Begin typing your search above and press return to search.

ఆర్ఎస్ఎస్...జెన్ జీ ఫోకస్ !

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కి గత ఏడాదే వందేళ్ళు నిండాయి. ఇన్నేళ్ళ పాటు ఒక సామాజిక సంస్థ ఈ విధంగా కొనసాగడం దేశ చరిత్రలో ఎక్కడా లేదనే చెబుతారు.

By:  Satya P   |   17 Aug 2026 9:33 AM IST
ఆర్ఎస్ఎస్...జెన్ జీ ఫోకస్ !
X

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కి గత ఏడాదే వందేళ్ళు నిండాయి. ఇన్నేళ్ళ పాటు ఒక సామాజిక సంస్థ ఈ విధంగా కొనసాగడం దేశ చరిత్రలో ఎక్కడా లేదనే చెబుతారు. మరి అది ఎలా సాధ్యమైంది అంటే ఆర్ఎస్ఎస్ కృషి పట్టుదలతో పాటు మారుతున్న కాలానికి తగినట్లుగా తనను తాను మార్చుకోవడం నిరంతరం జనం అభిప్రాయాలను తెలుసుకోవడం వారితో మమేకం అయి వారికి సరైనా దిశా నిర్దేశం చేయడం అన్నవే ఆర్ఎస్ఎస్ సుదీర్ఘ పయనానికి బాటలు వేశాయి. అంతే కాదు ఆర్ఎస్ఎస్ తన మౌలిక సిద్ధాంతాలను ఎక్కడా ఎపుడూ కోల్పోలేదు, వాటిని పరిరక్షించుకుంటూనే కాలంతో పాటుగా ముందుకు సాగుతోంది. ఇపుడు ఆర్ఎస్ఎస్ జెన్ జీ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. సమాజంలో అతి పెద్ద సెక్షన్ గా ఉన్న జెన్ జీ భావాలని గౌరవించాల్సిందే అని ఇటీవలనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారు దేశంలో భాగమని భవిష్యత్తు అని కూడా ఆయన చెబుతూ విద్యార్థుల ఉద్యమలను ఆందోళనలు సమర్ధించారు.

విశాఖలో చింతక్ భేటీ :

ఇదిలా ఉంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ విశాఖకు ఈ నెల 17న వస్తున్నారు. ఆయన విశాఖ పర్యటన ఇది మూడోసారి అని చెబుతున్నారు. 2010లో ఆయన చీఫ్ అయిన తరువాత 2012లో తొలిసారి విశాఖ వచ్చారు. మళ్ళీ 2016లో రెండోసారి వచ్చారు. ఇపుడు దాదాపుగా పదేళ్ళ తరువాత విశాఖ వస్తున్న మోహన్ భగవత్ పర్యటన పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ దేశంలోని పలు మహా నగరాలలో పర్యటనలు చేస్తూ ఉంటారని ఈసారి దక్షిణాదిన ఏపీని ఎంచుకున్నారని ఆర్ఎస్ఎస్ వర్గాలు తెలియచేస్తున్నాయి. ఇక విశాఖలో ఆయన వారం రోజుల పాటు ఉంటారని తెలుస్తోంది. ఈ సందర్భంగా చింతక్ భేటీని నిర్వహిస్తారు అని అంటున్నారు.

జెన్ జీ యువత గురించే :

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటన చూస్తే ఆయన ఆగస్టు 17న విశాఖపట్నం చేరుకుంటారు అని చెబుతున్నారు. ఆయన విశాఖ జిల్లాలోని ఆనందపురం మండలంలోని గుడిలోవలో ఆగస్టు 19 నుండి 21 వరకు జరిగే అఖిల భారతీయ సమన్వయ సమావేశంలో పాల్గొంటారు అని చెబుతున్నారు. ఆయనతో పాటుగా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలేతో పాటు 32 అనుబంధ సంస్థల జాతీయ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఆర్ఎస్ఎస్ సమావేశాలకు హాజరవుతారని చెబుతునారు. ఇక ఈ భేటీలో ఆర్ఎస్ఎస్ చర్చించే ప్రధాన అంశాలలో అతి ముఖ్యమైనదిగా జెన్ జీ యువత అంశం ఉంది. జెన్ జీ యువత ఆలోచనలు తెలుసుకోవడం అదే విధంగా వారిలో సరైన అవగాహన కల్పించడం వంటి వాటి మీద ఆర్ఎస్ఎస్ దృష్టి సారించనుంది అని అంటున్నారు.

వారే కీలకంగా :

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. 2029 లో కూడా బీజేపీ మరోసారి రావాలని ఆర్ఎస్ఎస్ గట్టిగా కోరుకుంటోంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ రాజకీయ అభివృద్ధిని కోరుకుంటుంది. అదే సమయంలో బీజేపీకి ఇపుడు జెన్ జీ రూపంలో కొత్త కష్టాలు వచ్చాయి. సాధారణంగా ఆర్ఎస్ఎస్ నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ జనంతో ఉంటూ వారి మనోభావాలని తెలుసుకుంటూ దానికి అనుగుణంగా బీజేపీని అప్రమత్తం చేస్తూ ఉంటుంది అని అంటున్నారు. ఇపుడు జెన్ జీ అన్నది పెద్ద సవాల్ గానే బీజేపీకి ఉంది దాంతో ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగింది అని అంటున్నారు. ఈ క్రమంలో విశాఖ వేదికగా జరిగే సమావేశాలలో జెన్ జీ యువతనే ముందు పెట్టి ఆర్ఎస్ఎస్ సాగుతుందని అంటున్నారు.

చైతన్యపరచాలి :

జెన్ జీ యువతలో సరైన అవగాహన దేశం పట్ల బాధ్యత నిర్మాణాత్మకంగా వారు వ్యవహరించాల్సిన తీరు గురించి ఆర్ఎస్ఎస్ అవగాహన కల్పిస్తుంది అని అంటున్నారు. అలాగే యువత మద్యం, మత్తు పదార్థాల జోలికి పోకుండా దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన బాటలో నడవాలని ఆర్ఎస్ఎస్ ఉద్భోదిస్తోంది. ఇక ఆర్ఎస్ఎస్ భేటీలో దేశంలో జనాభా అసమతుల్యత మీద కూడా ఫోకస్ పెట్టనుంది. భారతీయత భావనతో అభివృద్ధి చెందడం, వివిధ సంఘాల మధ్య పరస్పర సమన్వయం, ప్రజా సంక్షేమ విధానాలు వాటి అమలు వంటివాటి మీద కూడా దృష్టి పెట్టి చర్చిస్తుందని అంటున్నారు.