హిందువులు ముగ్గురు పిల్లలను కనాలన్న ఆర్ఎస్ఎస్
ఎక్కువ మంది పిల్లలను కనాలన్న నినాదం ఈ మధ్య బాగా వినిపిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా అదే మాట అంటున్నారు.
By: Satya P | 28 Aug 2025 11:03 PM ISTఎక్కువ మంది పిల్లలను కనాలన్న నినాదం ఈ మధ్య బాగా వినిపిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా అదే మాట అంటున్నారు. ఇక దేశంలో కూడా ఈ నినాదాన్ని ఆర్ఎస్ఎస్ తన భుజాన వేసుకుంది. హిందువులు ఎక్కువ మంది పిల్లలను కనాలని ఆర్ ఎస్ ఎస్ పిలుపు ఇచ్చింది. జనాభా నియంత్రణ మీద దేశంలో చట్టాలు ఏవీ లేవని అందువల ఎక్కువమందిని కంటే హిందూ సమాజం వర్ధిల్లుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆయన ఢిల్లీలో జరిగిన వంద వర్ష్ కీ సంఘ్ యాత్ర పేరుతో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇంగ్లీష్ భాష మీద :
ఇక ఇంగ్లీష్ భాష మీద కూడా ఆయన తన అభిప్రాయం చెప్పారు. ఇంగ్లీష్ ని ఎవరు నేర్చుకున్నా తప్పు లేదు, అభ్యంతరం ఏమీ లేదని అన్నారు. భాషాపరమైన భేదాలు ఏవీ ఉండకూడదని అన్నారు. అదే విధంగా సంస్కృత భాష కూడా నేర్చుకుంటే బాగుంటుందని ఆయన సూచించారు.
మోడీ మీద వ్యాఖ్యలు కాదు :
ఇక తాను గతంలో 75 ఏళ్ళకే పదవీ విరమణ చేయాలని చేసిన ఒక వ్యాఖ్యను తప్పుగా అర్ధం చేసుకున్నారు అని ఆయన అన్నారు. అలా తాను కానీ సంఘ్ పరివార్ కానీ ఎపుడూ చెప్పలేదని మోహన్ భగవత్ క్లారిటీ ఇచ్చారు పైగా అవి మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా చిత్రీకరినారని ఆయన అంటూ అది తప్పు అన్నారు. తాను కూడా 80 ఏళ్ళ వయసు వచ్చినా పనిచేయమంటే సిద్ధమే అని ఆయన అన్నారు. వయసు అన్న నిబంధన ఏదీ సంఘ్ పెట్టదని ఆయన స్పష్టం చేశారు.
అసలు విషయం అదే :
ఇక తాను గతంలో జరిగిన ఒక సంఘటన చెప్పాను అని ఆయన అన్నారు దానిని మరోసారి ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో తాను పింగళి జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేసాను అన్నారు. అపుడు పింగళికి సంబంధించిన కొన్ని సరదా సంఘటనలను పంచుకున్నానని గుర్తుచేశారు. పింగళికి 75 ఏళ్లు వచ్చినప్పుడు మరో సీనియర్ నేత హెచ్.వి. శేషాద్రి ఆయనకు శాలువా కప్పి ఇక బాధ్యతల నుంచి తప్పుకోవాలని సున్నితంగా సూచించిన సంఘటనను మాత్రమే అప్పట్లో తాను సరదాగా చెప్పానని అంతే కానీ దానిని ఒక నిబంధనగా పరిగణించరాదని మోహన్ భగవత్ అన్నారు.
బీజేపీని సంఘ్ నియింత్రించదు :
బీజేపీని ఎపుడూ సంఘ్ నియంత్రించదని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. బీజేపీకి సలహాలు మాత్రమే ఇస్తుందని దానిని పాటించడం పాటించకపోవడం వారి ఇష్టమని అన్నారు. అలాగే సంఘ్ తన కార్యక్రమాలను చేసుకుంటూ పోతుందని దేనినీ ఆలస్యం చేయదని అన్నారు. సంఘ్ లో ఒక విధానం ఉంటుందని ఆయా అన్నారు మేమంతా సంఘానికి స్వయం సేవకులుగా పనిచేస్తామని ఆయన చెప్పుకున్నారు. మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా సంఘ్ ఏ పని చెబితే అది చేసి తీరాల్సిందే అని ఆయన అన్నారు ఇక తాను ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉన్నాను అని తన పదవి కోసం కూడా పది మంది సిద్ధంగా ఉన్నారు అని ఆయన చెప్పారు అయితే సంఘ్ ఎంతకాలం పనిచేయమంటే తాను అంత కాలం పనిచేస్తాను అని ఆయన చెప్పారు. ఇక బీజేపీలో ఎవరు ఎంత కాలం పదవిలో ఉండాలన్నది ఆ పార్టీ ఇష్టమే తప్ప తమ జోక్యం ఉండదని ఆయన క్లారిటీ ఇచ్చేశారు.
