Begin typing your search above and press return to search.

మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ఎస్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ ఎస్ ఎస్ బీజేపీకి మాతృసంస్థ అన్నది తెలిసిందే. ఆర్ఎస్ఎస్ ఇటీవల కాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది

By:  Satya P   |   10 Aug 2025 10:56 PM IST
మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ఎస్
X

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ ఎస్ ఎస్ బీజేపీకి మాతృసంస్థ అన్నది తెలిసిందే. ఆర్ఎస్ఎస్ ఇటీవల కాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎలాంటి తటపటాయింపు లేకుండా ఆర్ఎస్ఎస్ తాను అనుకున్నది కుండబద్ధలు కొడుతూ వస్తోంది. అది బీజేపీకి ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. అయినా ఆర్ఎస్ఎస్ తన వైఖరితోనే ముందుకు అలా సాగుతోంది.

ఆ రెండు రంగాల మీద :

దేశంలో కీలకమైన రెండు రంగాలు వ్యాపారాత్మకం అయిపోయాయి అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్య వైధ్యం సామాన్యుడికి దూరం అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ రెండు రంగాలు సామాన్యుడికి అత్యంత అవసరమని ఆయన అన్నారు. అయితే అవి ఇపుడు అందనంత దూరంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.

సేవలుగా ఉంటూనే అలా :

భారత దేశంలో ఈ వ్యవస్థలు గతంలో సేవా రంగంగా ఉండేవని ఆయన గుర్తు చేసారు. అయితే తరువాత కాలంలో మాత్రం వ్యాపారమే ఇందులో కూడా ప్రవేశించింది అని అన్నారు. ఆరోగ్య సమ్రక్షణ, అందరికీ విద్య అన్నది సామాన్యుడి నుంచి ఎందుకు దూరం అయ్యాయో తనకు అసలు అర్ధం కావడం లేదని ఆయన కీలక వ్యాఖ్యలే చేశారు. ఈ వైఖరి ధోరణి మారాలని ఆయన అభిప్రాయపడ్డారు.

కెంద్ర ప్రభుత్వం చూస్తే అలా :

బీజేపీ నాయకత్వంలో నడిచే కేంద్ర ప్రభుత్వం అయితే విద్య వైద్య రంగాలు రెండూ సామాన్యులకు చేరువగా ఉన్నాయని చెబుతూ వస్తోంది. అందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చామని కూడా లెక్క చూపుతున్నారు. అలాగే జాతీయ విద్యా విధానం అని అనేక సంస్కరణలు తెచ్చామని చెబుతున్నారు. సామాన్యుడే తమ అజెండా అని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. మరి ఈ రెండు రంగాలే పేదలకు దూరం అని ఆర్ఎస్ఎస్ అంటోంది.

పరోక్ష విమర్శలేనా :

కేంద్ర ప్రభుత్వం మీద ఆర్ ఎస్ ఎస్ చేసినవి పరోక్ష విమర్శలుగా చూడాలా అని చర్చ అయితే వస్తోంది. ఎందుకంటే దేశంలో కీలక రంగాలు రెండూ పేదలకు అందడం లేదు అన్నది చాలా తీవ్రమైన ఆరోపణగానే చూడాలని అంటున్నారు. జనరలైజ్ చేసి చూడాల్సిన అవసరం ఉన్నా కూడా అదే సమయంలో అధికారంలో ఎవరు ఉన్నారు అన్న చర్చ వస్తుందని అంటున్నారు ఇక చూస్తే గతంలో కూడా ఏడున్నర పదుల వయసు దాటిన వారు తమ పదవులకు రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆర్ ఎస్ ఎస్ కీలక సూచనలు చేసింది. ఇది బీజేపీని ఇబ్బందులు పెట్టింది. ఇపుడు చూస్తే ఈ వ్యాఖ్యల మీద కూడా చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. చూడాలి మరి ఆర్ ఎస్ ఎస్ అధినాయకత్వం నుంచి మరెన్ని సంచలన వ్యాఖ్యలు వస్తాయో ఏమిటో.