Begin typing your search above and press return to search.

మెట్రో స్టేషన్ లో ప్రసవం.. అదిరే నిర్ణయం తీసుకున్న అధికారులు

నిత్యం రద్దీగా ఉంటూ.. హడావుడిగా తిరిగే ప్రయాణికులతో సందడిగా ఉంటే మెట్రో స్టేషన్ లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది.

By:  Garuda Media   |   24 Jan 2026 11:00 AM IST
మెట్రో స్టేషన్ లో ప్రసవం.. అదిరే నిర్ణయం తీసుకున్న అధికారులు
X

నిత్యం రద్దీగా ఉంటూ.. హడావుడిగా తిరిగే ప్రయాణికులతో సందడిగా ఉంటే మెట్రో స్టేషన్ లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. నిండు చూలాలు మైట్రో రైల్ లో ప్రయాణించే వేళ ఆమెకు పురిటి నొప్పులు రావటం.. ఆ వెంటనే స్పందించిన మెట్రో సిబ్బంది ఆమెకు ప్రసవం అయ్యేలా చేశారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో ఈ ఊహించని ఘటన చోటు చేసుకుంది. రియాద్ మెట్రో చరిత్రలో ఇలాంటి ఘటన జరగటం ఇదే తొలిసారి.

రియాద్ లోని అల్ అందలస్ మెట్రో స్టేషన్ లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా.. ఆరోగ్యంగా ఉన్నారు. నిండు గర్భిణి మహిళ మెట్రో స్టేషన్ లో ఉన్న వేళలో ఆమెకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావటంతో.. అంబులెన్సుకు సమాచారం ఇచ్చారు. అయితే.. అంబులెన్సు వచ్చేందుకు సమయం పట్టటం.. ఆ సమయానికే స్టేషన్ లోని మహిళా అధికారులు కలిసి ఆమెకు డెలివరీ చేశారు.

ఈ అరుదైన ఘటనకు అనూహ్య రీతిలో స్పందించింది రియాద్ మెట్రో. కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. తమ మెట్రో చరిత్రలో మొదటిసారి చోటు చేసుకున్న ఈ ఘటనకు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ఆ బిడ్డ తల్లిదండ్రులకు ఏడాది పాటు చెల్లుబాటు అయ్యే రెండు ఫస్ట్ క్లాస్ దర్బ్ కార్డులను మెట్రో గిఫ్టుగా అందించారు. ఈ గిఫ్టు కార్డుతో ఏడాది పాటు మెట్రోలో ఉచితంగా ప్రయాణించే వీలుంటుంది. అంతేకాదు.. అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా స్పందించిన మెట్రో అధికారులకు.. డెలివరీ చేసిన సిబ్బందిని ఉన్నత అధికారులు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ ఉదంతం సౌదీలో వైరల్ గా మారింది. మెట్రో సిబ్బంది స్పందించిన వైనంపై హర్షం వ్యక్తమవుతోంది.