వణికిస్తున్న బంగారం ధరలు.. ఒక్కరోజులోనే ఇంత మార్పా?
మగువలకు అత్యంత ప్రీతికరమైన లోహం ఏదైనా ఉంది అంటే అది బంగారం అని చెప్పవచ్చు. అకేషన్ ఉన్నా.. లేకపోయినా ఖచ్చితంగా బంగారం కొనుగోలు చేయాలనే తపన వారిలో ఎక్కువగా ఉంటుంది.
By: Madhu Reddy | 4 Sept 2025 9:41 AM ISTమగువలకు అత్యంత ప్రీతికరమైన లోహం ఏదైనా ఉంది అంటే అది బంగారం అని చెప్పవచ్చు. అకేషన్ ఉన్నా.. లేకపోయినా ఖచ్చితంగా బంగారం కొనుగోలు చేయాలనే తపన వారిలో ఎక్కువగా ఉంటుంది. నిజానికి బంగారం అనేది ఆభరణంగా మాత్రమే కాకుండా పెట్టుబడి సాధనంగా కూడా పని చేస్తున్న విషయం తెలిసిందే. ఇంట్లో బంగారం ఉంటే కష్ట సమయంలో బ్యాంకులో దానిని తాకట్టు పెట్టి ఆర్థిక సమస్యలను అధిగమించవచ్చు. అందుకే చాలామంది బంగారం ఎంత ధర పలికిన కొనుగోలు చేయాలని ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు పెరుగుతున్న ధరలు చూస్తే మాత్రం గుండె గుబేల్ అనకమానదు.
గత పది రోజులుగా భారీగా పెరుగుతున్న ధరలు చూసి సామాన్యులే కాదు వ్యాపారవేత్తలు కూడా వణికిపోతున్నారు. మరి సెప్టెంబర్ 4వ తేదీకి సంబంధించి బంగారు ధరలు ఎలా ఉన్నాయి? మార్కెట్ రేటు ప్రకారం ఏ ఏ ప్రాంతాలలో ఎంత ధర పలుకుతోంది ? అనే విషయం ఇప్పుడు చూద్దాం. దేశీయంగా బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి కూడా డిమాండ్ పెరుగుతోంది. డాలర్ తో పోల్చుకుంటే ఇప్పుడు రూపాయి విలువ క్షీణిస్తుండడం కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతోందని చెప్పవచ్చు.
ఈ నేపథ్యంలోనే ఈరోజు (సెప్టెంబర్ 04) న బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనే విషయానికి వస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,980 కి చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98, 060 కి చేరింది.
ప్రాంతాలవారీగా బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనే విషయానికి వస్తే..
హైదరాబాద్, విజయవాడలో.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,980 కాగా .. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98, 060 కి చేరింది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,130 కాగా .. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,210 కి చేరింది.
ముంబైలో..
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - రూ.1,06,980
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - రూ.98,060
కోల్ కతాలో..
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - రూ.1,06,980
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - రూ.98,060
బెంగళూరులో..
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - రూ.1,06,980
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - రూ.98,060
వడోదరలో..
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - రూ.1,07,030
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - రూ.98,110
కేరళలో..
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - రూ.1,06,980
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - రూ.98,060
పూణేలో..
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - రూ.1,06,980
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - రూ.98,060
వెండి ధరల విషయానికి వస్తే కేజీ పై ₹100 పెరిగి రూ.1,37,100 కి చేరుకుంది. విజయవాడ, హైదరాబాద్, చెన్నై, కేరళ లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అటు ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు , వడోదర అహ్మదాబాద్ లో కేజీ వెండి ధర రూ.1,27,100 గా నమోదు అయ్యింది.
