Begin typing your search above and press return to search.

మదర్స్ డే స్పెషల్ .. తల్లి ప్రేమలో దాగిన సైన్స్ ఫ్యాక్ట్!

నేడు మదర్స్ డే సందర్భంగా, అసలు తల్లి ప్రేమలో ఉండే ఆ సైన్స్ రహస్యాలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకను ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం ..

By:  Madhu Reddy   |   10 May 2026 7:36 PM IST
మదర్స్ డే స్పెషల్ .. తల్లి ప్రేమలో దాగిన సైన్స్ ఫ్యాక్ట్!
X

అమ్మ.. ఈ రెండక్షరాల పిలుపులో ఉన్న మాధుర్యం మరెక్కడా దొరకదు. కానీ అమ్మకు మనపై ఉండే ఆ అంతులేని ప్రేమ వెనుక ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉందని మీకు తెలుసా? తల్లి ప్రేమ కేవలం ఒక ఎమోషన్ మాత్రమే కాదు, అది ప్రకృతి సిద్ధంగా ఏర్పడే ఒక రసాయన బంధం. నేడు మదర్స్ డే సందర్భంగా, అసలు తల్లి ప్రేమలో ఉండే ఆ సైన్స్ రహస్యాలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకను ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం ..

అమ్మ ప్రేమ వెనుక 'లవ్ హార్మోన్':

సైన్స్ ప్రకారం, ఒక బిడ్డ పుట్టినప్పుడు తల్లి మెదడులో 'ఆక్సిటోసిన్' అనే హార్మోన్ భారీగా విడుదలవుతుంది. దీనినే శాస్త్రవేత్తలు 'లవ్ హార్మోన్' అని పిలుస్తారు. ఈ హార్మోన్ వల్లనే తల్లికి తన బిడ్డపై విపరీతమైన ప్రేమ, రక్షణ కల్పించాలనే తపన కలుగుతాయి. బిడ్డకు ఏ చిన్న కష్టం వచ్చినా తల్లి విలవిలలాడటం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే.

త్యాగానికి ప్రేరణనిచ్చే మెదడు మార్పులు:

తల్లిగా మారిన తర్వాత ఒక స్త్రీ మెదడు పనితీరులో కూడా మార్పులు వస్తాయట. ప్రకృతి సిద్ధంగానే ఆమెలో త్యాగగుణం, సహనం మరియు బాధ్యత పెరుగుతాయి. ఇక తన ఆకలిని సైతం మర్చిపోయి బిడ్డ కోసం కష్టపడే శక్తి ఆమెకు ఈ హార్మోన్ల మార్పుల వల్లనే కలుగుతుంది. అందుకే అమ్మ ప్రేమకు ఏదీ సాటి రాదు అంటారు.

గ్లోబల్ డిఫరెన్స్ - దేశాన్ని బట్టి డేట్ మారుతుంది:

మదర్స్ డే అనగానే ప్రపంచమంతా ఒకే రోజు జరుపుకుంటారని మనం అనుకుంటాం. కానీ, ఇది దేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇక్కడ భారతదేశం లో అలాగే అమెరికా ఒకేరోజు మే నెల రెండో ఆదివారం నాడు జరుపుకుంటాం అంటే ఈరోజు మే 10వ తేదీన మనం జరుపుకుంటున్నట్లు అమెరికా లో జరుపుకుంటారు. ఇక యూకే అక్కడ మార్చి నెలలో 'మదరింగ్ సండే' పేరుతో నిర్వహిస్తారు. ఇక నార్వే లో ఫిబ్రవరి రెండో ఆదివారం నాడే అమ్మల పండుగ వచ్చేస్తుంది. ఇక థాయిలాండ్ లో అక్కడ ఆగస్టు నెలలో రాణి సిరికిత్ పుట్టినరోజు సందర్భంగా మదర్స్ డే జరుపుకుంటారు.

అమ్మకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చేయండి:

తేదీ ఏదైనా, దేశం ఏదైనా అమ్మకు ఇచ్చే గౌరవం ఒక్కటే. ఈ రోజున ఆమెకు ఇష్టమైన పని చేయడం లేదా ఒక చిన్న కానుక ఇచ్చి "థాంక్యూ అమ్మ" అని చెబితే ఆమె పొందే సంతోషం వెలకట్టలేనిది. మన బిజీ లైఫ్‌లో కనీసం ఇలాంటి రోజులప్పుడైనా అమ్మ త్యాగాలను గుర్తుచేసుకోవడం మన కనీస బాధ్యత.

తల్లి ప్రేమ అనేది సైన్స్ మరియు ఎమోషన్స్ కలిసిన ఒక అద్భుతమైన వరం. మనకు ఏ కష్టం రాకుండా చూసే ఆ 'సూపర్ ఉమెన్' కు ఈ మదర్స్ డే సందర్భంగా మనసారా కృతజ్ఞతలు తెలుపుకుందాం.