Begin typing your search above and press return to search.

అక్కడ పెళ్లిలో గిఫ్ట్ గా బంగారం.. పలహారంలా పంచేస్తూ!

భారత్‌లో తులం బంగారం ధర చుక్కలను తాకుతుంటే, సౌదీలో మాత్రం కిలోల కొద్దీ పసిడి బిస్కెట్లు గిఫ్టులుగా మారుతున్నాయి.

By:  Madhu Reddy   |   19 Feb 2026 3:53 PM IST
అక్కడ పెళ్లిలో గిఫ్ట్ గా బంగారం.. పలహారంలా పంచేస్తూ!
X

భారత్‌లో తులం బంగారం ధర చుక్కలను తాకుతుంటే, సౌదీలో మాత్రం కిలోల కొద్దీ పసిడి బిస్కెట్లు గిఫ్టులుగా మారుతున్నాయి. ఇటీవల ఓ పెళ్లిలో వధువు సోదరుడు వరుడికి ఏకంగా 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు కానుకగా ఇవ్వడం చూసి ప్రపంచమే అవాక్కైంది. మన దగ్గర బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితి ఉంటే, అక్కడ మాత్రం పసిడిని పలహారంలా పంచేస్తున్నారు. ఈ విలాసవంతమైన విందు వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలు ఇప్పుడు చూద్దాం..

అక్కడేమో బిస్కెట్లు.. ఇక్కడేమో చుక్కలు:

ప్రస్తుతం భారత్‌లో బంగారం కొనాలంటే సామాన్యుడు వందసార్లు ఆలోచించాల్సి వస్తోంది. ధరలు రోజురోజుకూ రికార్డు స్థాయికి చేరుతుండటంతో మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కానీ, సౌదీ అరేబియాలో సీన్ అస్సలు అలా లేదు. అక్కడ జరిగిన ఒక వివాహ వేడుకలో వధువు తరఫువారు వరుడికి ట్రే నిండా బంగారు బిస్కెట్లను పెట్టి కానుకగా ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు "మీ పెళ్లికి మమ్మల్ని కూడా పిలవాల్సింది" అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఇక మన దేశంలో తులం కోసం తహతహలాడుతుంటే, అక్కడ కిలోల కొద్దీ బంగారం ఇలా బహిరంగంగా పంచడం చూస్తుంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎంత బలంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

సౌదీ వాళ్ళ రేంజ్ వేరబ్బా.. కారణం అదే:

సౌదీలో బంగారం ఇంతలా వాడటానికి కారణం అక్కడ దొరికే ముడి చమురు సంపద. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఉండే దేశాల్లో సౌదీ ఒకటి. అక్కడి ప్రజల తలసరి ఆదాయం చాలా ఎక్కువ కావడంతో విలాసాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. ముఖ్యంగా అరబ్ సంస్కృతిలో పెళ్లిళ్లంటే పరువుకు చిహ్నం. ఇక వధువుకు పెట్టే 'మహర్'అంటే కానుక దగ్గర నుంచి, ఇచ్చే గిఫ్టుల వరకు అంతా రాయల్ లుక్‌లో ఉండాలని కోరుకుంటారు. పైగా, సౌదీలో బంగారం నాణ్యత చాలా ఎక్కువ, టాక్సులు తక్కువ ఉండటం వల్ల అక్కడ బంగారం కొనడం మనకంటే సులభం. అందుకే ఇలాంటి పసిడి విందులు అక్కడ అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి.

అది ప్రేమా? ఆడంబరమా? అసలు ట్విస్ట్:

ఈ వీడియో వైరల్ అయిన తర్వాత నెటిజన్ల మధ్య పెద్ద చర్చ మొదలైంది. కొందరు ఇది కేవలం ఆడంబరం కోసం చేసిన పనని అంటుంటే, మరికొందరు మాత్రం అది వారి సంప్రదాయమని వాదిస్తున్నారు. ఇక నిజానికి భారత్ వంటి దేశాల్లో బంగారం అనేది ఒక పెట్టుబడి, కానీ సౌదీ వంటి దేశాల్లో అది కేవలం ఒక అలంకారం మరియు హోదాకు నిదర్శనం. ఇక ప్రస్తుతం అక్కడ ఈ బంగారం పంచిన వధువు సోదరుడి ఫైనాన్షియల్ స్టేటస్ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా, ప్రపంచవ్యాప్తంగా సామాన్యులు ధరలతో కుస్తీ పడుతుంటే, ఇలాంటి వీడియోలు చూసినప్పుడు "అదృష్టం అంటే వాళ్ళదే" అనుకోకుండా ఉండలేం.