Begin typing your search above and press return to search.

ఇంట్రస్టింగ్... సిమెంట్ కు బాయ్.. 'సీసీఆర్ఈ'కి హాయ్!

అవును... రాయల్ మెల్ బోర్న్ ఇనిస్టిట్యుట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు నిర్మాణంలో సిమెంట్ ను భర్తీ చేయగల కొత్త నిర్మాణ సామాగ్రిని అభివృద్ది చేసినట్లు చెబుతున్నారు.

By:  Raja Ch   |   23 Dec 2025 5:00 PM IST
ఇంట్రస్టింగ్... సిమెంట్  కు బాయ్.. సీసీఆర్ఈకి హాయ్!
X

ఎవరు ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేసుకున్నా తొలుత సిమెంట్ ధర గురించి వెతుకుతారనే సంగతి తెలిసిందే. పునాదుల నుంచి స్థంభాలు, స్లాబ్, ప్లాస్టింగ్ అన్నింటికీ ఈ సిమెంట్ అనే పదార్ధమే వెన్నెముక. ఈ క్రమంలో సిమెంట్ ధరల్లోని చిన్న చిన్న మార్పు కూడా మొత్తం నిర్మాణ బడ్జెట్ ను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా సిమెంట్ కు ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు!

అవును... రాయల్ మెల్ బోర్న్ ఇనిస్టిట్యుట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు నిర్మాణంలో సిమెంట్ ను భర్తీ చేయగల కొత్త నిర్మాణ సామాగ్రిని అభివృద్ది చేసినట్లు చెబుతున్నారు. మట్టి, నీరుతో పాటు ప్రధానంగా రీసైకిల్ చేసిన కార్డ్ బోర్డ్ ను ఉపయోగించి ఈ ఆవిష్కరణ చేసినట్లు చెబుతున్నారు. పరిశోధకులు దీనికి కార్డ్ బోర్డ్ కన్ఫైన్డ్ రామ్డ్ ఎర్త్ (సీసీఆర్ఈ) అని నామకరణం చేశారు. దీనికి సంబంధించిన విషయాలు ఆసక్తిగా మారాయి.

ప్రపంచ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలలో సిమెంట్ ఉత్పత్తి 8% దోహదం చేస్తోందని చెబుతోన్న నేపథ్యంలో దీని అభివృద్ధి పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అందర్భంగా స్పందించిన ఆస్ట్రేలియాలోని రాయల్ మెల్ బోర్న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఆర్ఎంఐటీ) పరిశోధకులు.. ఒకటి రెండు సంవత్సరాలలో ఈ కొత్త పదార్ధం సీసీఆర్ఈ.. వాణిజ్య పరీక్షకు సిద్ధంగా ఉండవచ్చని తెలిపారు.

నివేదికల ప్రకారం... కాంక్రీటు, ఉక్కుపై ఆధారపడిన నిర్మాణ రంగం.. ప్రపంచ కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలలో సుమారు 37 శాతం వాటాను కలిగి ఉంది. ఇదే సమయంలో.. ఇ-కామర్స్ ప్యాకేజింగ్ కి సంబంధించిన వేగవంతమైన పెరుగుదల కారణంగా ప్రపంచం వ్యర్ధం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సమస్యలకూ ఆర్ఎంఐటీ తయారు చేసిన సీసీఆర్ఈ ఒకేసారి పరిష్కారం చూపిస్తుందని చెబుతున్నారు.

2020-21లో కేవలం ఒక్క ఆస్ట్రేలియాలోనే వ్యర్థాల్లో కార్డ్ బోర్డు, కాగితం వ్యర్థాలు సుమారు 7.7 శాతం ఉన్నాయని.. 2.2 మిలియన్ టన్నులుగా ఉన్న ఈ మొత్తం పల్లపు ప్రాంతాలకు తరలించబడ్డాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో అటు పర్యావరణం, ఇటు భవన నిర్మాణ పరిశ్రమ.. రెండింటింకీ ప్రయోజనం చేకూర్చేదే సీసీఆర్ఈ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వాస్తవానికి ఈ పద్ధతి పురాతన నిర్మాణ పద్ధతుల నుంచి తీసుకోబడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందులో భాగంగా.. ప్రజలు వేల సంవత్సరాల క్రితం బంకమట్టి, ఇసుక, చిన్న రాళ్లు, నీటిని కలిపి.. ఆ మిశ్రమాన్ని అచ్చులలోకి నొక్కి గొడలు, నిర్మాణాలను నిర్మిచారని.. ఇదే క్రమంలో.. సీసీఆర్ఈ ఆధునిక పదార్థాలను ఉపయోగించి ఈ ఆలోచనను నవీకరిస్తుందని అన్నారు. ఈ పదార్థం పగటి పూట వేడిని గ్రహిస్తుందని.. రాత్రిపూట నెమ్మదిగా విడుదల చేస్తుందని చెబుతున్నారు