అధికారిక జయంతిగా గౌతు లచ్చన్న పుట్టిన రోజు
సర్దార్ గౌతు లచ్చన్న జయంతి నెల 16న ఉంది. ఆయన జయంతి వేడుకను అధికారికంగా నిర్వహించాలని ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
By: Satya P | 16 Aug 2025 9:30 AM ISTసర్దార్ గౌతు లచ్చన్న జయంతి నెల 16న ఉంది. ఆయన జయంతి వేడుకను అధికారికంగా నిర్వహించాలని ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 1909 ఆగస్టు 16న ఆనాటి గంజాం జిల్లా సోంపేటలోని ఒక మారుమూల పల్లెలో జన్మించిన గౌతు లచ్చన్న తనదైన పోరాటాలతో సర్దార్ అనిపించుకున్నారు. ఆయన బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం జీవితకాలం అంతా పోరాడారు.
ప్రజా ప్రక్షంగానే :
ఆయన జీవితమంతా ప్రజా పక్షానే ఉన్నారు. అధికారంలో ఉన్నా లేక ప్రతిపక్షంలో ఉన్నా కూడా తాను సిసలైన ప్రజా నాయకుడిని అని ఎలుగెత్తి చాటారు. బడుగులు కూడా రాజ్యాంగం ప్రకారం అన్ని హక్కులు అందుకోవాల్సిన వారే అని లోకానికి చాటడమే కాదు ఏలిన వారి కళ్ళు తెరిపించి వారికి ఉన్నత మార్గాలను చూపించిన దార్శనీకుడిగా నిలిచారు
పదవులు తృణప్రాయంగా :
ఆయన సంఘ సంస్కర్తగా ఆధునిక రాజకీయ యోధుడిగా చరిత్రలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం పదవులు సైతం తృణ ప్రాయంగా త్యజించారు. అందుకే ఆయన అనేక పార్టీలలో చేరినా బయటకు వచ్చేసేవారు. ఇక ఆయన ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పాటు అయితే తొలి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అలా ఆయన రాజాజీ ప్రకాశం పంతులు మంత్రివర్గంలో పనిచేసారు.
సంఘర్షణలు సవాళ్ళూ :
అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 1978లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆయన రాజకీయ జీవితం ముళ్ళ పానుపుగానే నడచింది. సంఘర్షణల నుంచే ఆయన ముందుకు సాగారు. సమస్యల నుంచే సవాళ్ళ నుంచే తన రాజకీయ జీవితాన్ని కొనసాగించారు. ఉత్తరాంధ్రా వంటి అత్యంత వెనకబాటుతనంతో ఉన్న ప్రాంతంలో జన్మించిన ఆయన ఈ ప్రనతానికే వన్నె తెచ్చారు.
బీసీల దేవుడిగా :
ఇదిలా ఉంటే ఆయన జయంతిని అధికారికంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీలు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బడుగు జనుల బాంధవుడికి ఇది గొప్ప గౌరవంగా చెబుతున్నారు. ఆయనకు ఈ మర్యాద తగినదని కూడా అంటున్నారు ఈ నెల 16న రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో జిల్లా కార్యాలయాలలో ప్రభుత్వం గౌతు లచ్చన్న జయంతిని అధికారీంగా నిర్వహిస్తుంది. ఆయన 117వ జయంతిగా జరుపుకుంటారు
వారసులు వారే :
ఇక ఆయన రాజకీయ వారసులు చూస్తే కుమారుడు శ్యామ్ సుందర్ శివాజీ టీడీపీలో సీనియర్ నేతగా మంత్రిగా పనిచేశారు. ఆయన కుమార్తె గౌతు శిరీష పలాస నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె రాజకీయంగా తాత లచ్చన్న తండ్రి శివాజీ అడుగు జాడలలో నడుస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే లచ్చన్న వారసులు అంటే బడుగులు అట్టడుగు వర్గాలే అని అంతా చెబుతారు. వారు కూడా ఆయననే స్పూర్తిగా తీసుకుంటారు.
