40లలో మాయ రోగం వెనక 'పూరి మ్యూజింగ్స్' కనెక్షన్!
పొద్దున్నే టీవీ చానెల్ పెడితే.. వీలున్నప్పుడు యూట్యూబ్ వెతికితే ప్రతి నిమిషానికి ఒక వీడియోలో అక్రమ సంబంధాల గోలే.
By: Sivaji Kontham | 6 May 2026 11:00 PM ISTపొద్దున్నే టీవీ చానెల్ పెడితే.. వీలున్నప్పుడు యూట్యూబ్ వెతికితే ప్రతి నిమిషానికి ఒక వీడియోలో అక్రమ సంబంధాల గోలే. ఈ గోల భూమి భరించలేనిదిగా మారుతోంది. అనునిత్యం పెళ్లయిన యువతి కామ లీలల గురించో.. భర్త- పిల్లలను హత్య చేసి ప్రియుడితో పారిపోయిన మ్యారీడ్ యువతి అనో.. పాత స్నేహం కాపురంలో చిచ్చు పెట్టిందనో భయానక వార్తలు వింటూనే ఉన్నాం. హనీమూన్ మర్డర్ లాంటి టైటిళ్లతో మీడియాలు ఈ కథనాలను హైలైట్ చేస్తుంటే, అసలు సమాజం ఎటు పోతోంది? అనే ఆవేదన కనిపిస్తోంది.
నిజామాబాద్, బెజవాడ, వైజాగ్, హైదరాబాద్ .. ప్లేసు ఏదైనా ఈ తరహా వివాహేతర సంబంధాల గొడవలు, పోలీస్ కేసులు, హత్యోదంతాలు నిరంతరం వార్తల్లో మార్మోగుతున్నాయి. ఇటీవల సంగారెడ్డి జిల్లాలో ఒక మహిళ కూడా పాత స్నేహితుడి పరిచయంతో మొదలైన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని కన్న పిల్లలనే చంపేసిన ఉదంతం అందరినీ కలవరపాటుకు గురి చేసింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. పాత స్నేహితులు కలిసి పార్టీలు చేసుకుని ఆ తర్వాత పాత ప్రేమల్ని గుర్తు చేసుకుని 40లలో అక్రమ సంబంధాలతో రచ్చ చేయడంతో ఇదంతా జరుగుతోంది.
భార్యా భర్తల మధ్య గొడవలు చినికి చినికి గాలై చివరికి క్రైమ్ గా మారుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితికి పూరి జగన్నాథ్ లాంటి సినీ దర్శకుడు ఇచ్చే విశ్లేషణ వేరుగా ఉంటుంది. ఇటీవల `పూరి మ్యూజింగ్స్`లో భార్యా భర్తల మధ్య శృంగాక కోరికలు కేవలం ఐదేళ్లలో ఎలా అంతమవుతాయో పూరి చెప్పిన తీరు వాస్తవాన్ని ప్రతిబింబిస్తోంది. మొదటి రెండేళ్లు కాస్తో కూస్తో భార్యా భర్తల మధ్య ఆకర్షణ ఉంటుంది. కొన్ని సంవత్సరాలకే భర్తలో భార్యకు మన్మథుడు కనిపించడని, అసలు శృంగారం అవసరమే లేదు! అన్నట్టు పరిస్థితి మారిపోతుందని పూరి చెప్పారు.
20 వయసులో పెళ్లాడితే 40లలోకి వచ్చేప్పటికి పరిస్థితులు ఇంకా ఎంత అధ్వాన్నంగా మారతున్నాయని ఆధునిక సంబంధాలు చెబుతున్నాయి. 20 వయసులో పెళ్లాడితే ``పూరి మ్యూజింగ్స్``లో చెప్పినట్టు ఐదేళ్లకే భార్యా భర్తల మధ్య శృంగారంపై ఆసక్తి తగ్గిపోయాక 40లలో పరిణామాలు ఎలా మారతాయో సంఘంలోని నిజ ఘటనలు నిరూపిస్తున్నాయి. తీవ్ర భావోద్వేగాలకు దారుణాలకు సంబంధించిన వార్తలు వినాల్సొస్తోంది. స్నేహితుల పునఃకలయికలో పాత ప్రేమలు కొత్తగా చిగురిస్తే కాపురంలో కల్లోలమే. అయితే 35-40 మధ్య వయస్కులకు పెళ్లయినా ఐదేళ్ల తరవాత కొత్త ప్లెజర్స్, శృంగారంలో ప్రయోగాలు కోరుకోవడం చాలా సహజప్రక్రియగా మారిపోయింది. దీనికి అశ్లీల వెబ్ సైట్లు, డేటింగ్ యాప్ లు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయనే విశ్లేషణలు ఉన్నాయి. అయితే క్షణికావేశంలో ఇలాంటివి జరిగినా కానీ డ్యామేజ్ పెద్దగా ఉంది. కుటుంబ జీవనం సర్వనాశనమవుతోంది. తల్లిదండ్రులు లైఫ్ లో కిడ్స్ కి భరోసానివ్వాల్సిన సమయంలో ఇవి దారుణాలుగా మారడం ఇటీవల చర్చగా మారుతోంది.
ఈరోజుల్లో అంగరంగ వైభవంగా జరిగే పెళ్ళిళ్లలో పెటాకులు చాలా ఎక్కువగా చూస్తున్నాం. దీనికి కారణం దంపతుల మధ్య ఏర్పడే భావోద్వేగ దూరం.. శృంగారంలో నిర్లిప్తత కారణంగానే వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయని.. ముఖ్యంగా మహిళల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. భర్త నుండి సరైన గుర్తింపు, ఆత్మీయత, మానసిక మద్దతు లభించని పక్షంలో మహిళలు బయటి వ్యక్తుల వైపు ఆకర్షితులవుతున్నారని తాజా కథనాలు వెల్లడిస్తున్నాయి. కేవలం శారీరక అవసరాల కంటే కూడా మనసును పంచుకునే తోడు కోసమే ఈ అక్రమ సంబంధాలు ఏర్పడుతున్నాయని.. ఒంటరితనం, కమ్యూనికేషన్ లోపం కుటుంబ వ్యవస్థలో తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఈ కథనం విశ్లేషించింది.
