Begin typing your search above and press return to search.

Schools Holiday: ఈరోజు, రేపు స్కూలుకు సెలవు.. ఇక వరుసగా ఏకంగా ఐదు రోజులు..

హైదరాబాదులో ఈ ఏరియాలో ఈరోజు, రేపు కేవలం అర పూట మాత్రమే స్కూల్ జరగనుంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   13 Aug 2025 9:49 AM IST
Schools Holiday: ఈరోజు, రేపు స్కూలుకు సెలవు.. ఇక వరుసగా ఏకంగా ఐదు రోజులు..
X

School Holiday News

పిల్లలకి ఆనందకరమైన వార్త వచ్చేసింది. ప్రభుత్వమే ఈరోజు, రేపు కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించింది. దీంతో పిల్లలకు ఏకంగా ఐదు రోజుల సెలవు రానుంది. ఈరోజు నుంచి ఆదివారం వరకు స్కూల్లకు సెలవులు రానున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..హైదరాబాదులో వర్షం విపరీతంగా పడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాదులోని కొన్ని ఏరియాల్లో.. ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

School Holiday

హైదరాబాదులో ఈ ఏరియాలో ఈరోజు, రేపు కేవలం అర పూట మాత్రమే స్కూల్ జరగనుంది. అంతేకాకుండా తెలంగాణలో కొన్ని ప్రదేశాలో వర్షం ఎక్కువ పడుతూ ఉండగా.. కొన్ని పాఠశాలలు సెలవులు ప్రకటించాయి. ఈ క్రమంలో ఈరోజు, రేపు తరువాత.. శుక్రవారం ఇండిపెండెన్స్ డే, శనివారం శ్రీ కృష్ణాష్టమి.. ఇక వెంటనే ఆదివారం రావటంతో.. పిల్లలకు ఏకంగా ఐదు రోజుల పాటు విశ్రాంతి లభించనుంది.

మొత్తం పైన ఆగస్టులో గత వారమే మూడు రోజులు సెలవులు రాగా.. ఈవారం మళ్లీ అలా నుంచి ఐదు రోజుల కొన్ని పాఠశాలకు సెలవులు రావడం గమనార్హం.

Disclaimer

పైన చెప్పిన వివరాలు మాకు అందిన సమాచారం ప్రకారం మాత్రమే. స్కూల్లో సెలవులు ఆ వ్యక్తిగత స్కూల్ లకు సంబంధించి ఉంటుంది. కాబట్టి మీ స్కూల్ లతో సెలవల గురించి చెక్ చేసుకోవడం ఉత్తమం.