Begin typing your search above and press return to search.

అలా 90కి... ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి విలువ!

అవును... మంగళవారం డాలరుతో రూపాయి మారకం విలువ సుమారు 90 వద్ద ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో ఈ రోజు కరెన్సీ వరుసగా ఐదో షెషన్ లోనూ నష్టాల బాటలో ఉంది.

By:  Raja Ch   |   2 Dec 2025 10:28 PM IST
అలా 90కి... ఆల్  టైమ్ కనిష్టానికి రూపాయి విలువ!
X

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా సోమవారం నమోదైన 89.78కి మించి మంగళవారం అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ మరింత బలహీనపడింది. ఇందులో భాగంగా... డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ ఆల్ టైమ్ కనిస్టానికి 89.94కి పడిపోయింది! ఈ నేపథ్యంలో ఆర్ధిక నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.

అవును... మంగళవారం డాలరుతో రూపాయి మారకం విలువ సుమారు 90 వద్ద ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో ఈ రోజు కరెన్సీ వరుసగా ఐదో షెషన్ లోనూ నష్టాల బాటలో ఉంది. ఈ విషయం అస్థిర ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటున్న పెట్టుబడిదారులలో ఆందోళనలను తీవ్రతరం చేసింది. ఈ ప్రక్రియ ముఖ్యంగా విదేశీ వస్తువులపై ఆధారపడే రంగాలను దెబ్బతీస్తుందని అంటున్నారు!

ఈ సందర్భంగా స్పందించిన పూణేకు చెందిన ఆర్థిక నిపుణుడు కిరాంగ్ గాంధీ... వడ్డీ రేటు హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణ ధోరణిలో మార్పులు కూడా కరెన్సీ కదలికలో భాగమే అని అన్నారు. సాధారణంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో రూపాయి నిరోధకతను కలిగి ఉంటుందని తెలిపారు. అయితే... దేశంలోని అధిక వడ్డీ రేట్లు కరెన్సీని బలోపేతం చేయడానికి సహాయపడతాయని అన్నారు.

ఇదే సమయంలో.. ప్రపంచ ఈక్విటీలకు.. ముఖ్యంగా అమెరికా ఆధారిత నిధులు లేదా అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్లకు 10 నుంచి 20 శాతం పోర్ట్ ఫోలియోను కేటాయించాలని గాంధీ సూచించారు. ఎందుకంటే.. అవి డాలర్ బలపడటానికి వ్యతిరేకంగా సహజ హెడ్జ్ ను అందిస్తాయని తెలిపారు.

ఇదే క్రమంలో... రూపాయి విలువ పడిపోవడానికి ఎన్డీఎఫ్ కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతో పాటు.. ఫారెన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకుంటూ, రోజువారీగా డాలర్లను కొనుగొలు చేయడం మరో కారణమని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో రూపాయి విలువ 90 మార్కు దాటకుండా అడ్డుకునేందుకు ఆర్బీఐ డాలర్లను విక్రయించినట్లు తెలుస్తోంది.

ఇక మంగళవారం సెన్సెక్స్ లో క్లోజింగ్ బెల్ తర్వాత ఆసియన్ పెయింట్స్ అత్యధికంగా లాభపడింది. ఇందులో భాగంగా... 3.11% పెరిగింది. ఇదే సమయంలో... మారుతీ సుజుకీ (0.83%), భారతీ ఎయిర్ టెల్ (0.59%), బజాజ్ ఫైనాన్స్ (0.54%), హిందూస్థాన్ యూనిలీవర్ (0.50%) లాభపడగా... ఐసీఐసీఐ (1.24%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.25%), హెచ్.డీ.ఎఫ్.సీ (1.25%), యాక్సిస్ (1.29%), అదానీ పోర్ట్స్ (1.30%) పతనమయ్యాయి!