రుద్ర..మందాకినీ..కుంభ.. ఫ్రేమ్ అదిరింది!
కొన్ని కాంబినేషన్‌లు ఎప్పుడు ఎలా సెట్టవుతాయో..ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వెళతాయో ఎవరూ చెప్పలేరు.
By: Tupaki Entertainment Desk | 18 Nov 2025 11:07 AM ISTకొన్ని కాంబినేషన్‌లు ఎప్పుడు ఎలా సెట్టవుతాయో..ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వెళతాయో ఎవరూ చెప్పలేరు. దానికి కాలమే సమాధానం చెబుతుంది. కాలమే నిర్ణయిస్తుంది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం `వారణాసి`. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ గ్లోబల్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది.
జక్కన్నతో మహేష్ బాబు ప్రాజెక్ట్ ఓ అరుదైన ఫీట్ అనుకుంటే ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటించడం మరో రేర్ ఫీట్. దీంతో ఈ ప్రాజెక్ట్ టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా మారింది. సోషియో షాంటసీ సైన్స్ ఫిక్షన్ అంశాలతో సాగే యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ మూవీని రాజమౌళి తెరపైకి తీసుకొస్తున్నారు. రీసెంట్‌గా విడుదల చేసిన ఈ మూవీ గ్లింప్స్ ఈ విషయాన్ని స్పష్టం చేసి అంచనాల్ని తారా స్థాయికి చేర్చడమే కాకుండా సర్వత్రా సరికొత్త చర్చకు తెరలేపింది.
కాశీ క్షేత్రం నుంచి మొదలై త్రేతాయుగం నాటి రామ రావణ యుద్ధాన్ని కూడా ఇందులో చూపించబోతుండటంతో రాజమౌళి ప్లానింగ్‌కి అందరి మైండ్ బ్లాంక్ అయింది. ఒక్క సినిమాలో ఇన్ని అద్భుతాలని జక్కన్న తెరపై ఆవిష్కరించబోతున్నాడని అంతా సంభ్రమాశ్చ్యాలకు లోనవుతున్నారు. గ్లింప్స్‌పై ఇప్పటికే నెట్టింట చర్చ తారా స్థాయికి చేరింది. అవతార్‌ని ఢీ కొట్టాలనే జక్కన్న ఎత్తుగడకు ట్రేడ్ పండితులే ఆశ్చర్చపోతున్నారు.2027 వేసవిలో వరల్డ్ వైడ్‌గా విడుదల కానున్న ఈ సినిమా ప్రపంచ సినీ జగత్తులో సరికొత్త హిస్టరీని లిఖించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఇటీవల `వారణాసి` గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌లో గ్లింప్స్‌ని, టైటిట్‌ని భారీ స్థాయిలో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదే వేదికపై మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంట్రీ ఇచ్చి ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇందులో మహేష్ రుద్రగా నటిస్తుండగా, ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పవర్ ఫుల్ విలన్‌గా కనిపించబోతున్నారు. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కి ముందు మహేష్, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిస ప్రియాంక చోప్రా సెల్ఫీ తీసుకున్నారు.
డిఫరెంట్ స్టైల్ కాస్ట్యూమ్స్‌లో ఈ ముగ్గురు స్టైలిష్‌గా దిగిన సెల్ఫీ ప్రస్తుతం నెట్టంట వైరల్‌గా మారింది. రుద్ర..మందాకినీ..కుంభ.. ఒకే ఫ్రేమ్‌లో ఉండటంతో ఫ్యాన్స్ `ఫ్రేమ్ అదిరింది!` అంటూ కామెంట్‌లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. అరుదైన కలయికలో తెరకెక్కుతున్న `వారణాసి` ఇండియన్ సినీ హిస్టరీతో పాటు వరల్డ్ సినిమా హిస్టరీని తిరిగి రాస్తుందనే చర్చ సర్వత్రా జరుగుతోంది.ఇది ఎంత వరకు నిజమౌతుందన్నది తెలియాలంటే 2027 సమ్మర్ వరకు వేచి చూడాల్సిందే.
