బీహార్ దంగల్: మానాన్న మైండ్ పనిచేయట్లేదు!
తేజస్వి యాదవ్ ఇప్పుడు పార్టీ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో చూస్తున్నారు. ఆయననే ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు.
By: Garuda Media | 16 Oct 2025 12:00 AM ISTబీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)లో సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఈ పార్టీ కాంగ్రెస్ తో కలిసి మహాఘట్ బంధన్‌గా ఏర్పడింది. సీట్ల పంపకాలు ఇంకా పూర్తికాలేదు. దీనిపైనే నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఆర్జేడీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న మాజీ సీఎం లాలూ ప్రసాద్‌యాదవ్‌కు, ఆయన కుమారుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు మధ్య తీవ్ర వివాదాలు తలెత్తాయి.
తేజస్వి యాదవ్ ఇప్పుడు పార్టీ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో చూస్తున్నారు. ఆయననే ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అనారోగ్యం కారణాలతో లాలూ ప్రసాద్.. వీల్ చైర్‌కే పరిమితం అయ్యారు. ఈ పరిణామాలతో టికెట్ల వ్యవహారం కూడా తేజస్వీనే చూస్తున్నారు. కానీ, అకస్మాత్తు గా.. లాలూ ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. ప్రస్తుతం యువతకు పెద్ద పీట వేయాలని చూస్తున్న తేజస్వి.. ఆ విధంగానే టికెట్లను పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు.
60 ఏళ్లు దాటిని వారిని దాదాపు పక్కన పెట్టాలని తేజస్వీ భావిస్తున్నట్టు పార్టీ వర్గాల్లోనూ ప్రచారం జరుగు తోంది. ఈ నిర్ణయం పార్టీలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న సీనియర్లకు కంట్లో నలుసుగా మారింది. మరీ ముఖ్యంగా వరుసగా నాలుగు సార్లు విజయం దక్కించుకున్న వారిని కూడా పక్కన పెడుతున్నారన్న చర్చ తెరమీదికి వచ్చింది. దీంతో పార్టీలో సీనియర్లు అందరూ.. లాలూ ప్రసాద్ యాదవ్‌ను మచ్చిక చేసుకున్నారు. ఢిల్లీలో సీట్ల పంపిణీపై చర్చలకు తేజస్వి వెళ్లిన సమయంలో వారంతా లాలూను కలిశారు.
తమ తమ అనుబంధాలను గుర్తు చేసి.. లాలూ నుంచి సుమారు 40 మంది వరకు టికెట్లు తీసుకున్నారు. నిజానికి బీఫాం ఇవ్వాలి. కానీ, లాలూ వారికి టికెట్లు ఇస్తున్నట్టు ప్రకటించారు. తన లెటర్ హెడ్‌తో కూడిన పత్రాలను వారికి ఇచ్చేశారు. రేపు తేజస్వీ వీరిని కాదని వేరే వారికి టికెట్ ఇస్తే.. అసలు కే మోసం వస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన తేజస్వి.. హుటాహుటిన ఢిల్లీ నుంచి పట్నా చేరుకుని.. ఎవరైతే.. టికెట్లు తీసుకున్నారో.. వారిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ వారు తిరిగి ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు లాలూ వర్సెస్ తేజస్విల మధ్య యుద్ధం ప్రారంభమైంది. తన తండ్రి మతిస్థిమితం బాగోలేదని ఆయన వ్యాఖ్యానించారు.
