Begin typing your search above and press return to search.

షాక్ తినేలా.. శబరిమల 18వ మెట్టు వద్ద నల్లతాచు

అంచనాలకు మించిన భక్తులతో.. అయ్యప్ప స్వాములతో శబరిమల సన్నిధానం కిక్కిరిసిపోతున్న సంగతి తెలిసిందే.

By:  Garuda Media   |   21 Nov 2025 9:26 AM IST
షాక్ తినేలా.. శబరిమల 18వ మెట్టు వద్ద నల్లతాచు
X

అంచనాలకు మించిన భక్తులతో.. అయ్యప్ప స్వాములతో శబరిమల సన్నిధానం కిక్కిరిసిపోతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో గతంతో పోలిస్తే.. ఈ ఏడాది సీజన్ లో ఇప్పటికే లక్షలాది మంది భక్తులు.. అయ్యప్పలు కొండ మీద పోటెత్తటంతో.. అయ్యప్పస్వామి దర్శనం లభించేందుకు పదిహేను పదహారు గంటల సమయం పడుతున్న పరిస్థితి. దీంతో.. భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

దీనికి తోడు ఈఏడాది కేరళ సర్కారు సైతం తక్కువగా సదుపాయాలు ఏర్పాటు చేసిందని.. భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు లేవని.. పంబ నది వద్ద కూడా సరైన నియంత్రణ లేకపోవటంతో.. ఆ పవిత్రనది నీళ్లు మురికిగా మారాయన్న విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా అనూహ్యంగా చోటు చేసుకున్న ఒక పరిణామం షాకింగ్ గా మారింది.

దీక్ష తీసుకున్న శబరిమల అయ్యప్పలు పరమ పవిత్రంగా భావించే సన్నిధానంలోని 18 మెట్లను ఎక్కడం ద్వారా తమ దీక్షను ముగిసినట్లు అవుతుందని భావిస్తారు. పద్దెనిమిది మెట్లు ఎక్కిన తర్వాత స్వామి వారి దర్శనం చేసుకోవటం తెలిసిందే. తాజాగా పద్దెనిమిదో మెట్టు వద్ద ఒక నల్లతాజు రావటంతో కలకలం రేగింది. విధుల్లో ఉన్న పోలీసులు పై నుంచి కేకలు వేస్తూ.. భక్తుల్ని అలెర్టు చేశారు. మరోవైపు.. ఈ సమాచారాన్ని స్నాక్ క్యాచర్ కు ఇవ్వటంతో వారు రంగంలోకి దిగి పామును పట్టుకున్నారు. దీంతో భక్తులు.. బలంగా ఊపిరి పీల్చుకున్నారు.

అటవీ శాఖకు చెందిన స్నేక్ క్యాచర్లు చాకచక్యంగా నల్లతాచును పట్టుకొని.. బ్యాగులో బంధించారు.ఆ వీడియోను రాష్ట్ర అటవీ శాఖ తన సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో అదిప్పుడు వైరల్ గా మారింది. ఇప్పటివరకు ఈ టీంలు ఆయా ప్రాంతాల్లో పదికి పైగా విషసర్పాలు.. మరో పాతిక వరకు సాధారణ పాముల్ని పట్టుకున్నట్లుగా పేర్కొంటున్నారు. ఏది ఏమైనా.. సన్నిధానంలో స్వామిని దర్శించుకోవాలని భావిస్తున్న వేళ.. నల్లతాచు ఎంట్రీ భక్తులకు కొత్త టెన్షన్ ను తెచ్చి పెడుతుందన్న మాట వినిపిస్తోంది.

మరోవైపు శబరిమలకు వెళ్లిన తెలుగు యాత్రికుడి ప్రయాణం విషాదంగా మారింది. అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లిన శంకర్ పల్లికి చెందిన అయ్యప్ప భక్తులు మల్లికార్జున రెడ్డి గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. పంబ నదిలో స్నానం చేసిన తర్వాత స్వామి సన్నిధానం చేరుకునే మార్గంలో పులిమెడ వద్ద అస్వస్థతకు గురయ్యారు. పరీక్షలు జరిపిన వైద్యులు అప్పటికే మరణించినట్లుగా పేర్కొన్నారు. మల్లికార్జున్ రెడ్డి మరణంతో బుల్కాపూర్ వార్డుల్లో విషాద ఛాయలు అలుముకున్నారు. స్వామి దర్శనానికి వెళ్లి.. అనంతలోకాలకు పయనమైన ఈ ఉదంతం కన్నీటిని కార్పించేలా చేస్తుందని చెప్పాలి.