స్త్రీ వేషధారణపై నెట్టింట చర్చ.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం!
ఒక అమ్మాయి చీర కట్టుకుంది.కానీ దానికి తగ్గట్టు బ్లౌజ్ కాకుండా తన దగ్గర మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకున్నట్టు కనిపిస్తోంది.
By: Madhu Reddy | 25 Aug 2025 8:15 AM ISTఒకప్పుడు ఆడవాళ్లు ఒంటినిండా బట్టలు వేసుకునేవారు. కానీ ఇప్పుడు అసలు ఆడవాళ్లకు ఒంటి మీద బట్టలు ఉంటున్నాయో లేదో కూడా అర్థం అవ్వడం లేదు అని ఇప్పటికే కామెంట్స్ వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో రెండు రకాల వాదనలు వినిపిస్తాయి. కొంతమంది ఏమో ఆడవాళ్లు బట్టల విషయంలో మరీ దారుణంగా తయారవుతున్నారంటే.. మరికొంత మందేమో బట్టల విషయంలో ఎవరి ఎంపిక వారిది.. వాళ్లకు కనీసం నచ్చిన డ్రెస్ వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా అంటూ ఉంటారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ ఆడవాళ్ళ బట్టల గురించి ఒక చర్చ జరుగుతోంది.
ఒక అమ్మాయి చీర కట్టుకుంది.కానీ దానికి తగ్గట్టు బ్లౌజ్ కాకుండా తన దగ్గర మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకున్నట్టు కనిపిస్తోంది.కానీ ఆ బ్లౌజ్ ఎలా ఉంది అంటే బ్లౌజ్ లాగా కాకుండా బ్రా లాగా కనిపిస్తోంది. దాంతో ఇలాంటి బట్టలు వ్యతిరేకించే చాలామంది పురుషులు ఆ అమ్మాయి ఫోటోని వైరల్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.. ఇక అమ్మాయిలను, అమ్మాయిలు డ్రెస్ లను విమర్శించడమే పనిగా పెట్టుకున్న వాళ్లు మరింత అవమానకరంగా కామెంట్లు చేస్తున్నారు.. అయితే కొంతమంది ఎక్కడ వివాదాన్ని సృష్టిస్తామా అని కాచుకొని కూర్చుంటారు. ఇలాంటి వాళ్లే సోషల్ మీడియాలో పలు వివాదాలను క్రియేట్ చేస్తూ ఉంటారు. అలా తాజాగా ఈ అమ్మాయి వేసుకున్న బ్లౌజ్ వివాదాన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఇక మరికొంతమందేమో ఆ అమ్మాయి చేసిన దాంట్లో తప్పేమీ లేదు.. ఆమెకి నచ్చిన బట్టలు ధరించే హక్కు ఆమెకు ఉంది. అలాంటప్పుడు ఆమె ఎలాంటి దుస్తులు ధరిస్తే మీకేంటి ప్రాబ్లం.. వేసుకున్న ఆమెకు లేదు.. వాళ్ళ ఇంట్లో వాళ్లకి లేదు.. అలాంటప్పుడు సోషల్ మీడియాలో చూసే మీకేంటి ఇబ్బంది అంటూ మాట్లాడుతున్నారు.. అంతే కాకుండా ఈ స్టైలిష్ ప్రపంచంలో ఆమె కూడా కాస్త ట్రెండీగా ఉండాలని అలాంటి బ్లౌజ్ వేసింది కావచ్చు. ఆమె ధరించిన బట్టల్లో అంత అసభ్యత ఏమీ కనిపించడం లేదే అంటూ సపోర్ట్ చేస్తున్నారు.
అయితే మహిళలు బట్టలు ధరించే విషయంలో మగవాళ్లే కాదు కొంతమంది ఆడవాళ్లు కూడా మగవాళ్ళు మాట్లాడే మాటల్ని సమర్థిస్తూ ఉంటారు. ఎందుకంటే నచ్చిన బట్టలు వేసుకోవడం వాళ్ళ ఇష్టమే.. కానీ ఆ బట్టలు మరీ ఇతరులను ఇబ్బంది పెట్టేవిగా ఉంటే మాత్రం మహిళలు కూడా దీన్ని సమర్ధించరు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందరి దృష్టి తమ మీదే పడాలి అనుకుంటున్నారు.. ఇలాంటి వాళ్ళ వల్ల సమాజంలో మహిళలు వేసుకునే బట్టలపై నెగిటివిటీ పెరిగిపోతుంది. ట్రెండీగా.. స్టైలిష్ గా.. ఉండడం మంచిదే..కానీ అది మరీ మితిమీరితేనే ప్రాబ్లమ్.
