Begin typing your search above and press return to search.

రయ్ రయ్ మని రాయల్ ఎన్ ఫీల్డ్...ఏపీకి గోల్డ్!

అందులో లేటెస్ట్ గా చూస్తే రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ భారీ మొత్తంలో పెట్టుబడులు ఏపీలో పెట్టేందుకు రెడీ అయింది. తిరుపతిలో రాయల్ ఫీల్డ్ సంస్థ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

By:  Satya P   |   6 May 2026 11:44 PM IST
రయ్ రయ్ మని రాయల్ ఎన్ ఫీల్డ్...ఏపీకి గోల్డ్!
X

భారీ ఎత్తున పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి. సత్యవేడులో కారియర్స్ గ్లోబల్ సంస్థకు శంకుస్థాపన చేసిన తరువాత మాట్లాడుతూ నారా లోకేష్ చెప్పిన విధంగానే ఏపీకి అనేక భారీ సంస్థలు పెట్టుబడులు పెడతామని వరసగా క్యూ కడుతున్నాయి. అందులో లేటెస్ట్ గా చూస్తే రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ భారీ మొత్తంలో పెట్టుబడులు ఏపీలో పెట్టేందుకు రెడీ అయింది. తిరుపతిలో రాయల్ ఫీల్డ్ సంస్థ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

సత్యవేడు వద్ద :

తిరుపతి జిల్లా సత్యవేడు వద్ద రాయల్ ఎన్ ఫీల్డ్ ఏకంగా 2,200 కోట్ల రూపాయాలతో తమ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ని స్థాపించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ సంస్థ కనుక యూనిట్ ని ఏర్పాటు చేస్తే మూడు వేల మంది దాకా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. ఒక విధంగా రాయలసీమలో నిరుద్యోగ యువత ఆశలను తీర్చే విధంగా రాయల్ ఫీల్డ్ రానుంది అని అంటున్నారు. దీంతో ఆటోమొబైల్ సెక్టార్ లో అతి పెద్ద బూం ఏపీలో స్టార్ట్ అవుతుందని అంటున్నారు.

భారీగానే ప్రోత్సాహకాలు :

ఇదిలా ఉంటే రాష్ట్రంలోని కూటమి పభుత్వం రాయల్ ఫీల్డ్ సంస్థకు భారీ ఎత్తున ప్రోత్సాహకాలను అందిస్తోంది. 1,486 కోట్ల రూపాయలు విలువ చేసే ఇన్సెంటివ్స్ తో పాటు 267 ఎకరాల భూమిని కూడా సత్యవేడులో కేటాయిస్తోంది అని అంటున్నారు. ఇక ఈ సంస్థ రెండు దశలలో ఏపీలో తన యూనిట్ ని ఏర్పాటు చేయనుంది. అందులో తొలి దశలో 2029 నాటికి పూర్తి అవుతుందని రెండవ దశ 2032 నాటికి పూర్తి అవుతుందని అంటున్నారు. దాంతో యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా వచ్చే చాన్స్ ఉందని అంటున్నారు.

చెన్నైలో రెండు ఫ్యాక్టరీలు :

రాయల్ ఫీల్డ్ సంస్థకు చెన్నైకి దగ్గరలో రెండు ఫ్యాక్టరీస్ ఉన్నాయని అంటున్నారు. సౌత్ కొరియన్ ఆటోమోటివ్ దిగ్గజం హౄండయ్ మోటార్ కంపెనీ అనుబంధ సంస్థ అయిన రాయల్ ఫీల్డ్ అనంతపురం జిల్లాలోని పెనుకొండలో 536 ఎకరాల్లో తన అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ చూస్తే ఏటా మూడు లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తోంది. దీని ద్వారా మూడు వేల మంది వరకూ యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇక్కడే కియా మోటార్స్ ద్వారా ఏడు వేల మందికి పరోక్షంగా ఉద్యోగ కల్పన జరిగింది. దీంతో ఏపీ ఆటోమొబైల్ ఫీల్డ్ లో నంబర్ వన్ గా రాణించేందుకు కీలకమైన అడుగులు పడుతున్నాయని అంటున్నారు. రాయల్ ఫీల్డ్ తో రాజ కళ ముందుగా వచ్చేసినట్లే అని అంటున్నారు.