Begin typing your search above and press return to search.

అహంకారం కరిగిన చోట బలంగా భారత్ ఉనికి

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్ వేదికగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

By:  Satya P   |   30 Nov 2025 1:00 AM IST
అహంకారం కరిగిన చోట బలంగా భారత్ ఉనికి
X

ఈ మాటలు కవిత కాదు, ఒక కీలక వ్యాఖ్య. పైకి సింపుల్ గా కనిపిస్తున్నా ఈ వ్యాఖ్య వెనక లోతైన భావన ఉంది. భారత దేశం గర్వర్మ్ గౌరవం, కల్చర్ దేశం ఆత్మ విశ్వాసం, పట్టుదల అన్నీ ఇందులోనే ఇమిడి ఉన్నాయి. భారత్ ని దాని గొప్పతనాన్ని ఒకనాడు అంగీకరించలేని స్థితిలో ఉన్న కొన్ని దేశాలు కానీ ప్రపంచలోని కొంత భాగానికి కానీ భారత్ ఉనికి ఎపుడు కనబడిందో తెలియచెప్పే ప్రయత్నమే ఈ వ్యాఖ్య. ఇంతటి పవర్ ఫుల్ వ్యాఖ్యను చేసిన వారు ఎవరై ఉంటారు అంటే సందేహమే లేదు, దేశమే ఫస్ట్ అని సదా నినదించే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఆర్ఎస్ఎస్ అన్న మాట. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్ వేదికగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

భారత్ బలంగా :

మోహన్ భగవత్ మాటలలో చెప్పాలీ అంటే భారత్ ఎపుడూ బలంగానే ఉంది. తనదైన ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగిపోతోంది. అయితే భారత్ గొప్పతనాన్ని గుర్తించడానికి ఏ మాత్రం అంగీకరించని వారి కళ్ళకు అహంకారం పొరలు కమ్మేశాయి అన్నది ఈ వ్యాఖ్యల వెనక ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఇపుడు ఆ అహంకారం కరిగిన వేళ భారత్ ఉనికిలోకి వచ్చింది అని ఆయన చెప్పుకొచ్చారు. మరో వైపు చూస్తే భారత్ ఈనాడు ఆర్థికంగా ముందుకు సాగుతోంది. అలాగే అగ్ర రాజ్యాలు అన్న వాటిని సైతం పక్కన పెట్టి భారత్ తన సొంత వ్యక్తిత్వంతో కొనసాగుతోంది. భారత్ చొరవ కానీ భారత్ మాట కానీ భారత్ పాత్ర కానీ లేకుండా ప్రపంచంలో ఏమీ జరగని పరిస్థితి ఉంది అని గుర్తు చేస్తున్నారు.

జాతీయ వాదం కంటే గొప్పది :

భారతదేశంలో జాతీయ వాదం ఒక సమస్య ఎపుడూ కానే కాదని మోహన్ భగవత్ అన్నారు. అదే సందర్భంలో జాతీయ భావనను దేశం పూర్వం నుంచే అనుసరిస్తూ వస్తోంది ఇది ఇతర దేశాలకు ఎంతో విభిన్నమైన భావన అని ఆయన అన్నారు. అంతే కాదు రాజకీయంగా భౌగోళికంగా దానిని ఏ మాత్రం దేశ ప్రజలు ఎప్పుడూ చూడలేదని అంతా ఒక్కటి అన్నది ఒక అలౌకికమైన భావనగా ఆయన అభివర్ణించారు.

వివాదాలకు దూరం :

అంతే కాదు భారత దేశం ఎపుడూ వివాదాలకు విభేదాలకు దూరంగా ఉంటుందని ఆయన చెప్పారు. అందరూ కలసి ఉండాలన్నది భారత్ లో అంతర్లీనమైన భావనగా ఆయన చెప్పారు. అంతా కలసి ముందుకు సాగాలి అన్నదే భారత్ స్వభావం అదే విధానం, అదే సంస్కృతిగా ఆయన వివరించారు. సాంస్కృతిక సహజీవన సిద్ధాంతం భారత్ పునాదుల నుంచి ఉందని ఆయన అన్నారు. భారత దేశం ఎవరి పట్ల ఆధిపత్యం చూపదని, సమిష్టి స్పూర్తిని గౌరవిస్తుందని ఆయన చెప్పారు. అంతే కాదు దేశమంతా సమిష్టిగా సామరస్యంగా ప్రగతి దారులు వెతుకుతుందని దాని వెనక బలమైన తాత్విక పునాది ఉండడమే కారణం అని ఆయన గుర్తు చేశారు ఇక ఆర్ఎస్ఎస్ కూడా ఎవరినీ దూరం చేసుకోదని అందరికీ సమదృష్టితో చూస్తుందని వ్యక్తుల సమూహానే గౌరవిస్తుందని సంకుచిత భావజాలాన్ని ఎపుడూ ఆర్ఎస్ఎస్ నమ్మినది లేదని మోహన్ భగవత్ స్పష్టం చేశారు.