మరో వర్షాల నెల.. సెప్టెంబరులోనూ భారీగా!
జూన్ నెల వచ్చిందంటే వర్షాలకు కేరాఫ్ అడ్రస్ అనుకోవటం మామూలే. సాధారణంగా జూన్ లో మొదలయ్యే వర్షాలు జులైలో మరింత పెరిగి.. ఆగస్టు వచ్చే నాటికి ముగింపు దశకు చేరుకోవటం చూస్తుంటాం.
By: Garuda Media | 1 Sept 2025 3:27 PM ISTజూన్ నెల వచ్చిందంటే వర్షాలకు కేరాఫ్ అడ్రస్ అనుకోవటం మామూలే. సాధారణంగా జూన్ లో మొదలయ్యే వర్షాలు జులైలో మరింత పెరిగి.. ఆగస్టు వచ్చే నాటికి ముగింపు దశకు చేరుకోవటం చూస్తుంటాం. అయితే.. ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈసారి మేలోనే వర్షాలు పలుకరించటం.. మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరి ఖాయమని డిసైడ్ అయిన వేళ..వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు.. ముందే కురిసిన వర్షాలతో మండాల్సిన మే కాస్తా కూల్ గా మారిపోవటంతో.. చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే.. ఆ సంతోషం ఎక్కువ కాలం సాగలేదు.
మేలో మండే ఎండలకు బదులుగా వర్షాలతో చల్లబడిన దానికి బదులుగా వర్షాలతో ముంచెత్తాల్సిన జూన్ ఎండలు దంచి కొట్టాయి.దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. జూన్ మూడో వారం నుంచి వర్షాలు మొదలు కావటం.. జులైలో కురిసిన ఆకస్మిక వర్షాలు అప్పటివరకు ఉన్న వర్షాభావ పరిస్థితిని మార్చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏపీతో పోలిస్తే తెలంగాణ పెద్ద ఎత్తున వర్షాలు కురవటం.. గడిచిన సంవత్సరాల సరాసరిని దాటేయటం కనిపించింది.
గత నెల (జులై) చివరి వారాల్లో కురిసిన భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్ని తీవ్రంగా నష్టపోయేలా చేసింది. ఇదిలా ఉండగా..ఈ రోజుతో ప్రారంభమవుతున్న సెప్టెంబరు నెలలో వర్షాలు ఏ రీతిలో ఉండనున్నాయి? అన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి భారత వాతావరణ విభాగం కీలక వివరాల్ని వెల్లడించింది.అదేమంటే సాధారణంగా సెప్టెంబరులో కురిసే వర్షాలకు మించి 109 శాతం అధికంగా వర్షాలు కురిసే వీలు ఉందని చెప్పాలి.
ఈ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు.. కొండచరియలు విరిగి పడి జనజీవనం స్తంభించే వీలుందని హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ లో నదులు ఉప్పొంగటం.. కొండచరియలు విరిగిపడటం..ఆకస్మిక వరదలకు దారి తీసిన వైనం తెలిసిందే. ఈ నెలలో కురిసే వర్షాలతో ఆ పరిస్థితులు రిపీట్ కావటంతో పాటు.. దక్షిణ హర్యానా.. ఢిల్లీ.. ఉత్తర రాజస్థాన్ లో సాధారణ జనజీవనం అంతరాయం కలిగే వీలుందని చెబుతున్నారు.
గత రికార్డుల్ని పరిశీలించినప్పుడు 1980 నుంచి ఏటా సెప్టెంబరులో దేశంలో కురిసే వర్షాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్న విషయాన్ని ఆయన చెప్పారు. అయితే.. కొన్ని సంవత్సరాల్లో (1986, 1991, 2001, 2004, 2010, 2015, 2019) లో మాత్రం తక్కువ వర్షాలు కురిసిన విషయాన్ని రికార్డులు తెలియజేస్తున్నాయి. ఈ నెలల దక్షిణ భారతంలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండొచ్చని..కొన్నిసార్లు సాధారణం కంటే తక్కువ స్థాయిలోనూ ఉండొచ్చని చెబుతున్నారు.
ఈ ఏడాది జూన్ 1 నుంచి ఆగస్టు 30 వరకు కురిసిన వర్షాన్ని లెక్కిస్తే.. దీర్ఘకాలిక సగటు కంటే దాదాపు 6 శాతం ఎక్కువన్న విషయాన్ని ఐఎండీ తెలియజేసింది. జూన్ లో సాధారణం కంటే దాదాపు 9 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు కాగా.. జులైలో సాధాణరణం కంటే 5 వాతం ఎక్కువగా నమోదైందని పేర్కొంది. ఆగస్టు విషయానికి వస్తే.. సాధారణం కంటే 5.2 శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం. మొత్తంగా ఇప్పటివరకు సాగిన వర్షాకాలం మూడు నెలల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావటం.. ఈ నెల కూడా వర్షాలు అధికంగా ఉండటం చూస్తే..వర్షాల కారణంగా ఎదురయ్యే ఇబ్బందులకు సంసిద్ధులుగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు. సో.. బీరెఢీ.. బీకేర్ ఫుల్.
