ఆర్ఎస్ఎస్ నోట జెన్ జెడ్ మాట
ఇదిలా ఉండగా ఆర్ఎస్ఎస్ వందేళ్ళ ప్రస్థానం రికార్డుగా మారింది. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను ప్రస్తుతం దేశంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. మరో వందేళ్ళకు తగిన విధంగా తనదైన ప్రణాళికను ఆర్ఎస్ఎస్ రచిస్తోంది.
By: Satya P | 3 Oct 2025 9:24 AM ISTరాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్ల నాటిది. అయితే కాలంతో పాటు తాను మారుతూ దేశమంతా విస్తరిస్తూ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను ఎదురీదుతూ ముందుకు సాగుతూ వస్తోంది. ఇక ఆర్ఎస్ఎస్ తన సుదీర్ఘమైన ప్రస్థానంతో తాను అనుకున్న లక్ష్యాలను సాధిచుకుంటూ వస్తోంది. ఒకనాడు మొత్తంగా కాంగ్రెస్ మాత్రమే కమ్ముకుని దశాబ్దాల పాటు దేశాన్ని ఏలింది. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో హిందూత్వ నినాదాలతో ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగం గా ఉన్న జన సంఘ్ కానీ తదనంతర కాలంలో బీజేపీ కానీ ఈ దేశాన్ని ఏలుతాయని ఎవరూ అనుకోలేదు. కానీ చూస్తూండగానే బీజేపీ ఈ దేశంలో బాగా పటిష్టం అయింది. తన బలం చాటుకుంది. మూడు సార్లు ప్రధానిగా ప్రమాణం చేసిన అటల్ బిహారీ వాజ్ పేయ్ మొత్తంగా ఆరేళ్ళ పాటు పాలిస్తే ఆయన తరువాత 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ పదకొండేళ్ళుగా దేశాన్ని పాలిస్తున్నారు. ఇవన్నీ బీజేపీ వెనక ఉన్న ఆర్ఎస్ఎస్ విజయాలుగానే అంతా చూస్తున్నారు.
రికార్డుగా మారిన పయనం :
ఇదిలా ఉండగా ఆర్ఎస్ఎస్ వందేళ్ళ ప్రస్థానం రికార్డుగా మారింది. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను ప్రస్తుతం దేశంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. మరో వందేళ్ళకు తగిన విధంగా తనదైన ప్రణాళికను ఆర్ఎస్ఎస్ రచిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న పరిస్థితులు పరిణామాలు ప్రపంచంలో చోటు చేసుకుంటున్న వాతావరణాన్ని అన్నింటినీ బేరీజు వేసుకుని మరీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల వేదిక నుంచే దేశానికి పాలకులకు ముఖ్యమైన సందేశం ఇచ్చారు.
జెన్ జెడ్ హెచ్చరిక అంటూ :
ప్రభుత్వాలకు పాలకులకు జెన్ జెడ్ ఉద్యమాలు ఒక హెచ్చరిక లాంటివి అని ఆయన అన్నారు. ఇటీవల నేపాల్ లో చోటు చేసుకున్న పరిణామాలను ఉటంకిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తే ప్రజలలో ఆగ్రహం పెరుగుతుంది అని ఆయన విశ్లేషించారు. మరి ఆయన ఈ వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారో కానీ అవి ఇపుడు సంచలనంగా మారాయి. అయితే ఆయన పాలకులకు ప్రభుత్వాలకు ఒక సూచనగా మాత్రమే చెప్పి ఉంటారని అంటున్నారు.
భారత్ మిత్ర దేశాలు అవే :
ఇదిలా ఉంటే భారత్ కి మిత్ర దేశాలు ఏవో ఆపరేషన్ సింధూర్ తరువాత మాత్రమే తెలిసింది అని మోహన్ భగవత్ అన్నారు. ఉగ్రవాదులు మతం ఏమిటి అని అడిగి మరీ ఏకంగా 26 మందిని పొట్టన పెట్టుకున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనతో దేశం మొత్తం రగిలిపోయింది అని ఆయన గుర్తు చేశారు. ఇక భారత బలగాలు ఉగ్రదాడికి ధీటైన బదులు ఇచ్చాయని ఆయన చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదులకు గుణపాఠం నేర్పామని అన్నారు. అంతే కాదు ఈ ఘటన తరువాత ప్రపంచంలో భారత్ కి మిత్ర దేశాలు నిజమైనవి ఏమిటో తెలిసింది అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విధంగా ఆయన చెప్పడం ద్వారా అమెరికా భారత్ కి మిత్రుడు కారు అని అభిప్రాయపడ్డారా అన్న చర్చ కూడా సాగుతోంది.
