Begin typing your search above and press return to search.

ఫైర్ బ్రాండ్ రోజా సైలెంట్...నగరిలో ఏమి జరుగుతోంది ?

నగరి నుంచి మూడు సార్లు టికెట్ వైసీపీ నుంచి తెచ్చుకుని రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా మంత్రి కూడా అయిన వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా 2024 ఎన్నికల్లో మాత్రం ఏకంగా నలభై వేల ఓట్ల తేడాతో ప్రత్యర్ధి టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ చేతిలో ఓటమి పాలు అయ్యారు.

By:  Satya P   |   24 July 2026 9:10 AM IST
ఫైర్ బ్రాండ్ రోజా సైలెంట్...నగరిలో ఏమి జరుగుతోంది ?
X

నగరి నుంచి మూడు సార్లు టికెట్ వైసీపీ నుంచి తెచ్చుకుని రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా మంత్రి కూడా అయిన వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా 2024 ఎన్నికల్లో మాత్రం ఏకంగా నలభై వేల ఓట్ల తేడాతో ప్రత్యర్ధి టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ చేతిలో ఓటమి పాలు అయ్యారు. ఓటమి తర్వాత మొదట్లో వైసీపీ తరఫున కొంత హడావుడి చేసినా గడచిన కాలమంతా ఆమె అయిపూ అజా లేకుండా పోయారని అంటున్నారు. వైసీపీలోనే దీని మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోందిట. అసలు పాత రోజా ఏమైపోయారు అని కూడా అంటున్నారు. ఏపీలో అయితే వైసీపీ ఫుల్ చార్జ్ అయింది వరసబెట్టి ఆందోళనలు చేస్తోంది. అంతే కాదు కూటమి ప్రభుత్వం మీద మాజీ మంత్రులు కీలక నేతలు అంతా మాట్లాడుతున్నారు, విమర్శలు కూడా ధాటీగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజా మాత్రం సైలెంట్ అవడం మీద అంతటా డిస్కషన్ సాగుతోంది.

ఆమె మకాం అక్కడేనా :

ఇదిలా ఉంటే రోజా చెన్నైకి మకాం మార్చేశారు అని కూడా అంటున్నారు. ఆమె తమిళ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు అని అంటున్నారు. అలాగే బుల్లి తెర మీద ఆమె కనిపిస్తున్నారు. ఆమె నటించిన లేటెస్ట్ తమిళ చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది అని అంటున్నారు. ఆమె ఈ విధంగా ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు అని అంటున్నారు. ఇక నగరిలో వైసీపీకి ఆమె ఇంచార్జిగా ప్రస్తుతం ఉన్నా అక్కడ పార్టీ కార్యక్రమాలేవీ పెద్దగా జరగడం లేదని అంటున్నారు. ఆమె కూడా గతంలో మాదిరిగా దూకుడుగా రాజకీయాలు చేయడం లేదని అంటున్నారు. దానికి కారణం నగరిలో వర్గ పోరు ఉందని అంటున్నారు. అలాగే చిత్తూరు జిల్లాలో సీనియర్ నేతలతో పాటు పెద్ద దిక్కు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో ఉన్న విభేదాలు రోజా పెద్దగా రాజకీయంగా కనిపించకపోవడానికి కారణాలు అని అంటున్నారు.

అది కూడా రీజనేనా :

అంతే కాదు ఆమె మంత్రిగా ఉండగా ఆడుదాం ఆంధ్రా పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. దాని మీద కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఏమైనా స్పీడ్ చేస్తే కేసులతో చిక్కులు తప్పవన్న భయం కూడా ఉంది అని అంటున్నారు. మొత్తం మీద రోజా అయితే సేఫ్ జోన్ లో ఉంటున్నారని తన పూర్వాశ్రమం అయిన వెండి తెరను అలాగే బుల్లి తెరను నమ్ముకున్నారని అంటున్నారు. రాజకీయాల్లో ఆమెకు ఇంకా తగిన సమయం రాలేదని భావిస్తున్నారని కూడా చెబుతున్నారు.

పార్టీ ఆలోచనలేంటి :

ఇక చూస్తే వచ్చే ఎన్నికల్లో నగరి టికెట్ ని బీసీలకు పార్టీలో కీలక నేతలకు లోకల్స్ కి ఇవ్వాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచన చేస్తోంది అని ప్రచారం సాగుతోంది. పార్టీ కోసం రోజా పనిచేస్తే గుర్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పారని కూడా గతంలో ప్రచారం సాగింది. ఇక రోజాకు మూడు సార్లు టికెట్లు అధినాయకత్వం ఇచ్చిందని అంటున్నారు. ఈసారి పక్కా లోకల్ లీడర్ కి బీసీలకి చాన్స్ ఇవ్వడం ద్వారానే గాలి కుటుంబానికి చెక్ చెప్పాలని వ్యూహం రచిస్తున్నారు అని అంటున్నారు. మరి ఈ విషయాల వల్లనే రోజా కూడా రాజకీయంగా ఆసక్తిని తగ్గించుకున్నారా అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా ఫైర్ బ్రాండ్ రోజా వాయిస్ అయితే ఇటీవల కాలంలో పెద్దగా వినిపించడం లేదు, స్థానిక సంస్థలకు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇంచార్జిలదే గెలుపు బాధ్యత అని జగన్ చెబుతున్నారు. మరి వాటి ఫలితాలను బట్టి ఒక్క నగరిలోనే కాదు ఏపీలో అనేక నియోజకవర్గాలలో సమూలమైన మార్పులు ఉండొచ్చు అని అంటున్నారు.