Begin typing your search above and press return to search.

ట్రంప్ తో భేటీ..అన్ ఫాలో చేసిన కోటి మంది ఫాలోవర్లు!

ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో జరిగిన భేటీ తర్వాత ఆయన ట్విట్టర్ ఖాతా నుండి ఏకంగా కోటి మంది ఫాలోవర్స్ అన్ ఫాలో కొట్టడం ఆశ్చర్యకరమనే చెప్పాలి. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

By:  Madhu Reddy   |   3 Dec 2025 1:41 PM IST
ట్రంప్ తో భేటీ..అన్ ఫాలో చేసిన కోటి మంది ఫాలోవర్లు!
X

సాధారణంగా కొన్ని కొన్ని కలయికలు దేశానికి మంచి చేకూరిస్తే.. మరి కొంతమంది కలయికలు ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను కలిగిస్తుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల కలయిక ఏకంగా అవతల వ్యక్తికి సోషల్ మీడియాలో అత్యంత దారుణమైన నష్టాన్ని కలిగించింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో జరిగిన భేటీ తర్వాత ఆయన ట్విట్టర్ ఖాతా నుండి ఏకంగా కోటి మంది ఫాలోవర్స్ అన్ ఫాలో కొట్టడం ఆశ్చర్యకరమనే చెప్పాలి. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

విషయంలోకి వెళ్తే.. ప్రపంచ ప్రఖ్యాత స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకి ఇప్పుడు ఎక్స్ వేదికగా భారీ షాక్ తగిలింది. దీనికి కారణం ఆయన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను కలవడమే ప్రధాన కారణం అంటూ కొంతమంది చర్చించుకుంటున్నారు. నవంబర్లో 115 మిలియన్లుగా ఉన్న ఆయన ఫాలోవర్ల సంఖ్య.. ప్రస్తుతం 105 మిలియన్లకు పడిపోయింది. సుమారుగా 10 మిలియన్లు అంటే మన ఇండియన్ లెక్క ప్రకారం కోటి మంది ఫాలోవర్లను క్రిస్టియానో కోల్పోయారు. ఇందుకు ప్రధాన కారణం ఫేక్ అకౌంట్ లు తొలగించడమే అంటూ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

దీనికి తోడు నవంబర్ 18న అమెరికా అధ్యక్షుడు ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదంగా మారుతున్న డోనాల్డ్ ట్రంప్ తో క్రిస్టియానో భేటీ కావడం కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ట్రంప్ అంటే ఇష్టం లేనివారు వారికి ఈ మీటింగ్ కోపం తెప్పించిందని, అందుకే క్రిస్టియానో రొనాల్డో ను అన్ ఫాలో కొట్టారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కేవలం కొన్ని రోజుల వ్యవధిలోని ఏకంగా కోటి మంది ఫాలోవర్లను కోల్పోవడం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది మరి దీనిపై క్రిష్టియానో రొనాల్డో ఏదైనా స్పందించాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు.

క్రిస్టియానో రోనాల్డో విషయానికి వస్తే.. పోర్చుగల్ దేశానికి చెందిన ఫుట్బాల్ ప్లేయర్ గా పేరు సొంతం చేసుకున్న ఈయన పోర్చుగల్ నేషనల్ జట్టుకి 2003 నుండి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ గొప్ప ఫుట్బాల్ ప్లేయర్లలో ఒకరిగా నిలిచిన ఈయన.. ఐదు బ్యాలన్ డీ ఓర్ అవార్డులు అలాగే నాలుగు యూరోపియన్ గోల్డెన్ షూస్ ను గెలుచుకున్నారు. పైగా ఈ రెండు రికార్డులు సాధించిన ఏకైక ఐరోపా ఆటగాడిగా పేరు దక్కించుకున్నారు. తన కెరియర్లో 30 ప్రధాన ట్రోఫీలను గెలుచుకున్న ఈయన.. వాటిలో ఏడు లీగ్ టైటిల్స్ ని కూడా దక్కించుకున్నారు. 100వ అంతర్జాతీయ గల్స్ ఘనత సాధించిన రెండవ ఆటగాడిగా.. ఐరోపా దేశాలలో మొదటి వాడిగా పేరు దక్కించుకున్నారు.