Begin typing your search above and press return to search.

పాక్ కు బిగ్ ట్రబుల్... భారత్ సైనిక శక్తికి కొత్త గుడ్ న్యూస్ వచ్చింది!

అవును... ఇటీవల కాలంలో సైనిక సామర్థ్యాలను పెంచుకునే విషయంలో భారత్ ముందుంటున్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   27 Nov 2025 2:00 AM IST
పాక్  కు బిగ్  ట్రబుల్... భారత్  సైనిక శక్తికి కొత్త  గుడ్  న్యూస్  వచ్చింది!
X

ప్రాంతీయ రక్షణ వాతావరణంలో తన జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి, ముప్పులకు వ్య్యతిరేకంగా సమర్థవంతమైన నిరోధకాన్ని నిర్వహించడానికి ప్రయత్నించే క్రమంలో భారత్ తన సైనిక సామర్థ్యాలను పెంచుకుంటూనే ఉన్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ అనంతరం దీనిపై మరింత శ్రద్ధ పెట్టింది. ఈ సమయంలో మరో కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది.

అవును... ఇటీవల కాలంలో సైనిక సామర్థ్యాలను పెంచుకునే విషయంలో భారత్ ముందుంటున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి గతంలో.. కొత్త అధునాతన ఆయుధాలు, స్వదేశీ రక్షణ ఉత్పత్తిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారత్ తన సైనిక శక్తిని ఆధునీకరించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది, పూర్తి చేసింది. ఈ సమయంలో ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీ సఫ్రాన్ నుంచి గుడ్ న్యూస్ వచ్చింది.

ఇందులో భాగంగా... రాఫెల్ విమానాల కోసం సఫ్రాన్ సంస్థ తన ఫైటర్ జెట్ ఇంజిన్ టెక్నాలజీని భారతదేశానికి పూర్తిగా బదిలీ చేయడానికి అంగీకరించింది. దీంతో రాఫెల్ విమానం సఫ్రాన్ కి చెందిన ఎం88 ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. వాస్తవానికి ప్రారంభంలో సఫ్రాన్ భారతదేశానికి లోకల్ వెర్షన్, దేశీయ విమానాల కోసం ఒక ఉత్పన్న ఇంజిన్ ను ప్రతిపాదించింది.

అయితే ఇప్పుడు కంపెనీ 100% టెక్నాలజీని బదిలీ చేయడానికి అంగీకరించింది. ఇలా సఫ్రాన్ నుంచి ఈ సాంకేతిక పరిజ్ఞానం బదిలీ జరగడం.. భారత ఏరోస్పేస్ పరిశ్రమను గణనీయంగా బలోపేతం చేస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ఐదో తరం యుద్ధ విమానం అయిన ఏఎంసీఏ కోసం ఇంజిన్ పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇది రష్యన్ ఎస్.యూ-57 కంటే మెరుగైన పనితీరు కనబరుస్తుందని అంటున్నారు.

ఈ క్రమంలో... భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీ.ఆర్.డీ.ఓ)కు చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌ మెంట్ (జీ.టీ.ఆర్.ఈ.)తో కలిసి సాఫ్రాన్ ఒక కొత్త ఇంజిన్‌ ను అభివృద్ధి చేయనుంది. దీని కోసం సుమారు ఏడు బిలియన్ డాలర్ల ఖర్చుతో ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు కానుంది. త్వరలోనే ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

మరోవైపు.. సాఫ్రాన్ కు వాణిజ్య విమానయాన రంగంలో కూడా భారత్ ఒక ప్రధాన కేంద్రంగా మారుతోందని అంటున్నారు. ఇందులో భాగంగా... భౌగోళికంగా తయారీని విస్తరించడంలో భాగంగా ఈ సంస్థ హైదరాబాద్ లో లీప్ ఇంజిన్ల కోసం ఒక నిర్వహణ, మరమ్మత్తు కేంద్రం ప్లాంట్ ను ప్రారంభించింది. ఈ సమయంలో.. ఇండిగో, ఎయిరిండియా, ఆకాశ్ వంటి భారతీయ సంస్థలు రాబోయే ఏళ్లలో సుమారు 1,300కు పైగా విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చాయి.