సీఎం విజయ్ పై సత్యరాజ్ షాకింగ్ కామెంట్స్
ఇక డీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ని తమిళనాడు ప్రజలు ఓడించడం పట్ల సత్యరాజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
By: Satya P | 7 Jun 2026 9:17 AM ISTతమిళనాడు కొత్త ముఖ్యమంత్రి దళపతి విజయ్ మీద కోలీవుడ్ సీనియర్ నటుడు వెనకటి తరం హీరో అయిన సత్యరాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన పార్టీ టీవీకే గత నెలలో సాధించిన విజయం పూర్తిగా సినీ గ్లామర్ మీదనే ఆధారపడి దక్కిందని తేల్చేశారు. ప్రజలు సినిమా మోజులో పడి టీవీకేని గెలిపించారు అన్నారు. డీఎంకే తమిళ ప్రజలకు ఎంతో చేసిందని అయినా ఓడించారు అంటే సినీ మోజుతో మాత్రమే అని విశ్లేషించారు. కొత్త సీఎం విజయ్ ప్రజా సమస్యల మీద ట్విట్టర్ లో మాత్రమే స్పందిస్తున్నారు అంటూ దెప్పి పొడిచారు.
స్టాలిన్ ని ఓడిస్తారా :
ఇక డీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ని తమిళనాడు ప్రజలు ఓడించడం పట్ల సత్యరాజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సొంత అసెంబ్లీ నియోజకవర్గం కొలత్తూరులో ఎమ్మెల్యేగా కూడా గెలవనీయకుండా జనాలు ఓడించడమేంటని సత్యరాజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన తాజాగా డీఎంకే నిర్వహించిన పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ తమిళనాడు ప్రజల విచక్షణను వారు తాజాగా ఇచ్చిన తీర్పును ప్రశ్నించారు. అదే సమయంలో స్టాలిన్ ద్రావిడ పాలన నమూనాను ఆయన గొప్పగా ప్రశంసించారు.
ప్రజల కోసం ఎంతో చేసినా :
స్టాలిన్ అయితే తన సొంత నియోజకవర్గం కోలత్తూరులో ప్రజల కోసం ఎంతో చేసిన స్టాలిన్ ని ఓండించడం తగునా అని జనాలను ప్రశ్నించారు సినీ వ్యామోహంలో జనాలు పడ్డారని సత్యరాజ్ చెప్పడం విశేషం. డీఎంకేని ఓడించారని ఆయితే ఇది ఎదురుదెబ్బ ఆ పార్టీకి కాదని ప్రజలకే తిరిగి సరైన గుణపాఠం నేర్పుతుందని సత్యరాజ్ చెప్పడం విశేషం. తాను డీఎంకేకు వీర విధేయుడిని అని సత్యరాజ్ గట్టిగా చెపారు. తనను టీవీకే వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేసినా తాను భయపడేది లేదని కూడా స్పష్టంచేశారు.
విజయ్ మీద విమర్శలు :
కొత్తగా తమిళనాడులో పాలన మొదలెట్టిన టీవీకే ప్రభుత్వం మీద సత్యరాజ్ విమర్శలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వానికి పార్లమెంటరీ మర్యాద కొరవడిందని సత్యరాజ్ విజయ్ తీరు పట్ల తీవ్రంగా విమర్శించారు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అసెంబ్లీలో చేసిన ప్రసంగ శైలిని, కూడా సత్యరాజ్ తప్పుపట్టారు. అసెంబ్లీ చర్చలు జరిగినపుడు ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అడిగిన పదునైన ప్రశ్నలను విజయ్ తప్పించుకుంటున్నారని విమర్శించారు. ఇక వాటికి బదులుగా ట్విట్టర్‌లో సమస్యలను ప్రస్తావిస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం గా విజయ్ పనితీరుని తప్పుపట్టిన సత్యరాజ్ ప్రతిపక్ష నాయకుడిగా ఉదయనిధి స్టాలిన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారని మెచ్చుకోవడం విశేషం. మరి సత్యరాజ్ చేసిన ఈ హాట్ కామెంట్స్ కి టీవీకే ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సిందే.
