ఆపరేషన్ జరుగుతున్నప్పుడు భూకంపం వస్తే... రష్యాలోని వీడియో వైరల్
ఈ సమయంలో కామ్చాట్కా ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో వైధ్యులు బిజీగా ఉన్నారు. వారు ఓ పేషెంట్ కు సర్జరీ చేస్తున్నారు. సరిగ్గా.. సర్జరీ జరుగుతున్న సమయంలోనే శక్తివంతమైన భూకంపం సంభవించింది.
By: Raja Ch | 30 July 2025 3:43 PM ISTరష్యా తీరంలో బుధవారం భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 8.8గా నమోదయ్యింది. ఈ భారీ భూకంపం రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పాన్ని అతలాకుతలం చేయడంతో పాటు.. దీని ప్రభావంతో జపాన్, అమెరికా ప్రాంతాల్లో సునామీ అలలు తీరాన్ని తాకాయి. వీటికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రధానంగా రష్యాలో అంత భారీ భూకంపం సంభవించడంతో.. ఆ ప్రాంతంలోని భవనాలు ఒక్కసారిగా ఊగిపోయాయి. దీంతో ప్రజలు హాహాకారాలు చేస్తూ రోడ్లపైకి పరుగులు పెట్టారు. ఆ సమయంలో ఓ హాస్పటల్ లోని ఆపరేషన్ థియేటర్ లో సర్జరీ జరుగుతుంది. ఆ సమయంలో ఆపరేషన్ థియేటర్ ఊగిపోయింది. అయినప్పటికీ శస్త్ర చికిత్స సక్సెస్ అయ్యింది. ఈ విషయం వైరల్ గా మారింది.
అవును... భారీ భూకంపం వచ్చి ఇళ్లల్లోని సామానులు ఊగిపోతున్నాయి, అలమార్లలో వస్తువులు కింద పడిపోతున్నాయి, రోడ్లపై కార్లు ఊగిపోతున్నాయి. ఈ సమయంలో కామ్చాట్కా ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో వైధ్యులు బిజీగా ఉన్నారు. వారు ఓ పేషెంట్ కు సర్జరీ చేస్తున్నారు. సరిగ్గా.. సర్జరీ జరుగుతున్న సమయంలోనే శక్తివంతమైన భూకంపం సంభవించింది.
ఆ ప్రకంపనల ధాటికి ఆ భవనం మొత్తం ఊగిపోయింది. ఈ సమయంలో.. వైద్యులు ఏ మాత్రం భయపడలేదు, ఆందోళన చెందలేదు! ప్రశాంతంగా ఉండి ఆ సర్జరీని పూర్తి చేశారు. ప్రధానంగా.. ఆ సర్జరీ జరుగుతున్న సమయంలో ఆపరేషన్ థియేటర్ లోని స్ట్రెచర్ ను ఊగకుండా సిబ్బంది గట్టిగా పట్టుకోగా.. వైద్యులు సర్జరీని కంటిన్యూ చేశారు.
ఈ క్రమంలో దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా వైద్యుల నిబద్ధతను, వారి ధైర్యాన్ని మెచ్చుకుంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన స్థానిక మీడియా... ఆ సర్జరీ విజయవంతంగా జరిగిందని, రోగి కోలుకుంటున్నారని రష్యన్ ఆరోగ్య శాఖ ప్రకటించినట్టు తెలిపింది.
