కన్న పేరెంట్స్ ను చంపింది.. బెయిలొచ్చినా అదే గతి పట్టింది.. ఇది కదా అసలైన 'సైకో' ప్రేమంటే!
సినిమాల్లో విలన్‌ను ఎండ్ కార్డ్‌లో చంపేయడం చూస్తుంటాం. కానీ సొంత కథలోనే విలన్‌గా మారి.. ఆపై క్లైమాక్స్‌లో కూడా సేమ్ సీన్ రీ-క్రియేట్ చేసుకున్న ఈ డ్రామా చూస్తే ఎవరికైనా పిచ్చెక్కాల్సిందే.
By: A.N.Kumar | 24 Aug 2026 10:50 AM ISTసినిమాల్లో విలన్‌ను ఎండ్ కార్డ్‌లో చంపేయడం చూస్తుంటాం. కానీ సొంత కథలోనే విలన్‌గా మారి.. ఆపై క్లైమాక్స్‌లో కూడా సేమ్ సీన్ రీ-క్రియేట్ చేసుకున్న ఈ డ్రామా చూస్తే ఎవరికైనా పిచ్చెక్కాల్సిందే. సంగారెడ్డికి చెందిన 25 ఏళ్ల ‘గ్రేట్’ నర్సు సురేఖ చేసిన ఘనకార్యం వింటే బుర్ర ఉన్నోడెవ్వడైనా షాక్ అవ్వాల్సిందే.
కథలోకి వెళ్తే... అమ్మాయిగారు ఒకరితో ప్రేమలో పడ్డారట. మరి మనసు పడ్డాక పెళ్లి చేసుకోకపోతే ఎలా? కానీ పాపం ఇంట్లో తల్లిదండ్రులు దశరథ, లక్ష్మిలకు ఈ ‘గొప్ప’ పెళ్లి ఇష్టం లేదు. అసలు కూతురి సంతోషాన్ని కాదనడానికి వాళ్లెవరు? అందుకే మన నర్సమ్మగారు తన దగ్గరున్న మెడికల్ నాలెడ్జ్‌ని సరిగ్గా వాడేశారు. 'నా ప్రేమకు అడ్డొస్తారా?' అని ఏకంగా కన్న తల్లిదండ్రులకే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి శాశ్వతంగా నిద్రపుచ్చేశారు. పోనీ అంతటితో ఊరుకున్నారా? "అయ్యో, వాళ్లకు హార్ట్ అటాక్ వచ్చిందండీ" అని నటనలో సావిత్రిని మించిపోయి కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ప్లానింగ్ ఎంత గ్రాండ్‌గా ఉన్నా, పోలీసులు ఎంట్రీ ఇచ్చి 'ఓవర్ యాక్షన్' కి ఫుల్ స్టాప్ పెట్టేసారు. అసలు మ్యాటర్ బయటపడటంతో కటకటాల వెనక్కి పంపారు.
ఏడు నెలలు జైల్లో ఉండి చల్లటి గాలి పీల్చుకున్నాక.. ఇటీవలే బెయిల్‌పై మేడమ్ గారు బయటకొచ్చారు. బహుశా జైల్లో ఉన్నంతసేపూ తన మాస్టర్ ప్లాన్ ఎక్కడ ఫెయిల్ అయిందా అని రీసెర్చ్ చేశారేమో.. బయటికొచ్చి సంగారెడ్డి హాస్టల్‌లో దిగి.. ఈసారి సేమ్ ఫార్ములాను తన మీదనే ప్రయోగించుకున్నారు. తల్లిదండ్రులను పోగొట్టడానికి వాడిన ఆ మత్తు ఇంజెక్షన్నే ఈసారి తన ప్రాణం తీసుకోవడానికి వాడుకుని.. సీన్‌ను ‘సక్సెస్ ఫుల్’గా ముగించారు.
అసలు ఈ కథలో విచిత్రం ఏంటంటే... తల్లిదండ్రులను లేపేస్తే ప్రేమించినోడు వచ్చి కాళ్లు పట్టుకుని పెళ్లి చేసుకుంటాడనుకుందో లేక జైలు నుంచి రాగానే పూలమాలలతో స్వాగతం పలుకుతారనుకుందో ఆ మహానుభావురాలికే తెలియాలి.. ఆవేశం నెత్తికెక్కితే మనుషులు ఎంత దారుణానికి ఒడిగడతారో చెప్పడానికి ఈ ఘటనే ఒక పెద్ద ఉదాహరణ.
చివరికి ఏమైంది? అటు తల్లిదండ్రుల ప్రాణాలు పోయాయి..ఇటు ఈమె ప్రాణమూ పోయింది. కనీసం బ్రతికున్న ఆ సోదరుడికి తీరని శోకాన్ని మిగిల్చారు. ‘ప్రేమ గుడ్డిది’ అంటారు గానీ మరీ ఇంత గుడ్డిగా ఉండి కన్నవాళ్లని.. చివరికి తన్నూ చంపుకునేంత పిచ్చిగా ఉంటుందని ఈ నర్సమ్మ నిరూపించింది. క్షణికావేశంలో తీసుకునే ఇలాంటి ‘తెలివైన’ నిర్ణయాలు జీవితాలను ఎలా నాశనం చేస్తాయో చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం.
