Begin typing your search above and press return to search.

లచ్చన్నకు గౌరవం....శిరీషకు ప్రాభవం !

సర్దార్ గౌతు లచ్చన్నను అధికారికంగా గౌరవించుకుంది కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్రలోని అత్యంత వెనకబాటుతనం తో ఉన్న శ్రీకాకుళం జిల్లా సోంపేటలో జన్మించిన లచ్చన్న జీవితం తెల్ల దొరల మీద పోరాటంతో మొదలై నల్ల దొరల మీద కూడా కొనసాగింది.

By:  Satya P   |   16 Aug 2025 11:38 PM IST
లచ్చన్నకు గౌరవం....శిరీషకు ప్రాభవం !
X

సర్దార్ గౌతు లచ్చన్నను అధికారికంగా గౌరవించుకుంది కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్రలోని అత్యంత వెనకబాటుతనం తో ఉన్న శ్రీకాకుళం జిల్లా సోంపేటలో జన్మించిన లచ్చన్న జీవితం తెల్ల దొరల మీద పోరాటంతో మొదలై నల్ల దొరల మీద కూడా కొనసాగింది. ఆయన అవినీతి అన్యాయం విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. తన వారూ పరవారు అన్న తేడా చూపించలేదు. అందుకే ఆయన ఎపుడూ ప్రతిపక్షంలోనే ఎక్కువగా కనిపించేవారు. రాజీలేని ఆ తత్వాన్ని చూసిన ప్రజలు ఆయనకు సర్దార్ అని బిరుదు ఇచ్చారు. సర్దార్ అంటే సేనాని అని అర్థం. అలా దేశంలో వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ బిరుదుని అందుకున్నది మాత్రం లచ్చన్న అని చెప్పాలి.

అధికారికంగా జయంతి :

లచ్చన్నది సుదీర్ఘమైన రాజకీయ జీవితం. ఆయన 97 ఏళ్ళ పాటు జీవించారు. 2006లో మరణించారు. చంద్రబాబు సీఎం అయ్యాక కూడా ఆయనతో సాన్నిహిత్యం నెరిపారు. ఇక శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు చూస్తే లచ్చన్న ఏకైక కుమారుడు శ్యామ సుందర శివాజీ దివంగత ఎర్రన్నాయుడు ఇద్దరూ జంట ఎమ్మెల్యేలుగా పేరు పొందారు. ఈ ఇద్దరూ టీడీపీలో బాబు వర్గంలో ఉండేవారు. ఇక ఈ ఇద్దరినీ బాబు సమాదరించారు. అదే విధంగా శివాజీకి ఆయన మంత్రిగా పనిచేసే అవకాశం కల్పించారు. అయితే 2014 నుంచి 2019 మధ్యలో బాబు ప్రభుత్వంలో శివాజీకి మంత్రిగా పనిచేసే అవకాశం దక్కలేదు. దాంతో ఆయన కొంత నిరాశ చెందారు.

వారసురాలి రూపంలో :

అయితే సామాజిక సమీకరణలు వల్లనే ఆయనకు చాన్స్ ఇవ్వలేదు అని చెబుతారు కానీ శివాజీ కుమార్తె శిరీషను రాజకీయంగా బాబు ప్రోత్సహించారు ఆమెకు 2019లో తొలిసారి పలాస నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చారు ఆ ఎన్నికల్లో వైసీపీ ప్రభజనం వల్ల ఆమె ఓటమి పాలు అయినా అయిదేళ్ళ పాటు నియోజకవర్గాన్ని కదలకుండా ఉంటూ తన పట్టు బిగించారు ఫలితంగా మంచి మెజారిటీతో 2024లో గెలిచారు ఆమె గత పదిహేను నెలలుగా తన పనితీరుతో ఎమ్మెల్యేగా రాణిస్తున్నారు అధినాయకత్వం వద్ద కూడా మంచి మార్కులు పడుతున్నాయి. ఇక వైసీపీని రాజకీయంగా ఊపిరి తీసుకో నీయకుండా చేస్తూ టీడీపీకి నియోజకవర్గాన్ని ఏకపక్షం చేస్తున్నారు.

భవిష్యత్తు బంగారమే :

ఇక తాత గౌతు లచ్చన్న కీర్తి ప్రతిష్టలు శిరీషకు శ్రీరామ రక్షగా ఉంటాయని అంటున్నారు. అంతే కాదు తాత తండ్రులు ఇద్దరూ మంత్రులుగా పనిచేసిన వారే అని ఫ్యూచర్ లో శిరీష సైతం మంత్రి అవడం ఖాయమని అంటున్నారు. శిరీష పనితీరు మీద టీడీపీ అధినాయకత్వానికి మంచి గురి ఉండడం వల్ల ఆమెకు రాజకీయంగా మరింత ప్రాభవం దక్కడం ఖాయమని అంటున్నారు. మొత్తం మీద చూస్తే లచ్చన్నకు ఎంతో గౌరవం ఇస్తున్న కూటమి ప్రభుత్వం అదే కుటుంబానికి చెందిన శిరీషను తప్పకుండా సమాదరిస్తుందని అంటున్నారు దంతో శ్రీకాకుళం నుంచి భవిష్యత్తు తరం నాయకురాలిగా బలమైన నేతగా శిరీష నిలబడతారు అని అంటున్నారు.