Begin typing your search above and press return to search.

''విజ‌య్ మొండి ఘ‌టం.. ఆ ఘ‌ట‌న త‌ర్వాత‌.. పార్టీ వ‌ద్ద‌న్నాం''

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 110 స్థానాల్లో విజ‌యం దిశ‌గా దూసుకుపోతున్న విజ‌య్ పార్టీ టీవీకే.

By:  Garuda Media   |   4 May 2026 11:30 PM IST
విజ‌య్ మొండి ఘ‌టం.. ఆ ఘ‌ట‌న త‌ర్వాత‌.. పార్టీ వ‌ద్ద‌న్నాం
X

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 110 స్థానాల్లో విజ‌యం దిశ‌గా దూసుకుపోతున్న విజ‌య్ పార్టీ టీవీకే. అన్నీ అనుకూలిస్తే.. ఆయ‌న ముఖ్య‌మంత్రి కావ‌డం పెద్ద స‌మ‌స్య కాదు. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని విజ య్ కుటుంబ స‌భ్యులు సంబ‌రాలు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా విజ‌య్ తండ్రి, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. విజ‌య్ గెలుస్తాడ‌ని తాను ముందుగానే ఊహించాన‌ని చెప్పారు. అయితే.. క‌రూర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న త‌ర్వాత‌.. తాము పార్టీని మూసేయాల‌ని చెప్పామ‌ని ఆయ‌న వెల్ల‌డిం చారు.

కానీ, మొదటి నుంచి ప‌ట్టుద‌ల ఉన్న విజ‌య్‌.. తాను చేప‌ట్టిన ప‌నుల‌ను విజ‌య వంతం చేసుకునే వ‌ర‌కు నిద్ర‌పోడ‌ని వ్యాఖ్యానించారు. క‌రూర్ ఘ‌ట‌న‌కు సంతాపంగా ఆయ‌న ఆయా కుటుంబాల‌ను ఆదుకు న్నార‌ని.. ఆ త‌ర్వాత మ‌రింత ద్రుఢంగా రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలిపారు. ''సినిమాల్లో విజ‌య్ ఎంత మొండిగా ప‌నిచేస్తాడో నాకు తెలుసు. త‌న‌కు ఈ క్యారెక్ట‌ర్ స‌రిపోద‌ని చెబితే.. అదే వేసి మెప్పిస్తాడు. ఇప్పుడు రాజ‌కీయాల్లోనూ అంతే'' అని చంద్ర‌శేఖ‌ర్ అన్నారు.

ఎవ‌రీ విజ‌య్‌..

విజ‌య్ అస‌లుపేరు: జోసెఫ్ విజ‌య్‌.

వ‌య‌సు : 51 సంవ‌త్స‌రాలు

పుట్టింది : చెన్నై 22, జూన్ 1974

చ‌దివింది: ఎం.ఏ. ఇన్ విజువ‌ల్ క‌మ్యూనికేష‌న్‌

తండ్రి: చంద్ర‌శేఖ‌ర్.. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు.

త‌ల్లి: శోభ ప్ర‌శిద్ధ త‌మిళ గాయ‌కురాలు.

పిల్లలు: కుమారుడు, కుమార్తె

రాజ‌కీయం: కుటుంబ ప‌రంగా ఎలాంటి రాజ‌కీయ వాస‌న‌లు లేక‌పోయినా.. ప్ర‌జ‌ల కోసం ఆయ‌న పార్టీ పెట్టారు.