Begin typing your search above and press return to search.

కొంద‌రిలో అహంకారం పెరుగుతోంది: మోహ‌న్ భ‌గ‌వ‌త్‌

కొంద‌రిలో అహంకారం పెరుగుతోంద‌ని.. ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ వ్యాఖ్యానించారు. అయితే.. ఆయ‌న ఎవ‌రిని ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేశార‌న్న‌ది తెలియ‌దు.

By:  Garuda Media   |   26 Dec 2025 9:00 PM IST
కొంద‌రిలో అహంకారం పెరుగుతోంది: మోహ‌న్ భ‌గ‌వ‌త్‌
X

కొంద‌రిలో అహంకారం పెరుగుతోంద‌ని.. ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ వ్యాఖ్యానించారు. అయితే.. ఆయ‌న ఎవ‌రిని ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేశార‌న్న‌ది తెలియ‌దు. కానీ... ఇటీవ‌ల కాలంలో కేంద్ర ప్ర‌భు త్వంలోని కొంద‌రు `పెద్ద‌ల‌` వ్య‌వ‌హార శైలిపై మోహ‌న్ భ‌గ‌వ‌త్ అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మం లో తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. తాజాగా తిరుప‌తిలో నిర్వ‌హించిన `భార‌తీయ విజ్ఞాన స‌మ్మేళ‌నం`లో పాల్గొన్న భ‌గ‌వ‌త్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

మ‌నిషికి క్ష‌మాగుణం ఉండాల‌న్నారు. అది లేక‌పోతే.. మ‌నిషేకాడ‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌పంచం నుంచి భార‌త్ చాలా తీసుకుంటోంద‌ని వ్యాఖ్యానించిన ఆయ‌న‌.. ఆ ప్ర‌పంచానికి కూడా భార‌త్ తిరిగి ఇవ్వవ‌ల సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇక‌, మాన‌సిక సంతృప్తి అనేది చాలా అవ‌స‌ర‌మ‌ని.. ప‌రోక్షంగా కీల‌క ప్ర‌భుత్వ పెద్ద గురించి ఆయ‌న వ్యాఖ్యానించారు. ``ప‌దువులు.. అధికారాలు శాస్వ‌తం అనుకోవ‌ద్దు. మ‌న‌సుకు సంతృప్తి ముఖ్యం. అదే శాస్వ‌తం`` అని వ్యాఖ్యానించారు.

వ‌చ్చే ఏడాదితో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి 75 ఏళ్లు నిండ‌నున్న నేప‌థ్యంలో ఆయ‌న‌ను ప్ర‌ధాన మంత్రి ప‌ద వి నుంచి త‌ప్పించే అవ‌కాశం ఉంద‌ని ఒక‌వైపు.. అలాంటిదేమీ లేద‌ని.. బీజేపీ వైపు నుంచి చ‌ర్చ జ‌రుగు తున్న నేప‌థ్యంలో మోహ‌న్‌భ‌గ‌వ‌త్ వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.అ యితే.. ఆయన నేరు గా ఎవ‌రి పేరునూ ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అభివృద్ధి చెందిన దేశాల్లో అభివృద్ధితోపాటు.. వినాశ నం కూడా ఎక్కువ‌గానే ఉంద‌ని మోహ‌న్ భ‌బగ‌వ‌త్ అన్నారు. శాస్త్ర విజ్ఞానంతోనే సదుపాయాలు కలుగు తాయన్నారు.

అయితే.. మోహ‌న్ భ‌గ‌వ‌త్‌.. వ్యాఖ్య‌లు గ‌తానికి భిన్నంగా ఉండ‌డంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. సాధార‌ణంగా 75 ఏళ్ల కాల‌ప‌రిమితికి మించి.. ప‌దువ‌ల్లో ఉండేందుకు ఆర్ ఎస్ ఎస్ విధానాలు ఒప్పుకోవ‌డం లేదు. కానీ, ఈ ద‌ఫా మోహ‌న్ భ‌గ‌వ‌తే దీనిని అధిగ‌మించారు. ఆయ‌న వ‌య‌సు 75 ఏళ్త త‌ర్వాత కూడా చీఫ్‌గానే కొన‌సాగుతున్నారు. కానీ.. ప్ర‌ధాని ప‌ద‌వి విష‌యంలో మాత్రం భిన్నంగా వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.