విషయాన్ని బయటపెట్టింది.
అయితే ఇదే విషయాన్ని రతన్ టాటా సహాయకుడు అయినటువంటి శంతను నాయుడు కూడా ప్రస్తావించారు. తన సోషల్ మీడియా ఖాతాలో ఈ చీర ట్రెండ్ గురించి అందరికీ అర్థమయ్యేలా.. అందరినీ ఆలోచింపజేసేలా ఒక పోస్ట్ పెట్టారు.అందులో ఏముందంటే.. గూగుల్ జెమినీ యాప్ లో ఉండే గూగుల్ డీప్ మైండ్ ఇమేజ్ ఎడిటింగ్ మోడల్ క్యాజువల్ గా ఉండే సెల్ఫీని సినిమాటిక్ పోర్ట్రైట్ గా మార్చే ఒక సాధనం.. మన సాధారణ లుక్ ని బాలీవుడ్ మోడల్ రేంజ్ లో మార్చగల అద్భుతమైన ఏఐ సాధనం..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఇదే ట్రెండు కొనసాగుతోంది.
కానీ ఈ క్రేజీ ట్రెండ్ కి ఎవరు అమ్ముడుపోకండి. ఎందుకంటే మన భారతదేశం అంటేనే చీరకట్టుకు పుట్టినిల్లు లాంటిది.అలాంటి భారతీయ మహిళల్లో ప్రతి ఒక్కరి వార్డ్ రోబ్ లో కచ్చితంగా 15 కంటే ఎక్కువ చీరలే ఉంటాయి. మీకు అంతగా చీరలో ఉన్న ఫోటో కావాలంటే మీ వార్డ్ రోబ్ లోని చీరని కట్టుకొని అద్భుతమైన ఫోటోలను తీసుకోండి. అంతేకానీ ట్రెండ్ మాయలో పడి విచిత్రమైన శారీ లుక్ లో మిమ్మల్ని మీరు చూసుకోవడానికి ఆశపడకండి. అలాంటి లుక్ లో మిమ్మల్ని మీరు చూసుకోవడానికి అంత పిచ్చి ఏంటి.. మీ దగ్గర ఉన్న శారీ కట్టుకొని ఫోటో దిగితే బాగుంటుంది కదా.. చీర కట్టుకు పుట్టినిల్లు అయినా భారతదేశ మహిళలు కూడా ఇలాంటి చీర ట్రెండ్ కి ఆసక్తి చూపించడం ఏంటో విడ్డూరంగా ఉంది.. చీరకట్టులో ఉండే ఫోటోల కోసం టెక్నాలజీని వాడాల్సిన అవసరం ఏమీ లేదు.. చీర కట్టుకొని చూడండి అందులో మీరు ఎంత అద్భుతంగా ఉంటారో.. ఏ టెక్నాలజీ కూడా అంత అద్భుతంగా మిమ్మల్ని సృష్టించలేదు" అంటూ తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని బల్ల గుద్దినట్లు చెప్పేశారు శంతను నాయుడు. ప్రస్తుతం శంతను నాయుడు పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది ఈయన్నీ సమర్థిస్తున్నారు. మీ ఆలోచన చాలా కరెక్ట్ గా ఉంది.. ఆ ట్రెండు ని వదిలేస్తే మంచిది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
