Begin typing your search above and press return to search.

ప్రసిద్ధ గాయని ఎస్ జానకికి పుత్ర వియోగం!

ఇక నటుడిగా మురళీకృష్ణ తొలి చిత్రం తెలుగులోనే ఉంది. ఆ చిత్రమే దిగ్దర్శకుడు కె విశ్వనాధ్ రూపొందించిన శృతిలయలు.

By:  Satya P   |   22 Jan 2026 10:31 PM IST
ప్రసిద్ధ గాయని ఎస్ జానకికి పుత్ర వియోగం!
X

సుప్రసిద్ధ గాయనీమణి ఎస్ జానకికి పుత్ర వియోగం సంభవించింది. ఎస్. జానకి రామ్ ప్రసాద్ దంపతుల ఏకైక కుమారుడు మురళీ కృష్ణ గురువారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన వయసు 65 ఏళ్ళు. ఎస్ జానకి గురించి అందరికీ తెలుసు. ఆమె కుమారుడు గురించి పెద్దగా తెలియదు, ఆయన కూడా మంచి కళాకారుడు. అతను భరత నాట్యంలో శిక్షణ పొంది ఎంతో పేరు తెచ్చుకున్నారు.

తెలుగులో తొలి ఎంట్రీ :

ఇక నటుడిగా మురళీకృష్ణ తొలి చిత్రం తెలుగులోనే ఉంది. ఆ చిత్రమే దిగ్దర్శకుడు కె విశ్వనాధ్ రూపొందించిన శృతిలయలు. ఈ మూవీని 1987లో నిర్మించారు. ఈ సినిమాలో మురళీ క్రిష్ణ హీరో రాజశేఖర్ కి సోదరుడిగా కనిపిస్తారు. కేవలం తెలుగు మాత్రమే కాకుందా ఇతర భాషలలో కూడా మరి కొన్ని చిత్రాలలో కూడా మురళీ క్రిష్ణ నటించారు. అలాగే ఆడియో వ్యాపారాన్ని నిర్వహించారు.

పాటలకు దూరంగా :

ఇక ఎస్ జానకి విషయానికి వస్తే ఆమె భర్త మరణించి చాలా కాలం అయింది. ఆమె చెన్నైలో కుమారుడు దగ్గరే ఉంటున్నారు. ఆమె సినిమా పాటలకు రిటైర్మెంట్ ప్రకటించి రెండు దశాబ్దాల కాలం అవుతోంది. పూర్తిగా విశ్రాంతిని తీసుకుంటూ ఆమె కాలం గడుపుతున్నారు. ఈ నేపధ్యంలో ఏకైక కుమారుడి మరణం ఆమెకు తీరని విషాదంగా పేర్కొంటున్నారు.

ఆమె సందేశంతో :

మురళీకృష్ణ మరణం గురించి ప్రముఖ గాయని కే ఎస్ చిత్ర సామాజిక మాధ్యమం ద్వారా ప్రకటించారు. తన అన్న ఎస్ జానకి కుమారుడు అయిన మురళీ క్రిష్ణ ఇక లేరు అంటూ ఆమె ఈ విషాద వార్త లోకానికి తెలియచేశారు. దాంతో ఎస్ జానకి అభిమానులతో పాటు సినీ ప్రియులు అంతా ఆవేదనకు గురి అవుతున్నారు. 87 ఏళ్ళ వయసులో ఉన్న ఎస్ జానకికి ఇది తీరని గర్భ శోకంగా అంతా పేర్కొంటున్నారు.