Begin typing your search above and press return to search.

రోయి సూసైడ్ వెనుక కారణం.. ఇదేనా..?

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఎన్నో జీవితాలను నాశనం చేసింది. సాధారణంగా యుద్ధాల్లో సైనికులు మరణిస్తే వీరమరణం అంటారు.

By:  Tupaki Political Desk   |   13 Oct 2025 1:48 PM IST
రోయి సూసైడ్ వెనుక కారణం.. ఇదేనా..?
X

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఎన్నో జీవితాలను నాశనం చేసింది. సాధారణంగా యుద్ధాల్లో సైనికులు మరణిస్తే వీరమరణం అంటారు. కానీ ఆయా దేశాలు చేసే అధర్మయుద్ధం ద్వారా సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతే వారి మరణాన్ని ఏమంటారు. ఏ యుద్ధమైనా సాధారణ పౌరుల ప్రాణం తీయద్దని అంతర్జాతీయ యుద్ధ ప్రమాణాలు వెల్లడిస్తాయి. కానీ కొన్ని దేశాలు పౌరులనే టార్గెట్ చేస్తాయి. రోగ్ నేషన్ పాకిస్తాన్ లాగా.. ఇందులో హమాస్ తక్కువేమీ కాదు.. గాజా కేంద్రంగా కొనసాగిన హమాస్ ఎక్కువ మొత్తంలో ఇజ్రాయెల్ పౌరులను పొట్టన పెట్టుకుంది. అందులో ఒక వ్యక్తి గాధ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య జరిగిన ఘర్షణలు అనేక ప్రాణాలను బలితీసుకున్నాయి. అందులో రోయి షలేవ్‌ (30) కథ. రెండేళ్ల క్రితం (అక్టోబర్ 7, 2023) హమాస్‌ దాడిలో రోయి కళ్ల ముందే తన ప్రియురాలు, స్నేహితుడు హత్యకు గురయ్యారు. ఆ క్షణం తర్వాత ఆయన జీవితం చాలా కఠినంగా మారింది. ఇజ్రాయెల్‌ సమాజంలో ఆయన పేరును మళ్లీ వినిపించింది.

రెండు దేశాలు శాంతికి అంగీకరించినా.. మనసులో..

‘నేను భౌతికంగా బతికే ఉన్నా, లోపల చనిపోయా,’ రోయి షలేవ్‌ సోషల్‌ మీడియాలో రాసిన మాటలు ఇప్పుడు ప్రతి యుద్ధం తర్వాతి మౌనాన్ని ప్రతిబింభిస్తుంది. రెండేళ్లుగా ఆయన మానసిక నరకాన్ని అనుభవించాడు. వారిని రక్షించుకోలేదన్న అసహనం, యుద్ధ సన్నివేశాలు, తలచుకొని జ్ఞాపకాలు ఆయనను బలహీనుడిని చేశాయి. ఇలాంటి మానసిక పరిస్థితిని వైద్యులు ‘పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD)’ అంటారు.

హమాస్ దాడి మానవ సంబంధాలకు గాయం..

2023లో హమాస్‌ దాడులు ఇజ్రాయెల్‌ను చిద్రం చేశాయి. ఆ దాడుల్లో వందలాది మంది యువకులు, స్త్రీలు ప్రాణాలు కోల్పోయారు. ఆ క్షణాలు రోయి వంటి యువతరానికి జీవితాంతం మానసిక గాయాలు మిగిల్చాయి. తన ప్రియురాలి, స్నేహితుడి మరణం తనకు ఎప్పుటికీ గుర్తే. తాను కేవలం భౌతికంగానే ఉన్నానని, మనసు ఎప్పుడో మరణించిందని ఆయన పోస్ట్ చేసి తీరు ప్రతి ఒక్కరినీ కలిచి వేసింది.

మనసులో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్స్..

ఇజ్రాయెల్‌లో ఇప్పటికే వందలాది మంది యుద్ధవీరులు PTSD బాధకు చికిత్స అందిస్తుంది. రోయి లాంటి వారిలో చాలామంది మానసిక కౌన్సెలింగ్‌ పొందలేకపోతున్నారు. సామాజిక మద్దతు లేకుండా, ఆ బాధ వారిని అంతరంగంగా కాల్చేస్తోంది. చివరికి అదే మానసిక అగ్నిలో ఆయన తన జీవితాన్ని ముగించాడు. టెల్ అవీవ్‌ నగరంలో కాలిన కారులో రోయి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు.

యుద్ధం గెలిచినా.. ఓడుతున్న యువత.. కారణం..

ఒక దేశం యుద్ధం గెలిచిన తర్వాత కూడా.. ఆ దేశపు యువత మనసు ఓడిపోతే, ఆ గెలుపు అర్థం లేదు. రోయి షలేవ్‌ జీవితం దానికి ప్రత్యక్ష ఉదాహరణ. యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే జరగదు. అది మనసుల్లోనూ, జ్ఞాపకాలలోనూ, కలల్లోనూ సాగుతుంది. భద్రతా వ్యూహాలు, దాడి ప్రణాళికలు, రక్షణ ఒప్పందాలు అన్నీ మనిషి మనసును బలపరచలేవు.

యుద్ధం అనే పదం వినగానే మనకు గన్‌శబ్దం, ట్యాంకులు, పేలుళ్లు గుర్తుకొస్తాయి. కానీ నిజమైన యుద్ధం మనసులో సాగుతుంది. ఆ గాయాలకు సరిహద్దులు ఉండవు. రోయి షలేవ్‌ కథ దీనికి ఒక హెచ్చరిక శత్రువును జయించడం గొప్పది. కానీ తన మనసులోని బాధను జయించడం అంతకంటే గొప్పది.