Begin typing your search above and press return to search.

భారీగా వెండిని కొనమంటున్న రిచ్ డాడీ పూర్ డాడీ రచయిత

పుస్తకంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి సుపరిచితమైన పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్. ప్రపంచంలో టాప్ 100 పుస్తకాల లెక్క తీస్తే.. అందులో ఈ పుస్తకం చోటు దక్కించుకుంటుందని చెబుతారు.

By:  Garuda Media   |   11 Feb 2026 10:41 AM IST
భారీగా వెండిని కొనమంటున్న రిచ్ డాడీ పూర్ డాడీ రచయిత
X

పుస్తకంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి సుపరిచితమైన పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్. ప్రపంచంలో టాప్ 100 పుస్తకాల లెక్క తీస్తే.. అందులో ఈ పుస్తకం చోటు దక్కించుకుంటుందని చెబుతారు. ఈ పుస్తక రచయిత పేరు రాబర్ట్ కియోసాకి. ప్రముఖ ఇన్వెస్టర్ గా.. ఆర్థిక నైపుణ్యంతో పాటు.. మనీ మేనేజ్ మెంట్ తో ఆయనకు మంచి పేరుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలోచురుగ్గా ఉంటున్న ఆయన.. ఆభరణాల కొనుగోలుతోపాటు.. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియలో పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఆసక్తికర సూచన చేశారు.

ఆయన చేసిన సూచన గురించి చెప్పే ముందు ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన్ను కానీ.. ఆయన చెప్పిన మాటల్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పినట్లుగా చేస్తారా? లేదా? అన్నది మీ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. సో.. ఇప్పుడు మేం చెప్పేదంతా ఒక సమాచారంగా మాత్రమే తీసుకోవాలే తప్పించి.. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ విచక్షణకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచన చేస్తున్నాం.

ఇక.. విషయంలోకి వెళితే ఇటీవల ఆయన వెండిని.. బంగారాన్ని కొనుగోలు చేయమని సలహా ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన రోజులో 600 సిల్వర్ ఈగల్స్ ను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. అమెరికాలో సిల్వర్ ఈగల్ అంటే.. ఒక్కొక్కటి ఒక్కో ఔన్స్ బరువు ఉన్నట్లు. ఇంతకూ ఔన్స్ ను మన గ్రాముల్లో చెప్పాల్సి వస్తే.. 31.035 గ్రాములకు సమానం. తాను కొన్న వెండి ఒక్కొక్క ఔన్స్ 82 డాలర్లుగా పేర్కొన్నారు.

ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే.. భవిష్యత్తులో వెండి ధర మరింత పెరిగే వీలుందని.. ముఖ్యంగా ఈ ఏడాదిలో వెండి ధర ఒక్కొక్క ఔన్స్ కు 200 డాలర్లకు చేరుకోవచ్చన్న ఆయన.. అంతకు మించి పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పటం చూస్తే.. వెండికి రానున్న రోజుల్లో ఇంత భారీగా డిమాండ్ నెలకొంటుందని చెబుతున్నారు. ఇక.. ఆయన చెప్పిన లెక్కల్ని అంకెల్లోకి చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

ఒక ఔన్స్ అంటే 31.03 గ్రాములు. ఆయన చెప్పిన ధర ప్రకారం చూస్తే.. వంద గ్రాములకు మన రూపాయిల్లో ఎంత ధర పడుతుందన్న లెక్కల్లోకి వెళితే.. ఒక ఔన్స్ వెండి ధర రూ.7395గా చెప్పాలి. ఇక.. 600 ఈగిల్స్ అంటే.. 600 ఔన్స్ లుగా చెప్పాలి. కేజీల్లో చెప్పాల్సి వస్తే.. 18.66 కేజీలతో సమానం. ఇక ధర విషయానికి వస్తే.. 600 ఔన్సులకు వెండి అంటే.. సుమారు రూ.44.37 లక్షలుగా చెప్పాలి.

మన లెక్కల ప్రకారం చూస్తే.. మన దగ్గర మూడు శాతం జీఎస్టీని కలిపితే.. ఈ పెద్ద మనిషి రోజు వ్యవధిలో కొన్న వెండి విలువ రూ.48 - రూ.50 లక్షల మధ్యలో ఉన్నట్లుగా చెప్పాలి. ఇంతకూ ఆయన ఇంత భారీగా ఎందుకు వెండిని కొనుగోలు చేయాల్సి వచ్చిందన్న మాటకు ఆయన ఏం చెప్పారంటే.. ‘‘ఇప్పటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా డాలర్ స్థితి ఆందోళనకరంగా మారుతోంది. అధిక రుణాలు.. ద్రవ్యోల్బణం లాంటి కారణాలతో డాలర్ విలువ క్రమంగా తగ్గే వీలుంది. ఈ పరిస్థితుల్లో కాగినపు కరెన్సీ మీద ఆధారపడేవాళ్లు భవిష్యత్తులో నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అంటూ ఆయన చేసిన సూచన ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.